ఆ ఒక్క సీన్ కోసం లైఫ్ రిస్క్.. ASIAని ఏలాలంటే…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ 15 కిలోలు తగ్గాడు. ఇప్పుడు మల్లీ కొత్తగా ఐదునుంచి మరో 8 కిలోలు తగ్గేలా ఉన్నాడు. ఇదే జరిగితే ఫ్యాన్స్ షాక్ అయ్యితీరాల్సిందే...

Post Published By: dialnews
Updated : 10 February 2026, 2:45 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ కోసం ఆల్రెడీ 15 కిలోలు తగ్గాడు. ఇప్పుడు మల్లీ కొత్తగా ఐదునుంచి మరో 8 కిలోలు తగ్గేలా ఉన్నాడు. ఇదే జరిగితే ఫ్యాన్స్ షాక్ అయ్యితీరాల్సిందే... ఎందుకంటే మరీ ఇంరా బరువు తగ్గితే, ఎన్టీఆర్ ఏకంగా ఎముకల గూడులా తయారయ్యే పరిస్థితి ఉంటది. ఏ ఫ్యాన్ కూడా ఇది తట్టుకోలేడు. కాని తప్పదు.. అలాంటి రిస్క్ ఎన్టీఆర్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. అంతా పాత్ర కోసమే... ఆల్రెడీ ఆఫ్రికా లో తండ్రి పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేశారు. జోర్డాన్, జార్జియాలో ఫ్రెష్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ కూడా పొగుడు గడ్డం తో షార్ప లుక్స్ తో, సన్నబడ్డా కూడా ఎఫెక్టీవ్ అప్పియరెన్స్ తోనే కనిపిస్తున్నాడు. అలాంటిది, ఆలుక్ కూడా కాకుండా, కరువు ప్రాంతంలో తిండిలేక బక్కచిక్కే లుక్ లోకి తను మారబోతున్నాడంటేనే షాకింగ్ గా ఉంది. నిజం చెప్పాలంటే హాలీవుడ్ లో ఇలాం తన లైఫ్ తోనే కొందరు స్టార్స్ రిస్క్ చేస్తే, తమిళ్ లో విక్రమ్, హిందీలో రణ్ దీప్ హుడా ఇలాంటి రిస్కే చేశారు. కాని వాల్లు కూడా చేయనంత రిస్క్ తన హెల్త్ తో చేస్తున్నాడు ఎన్టీఆర్.. ఎందుకు? హీరోకి హెల్త్ తో పాటు లుక్స్ కూడా చాలా ముఖ్యం... వాటినే రిస్క్ లో పెట్టేంత ప్రయోగం దేనికి? కేవలం కాసేపు కనిపించే సీన్లకోసం ఇంత రిస్క్ అవసరమా?

తమిళ హీరో విక్రమ్ ఐ మూవీ చేసినప్పుడు ఎముకల గూడులా చిక్కిపోయాడు గుర్తుందా? హిందీలో రణ్ దీప్ హుడా కూడా ఒక మూవీ కోసం బక్కి చిక్కిన పాత్రలో కనిపించాడు. అందుకోసం ఈ ఇద్దరు తిండి తిప్పలు మాని, బక్కి చిక్కారు... కాని అంతకుమించి ఎముకల గూడులా ఎన్టీఆర్ అవుతున్నాడంటే నమ్ముతారా? తన డైట్, తన టీం ప్లానింగ్ చూస్తే నిజంగా ఫ్యాన్స్ కూడా కంగారు పడాల్సిన సంగతి ఇది.ఆల్రెడీ డ్రాగన్ కోసం 10 నుంచి 15 కిలోలు తగ్గితేనే, ఎన్టీఆర్ కి ఏమైంది, ఇంత చిక్కిపోయాడన్నారు. యాడ్స్ లో వార్ 2 లో తన లుక్ మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి..తన హెల్త్ కండీషన్ ఏమైనా దెబ్బతిందా అన్నారు.. కాని అదంతా డ్రాగన్ లో తన లుక్ కోసమే అని తర్వాత తేలింది. ఇందులో డ్యూయెల్ రోల్ వేస్తున్న ఎన్టీఆర్, తండ్రి పాత్రకోసం సన్నబడి, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ఆఫ్రికాలోనే పూర్తి చేశాడన్నారు.

కట్ చేస్తే మళ్లీ ఇప్పుడు 8 నుంచి 10 కిలోల పైనే తగ్గితే ఏంటి పరిస్తితి.. ఆల్రెడీ కొత్త డైట్ మొదలైంది. జోర్డాన్, జార్జియాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ షెడ్యూల్ పూర్తయ్యేలోగా అంటే, మరోరెండునెలల్లో 10 కిలోల వరకు తన వేయిట్ తగ్గాలి.. ఇది టాస్క్... అందుకోసం 6 గురు స్పెషల్ డైట్ అండ్ వర్కవుట్ల టీం పని చేస్తోంది. అంతా బానే ఉంది కాని, మరీ మరో 10 కిలోలు తగ్గటం అంటే, తిండీ ఎముకల గూడుగా మారే కరువు ప్రాంత వాసిలా కనిపిస్తాడు ఎన్టీఆర్.తనే కాదు ఇలా హెవీగా వేయిట్ లాస్ అయితే ఎవరైనా అంతే... తమిల హీరో విక్రమ్, హిందీ స్టార్ రణ్ దీప్ హుడా కూడా పాత్ర కోసం బక్కచిక్కారు కాని, వాళ్లకంటే ఘోరంగా ఎముకల గూడులా ఎన్టీఆర్ మారబోతున్నాడనేది ఊహకందని రిస్క్.. అది కూడా సినిమాలో కేవలం రెండు సీన్ల కోసమే... ఎంత పాన్ ఆసియాలో తన సినిమా దూసుకెళ్లాలన్నా, కంటెంట్ కోసం, రియాలిటీకోసం ఇంత రిస్క్ అవసరమా?హీరోలన్నాక లుక్స్ ని కాపాడుకోవాలి.హెల్త్ చూసుకోవాలి. ఒక్కమూవీ కోసం ఇలా హెల్త్ ని రిస్క్ లో పెట్టి, లుక్స్ ని కూడా లైట్ తీసుకుంటే, ఇటు ముఖం కలపోతుంది... ఆరోగ్య సమస్యలు కూడా రావొచ్చు.. కాని పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియాకు తను ఎదగాలంటే, ఇళాంటి రిస్క్ లేంది ఏది మారదు.. అందుకే పాత్రకోసం ఇంత పర్ఫెక్షన్ తో పని చేస్తున్నాడట ఎన్టీఆర్.

Published : 
  • 10 February 2026, 2:45 PM IST