కేజీయఫ్ + సలార్ = డ్రాగన్..? అంతకుమించంటోందెవరు…?

డ్రాగన్ మూవీ టైటిల్ మారొచ్చు.. అసలు టైటిల్ ఉగాది కొచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ తో తేలొచ్చు.. మరి ఆ పోస్టర్ లో అంతా అన్నట్టు బ్రూస్లీ అని ఉంటుందా?

Post Published By: dialnews
Updated : 7 March 2026, 3:55 PM IST

డ్రాగన్ మూవీ టైటిల్ మారొచ్చు.. అసలు టైటిల్ ఉగాది కొచ్చే ఫస్ట్ లుక్ పోస్టర్ తో తేలొచ్చు.. మరి ఆ పోస్టర్ లో అంతా అన్నట్టు బ్రూస్లీ అని ఉంటుందా? డ్రాగన్ పేరే మరోలా ఉండబోతోందా? చూడాలి...అయితే ఇక్కడ డ్రాగన్ లేదా, బ్రూస్లీనే టైటిల్ గా ఫిక్స్ చేసేందుకు సాలిడ్ రీజనుంది. చైనా, కొరియా, ఇండోనేసియా, ఇలా సౌత్ ఏసియాలో ఈ సినిమా రీచ్ పెంచాలి.. అందుకే కథని, యాంబియస్ ని, పూర్తిగా చైనా మొఖాలు, వాళ్ల సాంప్రదాయాలు వాటితో ముడిపడ్డ మన నార్త్ ఈస్ట ఇండియా కల్చర్ ని బేస్ చేసుకుని తీస్తున్నారట.. దీనికి డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ ని కూడా యాడ్ చేశారట. అంతవరకు బానే ఉంది. కాని తమిలనాడు వాళ్లకి వాళ్ల భాష, కల్చర్ అంటే ఎంత పిచ్చో, దానికి వందరెట్లు లేదంటే వెయ్యిరెట్లు పైనే చైనావాళ్లకి వాళ్ల భాషన్నా, కల్చరన్నా అంత పిచ్చి.. ఇక కొరియా గురించి చెప్పక్కర్లేదు.. వేసుకునే చెప్పులు కూడా వాళ్లదేశంవే వాడే బ్యాచ్ కొరియా.. అలాంటి మార్కెట్లో ఇండియన్ డ్రాగన్ గన్ పేల్చటం, మన హీరోని, సినిమాలను వాల్లు ఆధరించటం చాలా కష్టం... జపానీస్ అంతా విశాల హ్రుదయం అక్కడ తక్కువే.. అలాంటి మార్కెట్ లో మన వాళ్లకి మంచి వెల్ కమ్ సాధ్యమా..? ఆమిర్ ఖాన్ చైనాలో చేసిన మ్యాజిక్ ఎన్టీఆర్ రిపీట్ చేస్తాడా?

రాజమౌలి తర్వాత ఆస్థాయికి ఎదిగిన దర్శకుడంటే ప్రశాంత్ నీలే.. కేజీయఫ్ రెండు భాగాలు బాహుబలి టూ పార్ట్స్ లానే హిస్టరీ క్రియేట్ చేశాయి. అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టాయి. కట్ చేస్తే అదే డైరెక్టర్ బాహుబలి హీరో ప్రభాస్ తో సలార్ తీశాడు. 850 కోట్ల వసూళ్లుకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ తీస్తున్నాడు. ఇది మొదలైనప్పుడే, ఇటు కేజీయఫ్ అటు సలార్ రెండీటిని కలిపితే వచ్చే ఔట్ పుట్ అన్నారు. కాని కథ, కథనం, అంతకుమించేలా ఉంది..అలా ఉండకపోతే అసలుకే ఎసరొస్తుంది.. ఎందుకంటే పాన్ వరల్డ్ సినిమానో, పాన్ ఆసియా మూవీనో మనోళ్లు తీస్తున్నారని, అక్కడ వేరే దేశపు ఆడియన్స్ మన మూవీ కోసం తలుపులు తెరుచుకుని ఎదురు చూడరు. అంతవరకెందుకు, తెలుగు సినిమా అంటే తమిళ బ్యాచే పట్టించుకోదు..ఏదో బాహుబలి, త్రిబుల్ ఆర్ ఊహాతీతంగా ఉండటంతో, యాక్సెప్ట్ చేశారు.. కాని, వాళ్లకు వాళ్ల మూవీలే తప్ప, మరొకరితో పనిలేదు

అంతగా తమిళ జనం, మరో ప్రాంతానికి చెందిన సినిమాను, మరీముఖ్యంగా తెలుగు సినిమాను ఎంకరేజ్ చేయరు... ఇలాంటి లక్షణమే, చైనా, కొరియాలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. వాళ్లదో సెపరేట్ లోకం.. వాళ్ల సినిమాలు, వాళ్ల పాటలు, అంతే... అంత ఈజీగా బయటి సినిమాలకు అక్కడ పెద్దగా స్కోప్ ఉండదు.. చైనీస్ అయితే మరీ ఘోరం, వాళ్ల భాష, వాళ్ల కల్చర్ మీద ఎంత ఘాడమైన ప్రేమ ఉంటుందో, పరాయి భాష, కల్చర్ మీద అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉంటుంది..ఇదోరకం నేషనాలిటీ... ఆవిషయంలో తమిళోల్లని మించే ప్రాంతీయ అభిమానం చైనీస్, కొరియన్స్ లో కనిపిస్తుంది.. సో అలాంటి చోట తెలుగు సినిమాను బ్రూస్లీ, లేదంటే డ్రాగన్ పేరతో రిలీజ్ చేసినంత మాత్రాన ఆదరిస్తారా అటే, డౌటే.. కాని అక్కడే కొట్టాలి.. అక్కడే గట్టిగా కొడితే, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, తైశాన్ ఇలా సౌత్ ఏషియాలో ఎన్టీఆర్ డ్రాగన్ తిష్టవేసినట్టే..తనకి సాలిడ్ మార్కెట్ క్రియేట్ అయినట్టే..

జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ బానే ఉన్నారు. త్రిబుల్ ఆర్, దేవరతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ పెరిగింది. కాని వాళ్ల సానుకూలా మనస్థత్వం వేరు... చైనా, కొరియా జనాల మైండ్ సెట్ వేరు.. కాకపోతే, ఇదేచైనాలో అమీర్ ఖాన్ త్రీ ఇడియట్స్ నడిచింది. సీక్రెట్ సూపర్ స్టార్ దూసుకెళ్ళింది. దంగల్ అయితే 1200 కోట్లు వసూళ్లు రాబట్టింది. కొరియాలో దృశ్యం మలయాళ మూవీ కి కాస్త గుర్తింపు దక్కింది. కాబట్టి మైండ్ బెండింగ్ స్క్రిప్ట్ తో వస్తే చైనా, కొరియాలను కొట్టడం పెద్ద కష్టమేమి కాదు.. చైనా, కొరియా మార్కెట్ లో డ్రాగన్ తిష్ట వేస్తే సౌైత్ ఏషియానే కాదు, హాలీవుడ్ వరకు ఈ సౌండ్ రీసౌండ్ చేస్తుంది.. అందుకే కొరియన్లు, చైనీస్ చూడని కొత్త తరహా సినిమాను చూపించే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ టీం.

Published : 
  • 7 March 2026, 3:55 PM IST