దేవర 20kgలు పెరిగితే.. 2వ డ్రాగన్ ఎలా…?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏకంగా 20 కేజీల వేయిట్ పెరగాల్సిన టైం వచ్చింది. డ్రాగన్ కోసం సన్నగా స్లిమ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఎంత షాక్ కి గురయ్యారో..

Post Published By: dialnews
Updated : 4 March 2026, 10:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏకంగా 20 కేజీల వేయిట్ పెరగాల్సిన టైం వచ్చింది. డ్రాగన్ కోసం సన్నగా స్లిమ్ లుక్ లోకి మారిన ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఎంత షాక్ కి గురయ్యారో.. ఇప్పుడు తను తిరిగి మళ్లీ బొద్దుగా మారబోతున్నాడన్న వార్తతో కూడా అంతే షాక్ అవుతున్నారు. ఒకరకంగా ఇది హెల్త్ ని రిస్క్ లో పెట్టడమే.. ఎంత ఎక్స్ పర్ట్స్ సాయం తీసుకున్నా, రిస్క్ రిస్కే.. ఐతే మరీ సన్నబడ్డ ఎన్టీఆర్ ని చూస్తే, సినిమాకోసం ఇంత అవసరమా అని చాలా మంది నుంచే రెస్పాన్స్ వస్తోంది. కాని గ్లింప్స్ లేదంటే, టీజరో వస్తే తన లుక్ ఎంత కిక్ ఇస్తుందో తెలుస్తుందని, ప్రశాంత్ నీల్ అన్న మాట తూటాలా పేలుతోంది. కేవలం తన టీం తోనే ఈ మాటన్నా, ఇండస్ట్రీలో ఇప్పుడిది క్యూరియాసిటీని పెంచుతోన్న స్టేట్ మెంట్.. అంతగా ఎన్టీఆర్ స్లిమ్ లుక్ డ్రాగన్ లో కిక్ ఇస్తుందా? దేవర సీక్వెల్ కోసం ఎన్టీఆర్ మళ్లీ బొద్దుగా మారితే, డ్రాగన్ సీక్వెల్ పరిస్థితేంటి?

ఎగ్జాక్ట్ గా 6 నెల్ల క్రితం ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు.. ఇప్పుడెలా ఉన్నడంటే, ఖచ్చితంగా తనలో తానే సగం అయ్యాడు.. అంతగా 14 నుంచి 18 కిలోల వేయిట్ కేవలం డ్రాగన్ కోసమే తగ్గాడు. ఆఫ్రికా ఎపిసోడ్ లో తన తండ్ర పాత్ర ఎపిసోడ్ షూటింగ్ జరిగిపోయింది. ఇప్పుడు కొడుకు పాత్ర షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లి రావటం జరిగింది. ఐతే ఇక్కడ సమస్య ఏంటంటే, మళ్లీ ఎన్టీఆర్ బొద్దుగా మారబోతున్నాడు..తగ్గిన తన 18 కిలోల వేయిట్ ని ఏఖంగా 20 కేజీలకు తన బరువు పెంచాల్సిన టౌైం వచ్చింది. దేవర సీక్వెల్ కోసం తను మళ్లీ బొద్దుగా మారబోతున్నాని తెలుస్తోంది. ఇదే ఇక్కడ సమస్య.బరువు పెరగటం, తగ్గటం సమస్య కాదు, దాని వల్లొచ్చే హెల్త్ ఇష్యూస్ సమస్య.. అయితే ఇక్కడ అంతకంటే పెద్ద సమస్యే ఎదురౌైతోంది. అదే డ్రాగన్ సీక్వెల్.

డ్రాగన్ కోసమే సన్నబడ్డ ఎన్టీఆర్, ఇప్పుడు దేవర సీక్వెల్ కోసం బొద్దుగా మారితే, డ్రాగన్ సీక్వెల్ పరిస్తితేంటి? మళ్లీ డ్రాగన్ లుక్ కోసం సన్నబడతాడా? అలా మాటి మాటికి సన్నబడటం, బొద్దుగా మారటం చిన్న విషయమా? కానే కాదు. కాకపోతే డ్రాగన్ సీక్వెల్ కి ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొరటాల శివ టీం రంగంలోకి దిగింది. దేవర 2 పని మొదలైంది.దేవర 2 షూటింగ్ మొదలయ్యేలోపు ఎన్టీఆర్ 20కిలోల వేయిట్ పెరగబోతున్నాడు. మళ్లీ దేవర లుక్ లోకి రావటంకాదు, ఈసారి ఇంకాస్త కండలతో థ్రిల్ చేయబోతున్నాడు. అంతా బానే ఉంది. దేవర 2 కోసం ఇలా సడన్ గా బొద్దుగా మారితే, డ్రాగన్ సీక్వెల్ కి ఇబ్బంది ఎదురౌతుంది. అందుకే ముందు డ్రాగన్ మొదటి భాగంతో పాటు, డ్రాగన్ సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు.

కాని కారణాలు ఏంటో బయటికి రాలేదు. ఐతే డ్రాగన్ పార్ట్ 1 పూర్తైన వెంటనే, అంటే మరో రెండు నెలల తర్వాత దేవర సీక్వెల్ షూటింగ్ మొదలయ్యేలా ఉంది. అదే జరిగితే, డ్రాగన్ సీక్వెల్ ని ఖచ్చితంగా దేవర 2 షూటింగ్ తర్వాతే ప్లాన్ చేయాల్సి వస్తుంది... అక్కడే లుక్ సమస్య ఎదురయ్యేలా ఉంది. మాటి మాటికి బరువు తగ్గటం, బక్కచిక్కాక మళ్లీ బొద్దుగా మారటం కుదరదు.. తగ్గినప్పుడే ఆ లుక్ సంబందించిన సీన్లు తీసేయాలి.. లేదంటే లేదు.ఐతే ఇక్కడే సాలిడ్ సొల్యూషన్ దొరికిందట. డ్రాగన్ సీక్వెల్ లో ఎన్టీఆర్ సన్నగా ఉండే సీన్లన్నీ ఇప్పుడే తీసేసి, అందులో దేవర తాలూకు లుక్ ఉన్నా పర్లేదని పించే పాత్ర వల్ల, డేర్ గా ఎన్టీఆర్ వేయిట్ గేయిన్ చేసేందుకు రెడీ అయ్యాడట. కాబట్టి దేవర 2 వల్లే డ్రాగన్ 2 లో ఎన్టీఆర్ లుక్ కి వచ్చే సమస్యేం ఉండదనే ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 4 March 2026, 10:00 AM IST