మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద రూమర్ల దాడి మామూలుగా జరగట్లేదు. సోషల్ మీడియాలో డ్రాగన్ మీద జరుగుతున్నంత విష ప్రచారం, మరే మూవీ మీద జరట్లేదు.. అసలు ఇప్పుడప్పట్టో డ్రాగన్ రిలీజ్ అయ్యే అవకాశమే లేదు.. అలాంటి టైంలో, ఎందుకు డ్రాగన్ షూటింగ్ ఆగిందని, రషెష్ ఎన్టీఆర్ కి నచ్చలేదనే ప్రచారం జరుగుతోంది? వచ్చేనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కి భారీ అప్ డేట్ రెడీ అవుతోందని ఒకవైపు వార్తలొస్తున్నాయి. ఒకటి కాదు, గ్లింప్స్, సాంగ్, టీజర్ రూపంలో మూడు అప్ డేట్స్ రెడీ అంటున్నారు. అలాంటి టైంలో ఏదో తుఫాన్ వచ్చినట్టు నెగెటీవ్ పీఆర్ పెరిగిపోయింది. అంటే ఒకప్పుడు యాంటీ ఫ్యాన్స్ కావాలని రూమర్లు స్ప్రెడ్ చేసేవాల్లు.. ఇప్పుడు వాళ్లే నెగెటీవ్ పీర్ ఆర్ గా మారిపోయారా? డ్రాగన్ టీజర్ బాంబు పేలే టైంలో, ఇలా అసందర్భంగా జరుగుతున్న యాంటీ ఫ్యాన్స్ రూమర్ల దాడి కావాలని చేస్తున్నదేనా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటేనే యాంటీ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని పండగ.. తన ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ మూవీ అప్ డేట్స్ కోసం ఇంతగా ఎదురుచూడరనిపిస్తోంది. ఎందుకంటే, ఇంతకాలం సైలెంట్ గా ఉండి, సడన్ గా డ్రాగన్ ఆగింది. తూగింది.. కథ తేలిపోయింది. అసలు షూట్ చేసిన రషెస్ చూస్తే ఎన్టీఆర్ కి మైండ్ పోయింది.. లాంటి నెగెటీవ్ ప్రచారాలు పెంచారు.ఇలా సడన్ గా యాంటీ ఫ్యాన్స్ లేదంటే నెగెటివ్ పీర్ రెచ్చిపోవడానికి కారణండ్రాగన్ అప్ డేట్ల దాడి మొదలు కాబోతుండటం.. వచ్చేనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే రాబోతోంది. డెఫినెట్ గా మ్యాన్ఆఫ్ మాసెస్ పుట్టిన రోజంటే, డ్రాగన్ టీజరో, సాంగో, లేదంటే గ్లింప్సో వదిలే అవకాశం ఉంది. అదొచ్చాక ఎలాగూ ఈ యాంటీ ఫ్యాన్స్ గుడ్డు మీద ఈకలు పీకే పనిచేయటం కామన్.
కాని విచిత్రంగా కోడి ముందే కూసిందన్నట్టు, డ్రాగన్ మీద నెగెటివ్ ప్రచారం ఊపందుకుంది. ఏకంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. రీషూట్లు, రిపేర్లు, కథ మీద హీరో, దర్శకుల మధ్య క్రియేటివ్ డిఫరెన్సులంటూ నెగెటీవ్ ప్రచారాలు చేస్తున్నారు. నిర్మాతలే రంగంలోకి దిగి, అన్నీ ఫేక్ వార్తలు, ఫేక్ ప్రచారాలని తేల్చారు. ఇప్పుడు తీసుకున్న బ్రేక్ వెనక, ఎలాంటి ఇష్యూ లేదన్నారుఒక షెడ్యూల్ కి మరో షెడ్యూల్ కి మామూలుగా బ్రేక్ ఇవ్వటం కామన్. అలాంటి బ్రేక్ ని కూడా ఇలాంటి రూమర్స్ తో నెగెటివ్ గా ప్రచారం చేస్తున్నారనేది నిర్మాతల వాదన.. దీనికి తోడు కలరి పయట్టు 90రోజుల ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నాడు ఎన్టీఆర్.. అందుకోసం కూడా తనకి ఈ బ్రేక్ పనికొస్తోంది. అలాంటి సందర్భాన్ని కూడా ఇలా నెగెటీవ్ గా వాడొచ్చని నెగెటివ్ పీ ఆర్ బ్యాచ్ కనిపెట్టిందనే కామెంట్లు పేలుతున్నాయి.
బేసిగ్గా యాంటీ ఫ్యాన్స్ న్యాచురల్ అటాక్ సోషల్ మీడియాలో .కామన్. కాని దాన్ని ఒక పద్దతిగా టైం చూసి చేయటం అన్నదే కొందరు నెగెటీవ్ పీఆర్ లు చేసే పని.. ఇది బాలీవుడ్ లో వరస్ట్ కల్చర్.. ఒక హీరో కోసం మరో స్టార్ ని డ్యామేజ్ చేయటం ఈ నెగెటీవ్ పీఆర్ ల పని.. విచిత్రం ఏంటంటే ఈ కల్చర్ సౌత్ కి పాకటం తో ఇప్పుడు ఎన్టీఆర్ మీద దాడితో మొదలైన నెగెటీవ్ పీఆర్, ఇలానే అందరు హీరోలకి పాకొచ్చనే భయాలు నిర్మాతల్లో పెరుగుతున్నాయి.. అందుకే మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా పెద్ద హీరోల టీంమ్స్ ఎప్పటి కప్పుడు సినిమా నిర్మాతల్ని అలర్ట్ చేస్తున్నాయి.. చరణ్ అండ్ కో కూడా ఇలాంటి నెగెటీవ్ పీఆర్ కి కౌంటర్ గా టీం సెట్ చేసుకున్నడనే ప్రచారం కూడా జరుగుతోంది.. సో హిట్ కోసం థియేటర్స్ లోనే కాదు, థియేటర్స్ బయట కూడా హీరోలు ఫైట్ చేయక తప్పేలా లేదు.