డ్రాగన్ కి జలుబు… త్వరలో గుడ్ న్యూస్.. !

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జలుపు చేయటంతో, డ్రాగన్ కొత్త షెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ షెడ్యూల్ ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 22, 2026 | 08:00 PMLast Updated on: Jan 22, 2026 | 8:00 PM

Intersting News About Ntr Upcoming Movie

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జలుపు చేయటంతో, డ్రాగన్ కొత్త షెడ్యూల్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ షెడ్యూల్ ని సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ డేట్స్ కి అనుకూలంగా అందరి డేట్స్ అడ్జెస్ట్ చేశాడట. కొత్త షెడ్యూల్ ప్లానింగ్ జరిగిపోయిందట. ఇందులో విచిత్రం ఏం లేదు.. కాని ఎన్టీఆర్ తీసుకుంటున్న చిన్న బ్రేక్ లో కిక్ ఇచ్చే సర్ ప్రైజులు కనిపించేలా ఉన్నాయి. ఒకటి డ్రాగన్ టీజర్… రెండు సినిమా రిలీజ్ డేట్ ని మూడో సారి వాయిదా వేయటం.. మూడో విషయం పొంగల్ మీద ఫస్ట్ టైం భారీ ఎత్తున తను దాడి  చేయబోతుండటం… అలానే బాబాయ్ నటసింహం బాలయ్యతో మీటింగ్.. ఇన్ని విచిత్రంలు ఈ ఒక్క చిన్న గ్యాప్ లోనే జరగటానికి చాలా స్పెషల్ రీజన్స్ ఉన్నాయి.. అవేంటి? జలుబుతెచ్చిన బ్రేక్ తో ఇలాంటి షాకులేంటి?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి జలుబు వల్ల వచ్చిన ఇబ్బందితో, కొన్ని రైయినీ సీన్లు చేయటం కష్టంగా మారిందని తెలుస్తోంది. అందుకే ఆ సీన్లు, అలానే కొత్త షెడ్యూల్ లో కూడా అలాంటి యాక్షన్ సీన్లే ఉండటంతో, ప్రజెంట్ షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేసి, కొత్త షెడ్యూల్ కి చిన్న బ్రేక్ ఇవ్వబోతోంది ఫిల్మ్ టీం. ఆ బ్రేక్ టైంలోనే రెండు షాకింగ్ సర్ ప్రైజులు వచ్చేలా ఉన్నాయి… అదే ఒకటి రిలీజ్ డేట్, రెండు టీజర్ డేట్…నిజానికి డ్రాగన్ ని జూన్ లో రిలీజ్ చేయాలనుకున్న ప్రశాంత్ నీల్ అండ్ కో…సడన్ గా లెక్క పండక్కి మార్చారు… జూన్ లో పండగ లేదు.. తర్వాత దసరాకు మించిన ముహుర్తం లేదు… అంటే అప్పుటికి డ్రాగన్ వస్తాడా అంటే, కానే కాదు… పండక్కి డ్రాగన్ నిప్పులు కన్ఫామ్.. కాని అది చవితికో, దసరాకో, దీపావలికో కాదు… అలాని క్రిస్మస్ ని కూడా డ్రాగన్ టార్గెట్ చేయట్లేదు..

ఫోకస్ అంతా పొంగల్… నిజానికి ఎన్టీఆర్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి చాలా ఏళ్లౌతోంది… ఇప్పుడు డ్రాగన్ 2027 సంక్రాంతికి రిలీజ్ అయితే మళ్లీ పాత రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ఉంది. 2015 లో సంక్రాంతికి టెంపర్ వచ్చింది. తర్వాత ఏడాది నాన్నకు ప్రేమతో పొంగల్ పోరులో గెలిచింది. ఓరకంగా ఎన్టీఆర్ లుక్ ని, పెర్ఫామెన్స్ తోఫేట్ ని మార్చిన చాలా ఇంపార్టెంట్ మూవీస్ సంక్రాంతికి వచ్చే సెన్సేషన్ అయ్యాయి..ఆలెక్కన డ్రాగన్ 2027 సంక్రాంతికే వస్తే, పాన్ వరల్డ్ జర్నీలో అందరికంటే తనే ముందున్నట్టౌతుంది… దీనికి తోడు ఈ మూవీలో బాబాయ్ బాలయ్య ఫోటోని ఒక పాత్రకోసం వాడబోతున్నారన్నది ఆల్ మోస్ట్ నిజం అని తెలుస్తోంది. అది కాకుండా టీజర్ ని సంక్రాంతికి రెడీ చేసినా, ఎన్టీఆర్ డబ్బింగ్ కుదర్లేదు.. అది కాకుండా, రిలీజ్ డేట్ దసరా నుంచి సంక్రాంతికి మారటం వల్ల, ఇప్పుడే టీజర్ ని లాంచ్ చేస్తే ప్రమోషన్ ని మరీ అతి ముందుగా మొదలు పెట్టనట్టౌతుంది.

అందుకే ఎన్టీఆరే ఈసారి డ్రాగన్ టీజర్ ని ఆపాడని తెలుస్తోంది. అలాని సర్ ప్రైజ్ లేకుండా ఉండట్లేదు. ఈ సారి ఉగాది మార్చ్ 19కే వస్తోంది. అందుకే అదేరోజు డ్రాగన్ గ్లింప్స్ ని వదిలి, డ్రాగన్ నామ సంవత్సరంగా ప్రమోషన్ తో మొదలు పెట్టబోతోంది ఎన్టీఆర్ టీం. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతికి టీజర్ ఆపటం వల్ల ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అవ్వొచ్చు. కాని రిలీజ్ డేటే దసరా నుంచి, సంక్రాంతికి మారటం వల్లే, ఇలా టీజర్ ని ఆపి గ్లింప్స్ ని అది ఉగాదికే విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.