మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మొన్నటి వరకు త్రివిక్రమ్ ని క్షమించలేదన్నారు. తన కథని, తనకి కాకుండా బన్నీ దగ్గరకు తీసుకెళ్లటం, తనతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనుకోవటం, ఫైనల్ గా అది వివాదంగా మారాయన్న వార్తలొచ్చాయి. తర్వాత త్రివిక్రమ్ చాలా సార్లు సారి చెప్పటం కూడా జరిగిందన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వరకు వ్యవహారం వెళ్లిందన్నారు. కట్ట చేస్తే వివాదానికి ఎన్టీఆర్ ఫుల్ స్టాప్ పెట్టి త్రివిక్రమ్ ని తిరిగా దగ్గరకు తీసుకున్నాడన్నారు. కట్ చేస్తే ఇప్పడు మైథాలజీ ప్రాజెక్ట్ విషయంలో త్రివిక్రమ్ వరుసగా ఎన్టీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడా? కథ కాపీ రైట్స్ ఎన్టీఆర్ దగ్గరుండటంతో, దాన్ని మరో హీరోతో తీయలేకపోవటం, అలాని తిరిగి తనదగ్గరికే వస్తే, ఎన్టీఆర్ రెస్పాండ్ కాకపోవటం , ఇదే జరుగుతోందా? క్షమించాడన్నారు మరి అది నిజం కాదా? అదే నిజమైతే ఎందుకీ నిరీక్షణ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో బిజీ అయ్యాడు. దసరాలోగా రెండు భాగాల షూటింగ్ పూర్తి చేయాలనే టార్గెట్ తో దూసుకెళుతోంది ఫిల్మ్ టీం. ఈలోగా దేవర 2 ని లాంచ్ చేసి, నవంబర్ నుంచి దేవర సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఆతర్వాతేంటి? రాజమౌళి నుంచి ఆఫర్ అందుతుందా? హాలీవుడ్ సినిమా అవేంజర్స్ 2029 ప్రాజెక్ట్ లో ఛాన్స్ ఉందా?అన్నీ ప్రస్థుతానికి ఊహాగానాలే.. ఇంకా వారణాసి సగం పెండింగ్ షూటింగ్ పూర్తికావాలి... వచ్చే ఏడాది మార్చ్ లో ఆ సినిమా రావాలి.
ఆ తర్వాతే రాజమౌళి నిర్ణయం తీసుకుంటాడు.. ఈలోపు ఎన్టీఆర్ డ్రాగన్ రెండు భాగాలు, దేవర 2 షూటింగ్ పూర్తి చేస్తాడు.. కాకపోతే త్రివిక్రమ్ తో తను చేయాల్సిన సినిమా విషయంలోనే ఎన్టీఆర్ ఇంకా వేయిట్ అండ్ సీ పాలసీనే ఫాలో అవుతున్నాడు.అసలే లార్డ్ సుబ్రహ్మణ్యం బేస్ చేసుకుని గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్, కథ విషయంలో ఎన్టీఆర్‌ని మోసం చేయబోయాడన్నారు... కథ మార్పులతో పాటు, కథ విషయంలో ఎన్టీఆర్ టీం కూడా ఉండటమే కాదు, కాపీ రైట్స్ కూడా వాల్లే తీసుకున్నారన్నారు. అది తెలిసి అదే కథని, బన్నీ దగ్గరకు తీసుకెళ్లి త్రివిక్రమ్ నిజంగా ఎన్టీఆర్ ని మోసం చేయబోయాడన్న ప్రచారం జరిగింది.
సో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ కథని త్రివిక్రమ్ మరో హీరోతో తీయలేడు.. అందుకు ఎన్టీఆర్ తో సయోధ్యకోసం ట్రై చేశాడన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జోక్యంతో ఎన్టీఆర్ కూల్ అయ్యాడని, త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ చేస్తాడని తెలుస్తోంది. కాకపోతే అదే ఎప్పుడు? ఒకవైపు వారణాసి తర్వాత రాజమౌళి తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉన్నా ఉండొచ్చు..కాని చెప్పలేం... అది కాస్త డిలే అవుతుందనుకుంటే, దేవర 2 తర్వాత త్రివిక్రమ్ మూవీ మొదల్వొచ్చు.
అలా కాకుండా రాజమౌలి ఆగమని చెబితే, త్రివిక్రమ్ మూవీ మొదలవ్వకపోవచ్చు. సో ఆదర్శకుటుంబం షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఆతర్వాత ఎన్టీఆర్ దేవర 2 అయ్యే వరకు త్రివిక్రమ్ వేయిట్ చేయాలి. అదే వేయిటింగ్ అనుకుంటే, ఆతర్వాత రాజమౌలి ప్రాజెక్ట్ ఓకే అయితే, చాలా లేటు, ఓకే కాకపోతే, కనీసం మరో ఆరునెల్లు వేయిటింగ్.. మొత్తంగా బాబు చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండటం తప్ప, మరో ప్రాజెక్ట్ చేయాలో లేదో తేల్చుకోలేని స్థితిలో త్రివిక్రమ్ ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది.