మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 90 రోజులు ఛాలెంజ్ కి రెడీ అయ్యాడు. ఇప్పటికే డ్రాగన్ లో రెండు పాత్రలు వేస్తున్నాడు. ఒక పాత్రకోసం 10 కిలోలు, మరో పాత్రకోసం మరో 4 కిలోలు అదనంగా తగ్గాడు. బక్క చిక్కి బ్రూస్లీగా మారాడు. కట్ చేస్తే ఇప్పడు చైనీస్ లెజెండ్ బ్రూస్లీ లానే పిడిగుద్దులు గుద్దబోతున్నాడు. 3 వేల ఏళ్ల నాడి యోధుడిగా మారబోతున్నాడు. పాన్ ఆసియా మూవీ గా రెడీ అవుతున్న డ్రాగన్ లో నిజంగా 3 వేల ఏళ్ల కిందటి యుద్దకలలు వాడుతోంది ఫిల్మ్ టీం. కేరళా యుద్ద కళ కలరి పయట్టు ని 90 రోజుల్లో బేసిక్ లెవల్ లో నేర్చుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. వారణాసి మూవీలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ యుద్ధకళ నేర్చుకోవాల్సి వచ్చింది. కాని డ్రాగన్ లో ఎన్టీఆర్ వేసే పాత్ర పరంగా, ఆ యుద్ద కళ మీద మరింత గ్రిప్ సాధించాల్సి వస్తోంది. అందుకోసం 90 రోజుల అత్యంత కఠినమైన శిక్షణకు రెడీ అయ్యాడా? ఆల్రెడీ తన కోసం బాలీవుడ్ డాన్స్ మిషన్ గోవింద హైద్రబాద్ ల్యాండ్ అయ్యాడంటున్నారు.. ఇంతకి డ్రాగన్ కి కళరి పయట్టు తో పాటు హిందీ స్టార్ గోవిందకి ఎన్న లింకేంటి?
వారణాసి సూపర్ స్టార్ మహేశ్ కి ఎంత ప్రెస్టీజో కాని, అంతకు మించే సర్ ప్రైజులు 700 కోట్ల డ్రాగన్ తో ఇచ్చేలా ఉన్నాడు ఎన్టీఆర్.. అది 1400 కోట్ల సినిమా.. ఇది అందులో సగం 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ.. కాకపోతే డ్రాగన్ కి, వారణాసికి పోలికలు పెట్టడానికి మూడు కారణాలున్నాయి.. ఒకటి రాజమౌళి తర్వాత అంతటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అవటం..ఇటు బాహుబలితో రాజమౌలి అటు కేజీయఫ్ తో ప్రశాంత్ నీల్ ట్రెండ్ సెట్ చేయటం.. మూడు పాన్ ఇండియా హిట్లు ఈ ఇద్దరు దర్శకులకు ఉండటంతో, వీళ్ల మేకింగ్ లో మహేశ్, ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలకు పోలికలు పెరగటం కామన్. కాకపోతే వారణాసి పాన్ వరల్డ్ మూవీ.. డ్రాగన్ మాత్రం పాన్ ఆసియా సినిమా.. అలాని పాన్ వరల్డ్ ని వదిలేసినట్టు కాదు. మొదటి భాగం పాన్ ఆసియాగా వస్తుంటే, దాని సీక్వెల్ పాన్ వరల్డ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదో విచిత్రమైన స్ట్రాటజీలా ఉంది. ఇక వారణాసిలో మహేవ్ రుద్రుడు, శివుడు, రాముడిగా కనిపిస్తుంటే, డ్రాగన్ లో ఎన్టీఆర్ తాతగా, తండ్రిగా రెండు పాత్రలు వేస్తున్నాడు. ఈరెండూ కూడా రెండు భాగాలుగా రాబోతున్న సినిమాలే. ఐతే ఇందులో మరో కామన్ పాయింట్ కలరి పయట్టు.. 3 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కలరి పయట్టుని నేర్చుకునేందుకు రెడీ అయ్యాడు ఎన్టీఆర్..ఆల్రెడీ 30 నుంచి 55 రోజలుు కలరి పయట్టులో ట్రైనింగ్ తీసుకునే వారణాసిలో యాక్షన్ పార్ట్స్ లో జాయిన్ అయ్యాడు మహేశ్ బాబు. ఇప్పుడు ఎన్టీఆర్ వంతొచ్చింది. ఐతే 90రోజుల లాంగ్ ట్రైనింగ్ కి ఎన్టీఆర్ ప్రిపేర్ అవటం చూస్తే డ్రాగన్ లో యాక్షన్ పార్ట్ ఏరేంజ్ లో ఉంటుందో అర్ధమైపోతోంది. నిజానికి మన కలరి పయట్టునే బోది ధర్మ చైనాకు తీసుకెళ్లి, షావోలిన్ టెంపుల్స్ పెట్టి అక్కడి జనాలకు నేర్పాడు.
దాన్ని వాళ్ల భాషలో కూంగ్ ఫూ అని పిలవటం మొదలు పెట్టాడు. ఐతే ఆవిషయంలో మన మార్షియల్ ఆర్ట్స్ విశ్వవ్యాప్తం చేసింది మాత్రం కూంగ్ ఫూ లెజెండ్ బ్రూస్లీనే.. అందుకే ఇండో చైనా భూటాన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కతున్న సినిమా కాబట్టే, ఇందులో కూంగ్ ఫూ ఫైట్ల దండయాత్ర ఉండేలా ఉంది. బ్రూస్లీ ప్రేరనతో తనలా కనిపించేలా ఎన్టీఆరి బక్క చిక్క డ్రాగన్ గా మారాల్సి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి టైంలో కలరి పయట్టు కోసం ఎన్టీఆర్ 90 రోజుల ట్రైనింగ్ కి రెడీ అవటం చూస్తే,అది సగం షూటింగ్ మధ్యలో అనే సరికి జరుగుతున్న ప్రచారాలన్నీ నిజమే అవుతున్నాయనిపిస్తోంది. దీనికి తోడు హిందీ స్టార్ గోవింద కూడా ఇందులో ఎన్టీఆర్ చిన్నాన్నగా కనిపిస్తాడనే ప్రచారం బాలీవుడ్ లో వైరలౌతోంది.