మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఆసియా మార్కెట్ ని టార్గెట్ చేశాడా? లేదంటే గ్లోబల్ మార్కెట్ మీదే కన్నేశాడా అన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ దొరకలేదు. కాని డ్రాగన్ తో పాటు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అన్నీ పాన్ వరల్డ్ కంటెంట్ లే అన్న క్లారిటి వచ్చేసింది. దానికి కారణం ఇంగ్లీష్ వర్షనే అనితెలుస్తోంది. డ్రాగన్ కి ఇప్పటి వరకు డైరెక్టర్ ఒక్కడే.. ఎడిటర్ కూడా ఒక్కడే అనుకున్నారు. కాని ఎడిటర్లు ఇద్దర్ని అపాయింట్ చేయటమే ఇక్కడ ట్విస్ట్.. హాలీవుడ్ సీరీస్ పీకీ బ్లైండర్స్ ని ఎడిట్ చేసిన, పాల్ నైట్ ఎడిటర్ గా వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది. పీకీ బ్లైండర్స్ సీరీస్ కి చాలామంది ఎడిటర్స్ పని చేసినా, కీ ఎడిటర్ మాత్రం పాల్ నైటే.. వరల్డ్ వెబ్ సీరీస్ ప్లాట్ ఫాం ని కుదిపేసిన ఈ మాస్టర్ పీస్ లాంటి ప్రాజెక్ట్ ని ఎడిట్ చేసిన, టెక్నీషియన్ ని రంగంలోకి దింపటంతో, డ్రాగన్ గ్లోబల్ సినిమాగా కన్ఫామ్ చేసుకోవచ్చా? మరి దేవర 2 పరిస్థితేంటి? ఇది కూడా గ్లోబల్ గా ముందుకెళ్లబోతోందా?
పాన్ ఆసియా, పాన్ వరల్డ్ ట్రెండ్ నడుస్తున్న వేల, డ్రాగన్ దారెటనే ప్రశ్న మొదటి నుంచి వినిపిస్తూనే ఉంది. ఐతే డ్రాగన్ కథ, కథనాలు, పరంగా చూస్తే నార్త్ ఈస్ట్ డ్రగ్ మాఫియా, అలానే ఇండో, చైనా, బూటాన్ ఏరియాచుట్టు కథ తిరుగుతుందని మాత్రం హింట్ ఇచ్చింది ఫిల్మ్ టీం. అందుకే ఇది చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా మార్కెట్ లని టార్గెట్ చేస్తూ తీస్తున్న సినిమా అనుకున్నారు.అందులో నిజమున్నా, మార్కెట్ పరంగా ఇది కేవలం సౌత్ ఏషియాకే పరిమితం చేయకుండా, గ్లోబల్ గా డ్రాగన్ ని రిలీజ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంగ్లీష్ వర్షన్ మీద క్లారిటీ రావటంతొనే ఇప్పుడు డ్రాగన్ పాన్ ఆసియా మూవీ మాత్రమే కాదు, పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కాబోయే సినిమాగా క్లారిటీ వస్తోంది. ఆవిషయాన్నే ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ ఎడిటర్ తో కన్పామ్ చేస్తున్నారు.
బ్రిటీష్ వెబ్ సీరీస్ లలో టాప్ ప్లేస్ లో ఉండే పీకీ బ్లైండర్ సీరీస్ ని చాలా మంది ఎడిటి చేశారు. కానీ పౌల్ నైటే ఈ సీరీస్ కి కీ ఎడిటర్... అలాంటి తనని డ్రాగన్ ఇంగ్లీష్ వర్షన్ కి ఎడిటర్ గా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే ఇంగ్లీష్ లోకి డ్రాగన్ ని అనువధిస్తారా అన్న డౌట్లు రావొచ్చు.. అలా కాకకుండా సినిమాలో ఎక్కువ టాకీ పార్ట్ ఉన్న మేజర్ సీన్స్ అన్నీ, తెలుగు, హిందీతో పాటు, ఇంగ్లీష్ లో ఒకేసారి తీస్తున్నారట.ఇక కొన్ని టాకీ పార్ట్స్ మాత్రం డబ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలా రెడీ చేసే ఇంగ్లీష్ వర్షన్ ని పౌల్ నైట్ ఎడిట్ చేయబోతున్నాడు. అది హాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్ తగ్గట్టు క్రిస్పీగా ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
తనకే 45 కోట్లు సమర్పించుకుంటోంది ఫిల్మ్ టీం. అంతేకాదు, పీకీ బ్లైండర్స్ వెబ్ సీరీస్ వరల్డ్ ఫేమస్ కాబట్టి, ఆ సినిమా టెక్నీషియన్ ని ఈ మూవీకి వాడుతున్నారంటే, అది కూడా గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా ఉపయోగ పడుతుంది. మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అవటంతో కలిసొస్తుంది.ఆ ఒక్కటే కాదు, దేవర 2, త్రివిక్రమ్ మేకింగ్ లో ప్లాన్ చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ కూడా పౌల్ నైట్ తోనే ఎడిట్ చేయించబోతున్నరని తెలుస్తోంది. మొత్తంగా నాలుగు ప్రాజెక్టులకు సంబంధించి తనతో అగ్రిమెంట్ ఆల్ మోస్ట్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. అసలు ఆయన్ని ప్రశాంత్ నీల్ కి పరిచయం చేసింది మాత్రం సందీప్ రెడ్డి వంగనే.. అందుకే తను కూడా స్పిరిట్ కోసం ఏమైనా ఆ ఎడిటర్ సాయం తీసుకుంటున్నాడా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. తనే సొంతంగా యానిమల్ ని ఎడిట్ చేయటం వల్ల కొన్ని విమర్శలొచ్చాయి.. కాబట్టే ఇలాంటి అనుమానాలు పెరుగుతున్నాయి.