ఒక్క వీడియో 125 దేశాలు 10 వేల కోట్లు…!

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉంటున్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో భారతీయ సినిమా

Post Published By: dialnews
Updated : 30 April 2026, 9:50 PM IST

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉంటున్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో భారతీయ సినిమా సత్తాను గ్లోబల్ వేదికలపై చాటిచెప్పిన రాజమౌళి, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 'వారణాసి' అనే భారీ అడ్వెంచరస్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మెక్సికోలో జరిగిన CCXP వేడుకల్లో సందడి చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. రాజమౌళి తన ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’తో గ్లోబల్ బాక్సాఫీస్‌పై కన్నేశారు. సాధారణంగా భారతీయ సినిమాలకు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంచి మార్కెట్ ఉంటుంది. కానీ రాజమౌళి ఈసారి టాలీవుడ్ ఇంతవరకు టచ్ చేయని దక్షిణ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల మెక్సికోలో జరిగిన CCXP వేడుకల్లో రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.

సినిమా మేకింగ్ వెనుక ఉన్న కష్టాన్ని, విజువల్స్ పట్ల వారు తీసుకుంటున్న జాగ్రత్తలను వివరిస్తూ కొన్ని ప్రత్యేక దృశ్యాలను ప్రదర్శించారు. ఇది అక్కడ ఉన్న అంతర్జాతీయ సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ చిత్రాల తరహాలో ‘వారణాసి’ మేకర్స్ గ్లోబల్ బ్రాండ్ ఇంటిగ్రేషన్ కోసం 'స్కైబ్లూ సినిమాటిక్స్' అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేవలం ప్రకటనల కోసం కాకుండా, అంతర్జాతీయ బ్రాండ్లను కథలో భాగంగా ఆర్గానిక్‌గా చూపించబోతున్నారు. దీనివల్ల సినిమాకు గ్లోబల్ లుక్ రావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అదనపు ఆదాయ మార్గాలు మెరుగుపడనున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఇప్పటికే సుమారు 250 కోట్ల భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. భారతీయ సినీ చరిత్రలో ఈ స్థాయిలో రేటు పలకడం ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.

ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర' అనే సాహసికుడి పాత్రలో కనిపించబోతున్నారు. కథ ప్రపంచంలోని వివిధ దేశాలతో ముడిపడి ఉండటం వల్ల, అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం సులభంగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే ఒక పాట చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, మే తొలి వారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ జరుపుకోనుంది. ఇందులో మహేష్ బాబుపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రాన్ని సుమారు 125 దేశాల్లో, భారీ స్థాయిలో IMAX ఫార్మాట్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఓవరాల్ రన్ లో పదివేల కోట్లు టార్గెట్ గా రెడీ అవుతున్న వారణాసి కోసం రాజమౌళి రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు. రాజమౌళి విజన్, మహేష్ బాబు క్రేజ్ తోడైతే ‘వారణాసి’ చిత్రం భారతీయ సినిమాకు లాటిన్ అమెరికా వంటి కొత్త దేశాల్లో శాశ్వత మార్కెట్‌ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించే ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 30 April 2026, 9:50 PM IST