“వర్షా”కాలపు విలన్.. 5 వేలకోట్ల కాంబినేషన్..

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో తనని స్టార్ గా మార్చిన ఫస్ట్ మూవీ వర్షం.. ఇప్పుడు ఆ కాంబినేషన్ ని సెన్సేషన్ చేయబోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2026 | 11:27 AMLast Updated on: Jan 25, 2026 | 11:27 AM

Intersting News About Prabhas And Gopichand Combo Movie

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో తనని స్టార్ గా మార్చిన ఫస్ట్ మూవీ వర్షం.. ఇప్పుడు ఆ కాంబినేషన్ ని సెన్సేషన్ చేయబోతున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ఒక హీరో కి తగ్గ పాత్రని, అందుకు తగ్గ విలన్ ని సెలక్ట్ చేయటంలో సందీప్ రెడ్డి వంగ లెక్కేవేరు… అందుకే యానిమల్ మూవీలో కథాలోపాలు ఎన్ని ఉన్నా, ఆ సినిమా 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. రన్ బీర్ కపూర్ లాంటి చాక్లెట్ బాయ్ కూడా రగ్గుడ్ హీరోగా కనిపించాడు. షాక్ ఇచ్చాడు.అలాంటిది ప్రభాస్ తో సందీప్ రెడ్డి మూవీ తీస్తే, అందులో విలనిజం ఇంకెలా ఉంటుంది…? దాని లీకులే ఇప్పుడు షాకులిచ్చేలా ఉన్నాయి… విలన్లు ఎంతమంది ఉన్నా, వింటేజ్ విలనే కావాలని వర్షం విలన్ ని రంగంలోకి దింపుతున్నాడు సందీప్ రెడ్డి వంగ… ఇంకా స్పీరిట్ లో విలనిజం స్కేలే మార్చేందుకు మరింతమంది విలన్స్ ని దింపబోతున్నాడా? అంతా వింటేజ్ విలన్లే కావాలని సందీప్ ఎందుకు కోరుకుంటున్నాడు? హావేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ స్పిరిట్ లో తను వేస్తోంది కాప్ రోల్… దారి తప్పిన ఓ ఐపీఎస్ కథని గ్లింప్స్ విన్న ఎవరికైనా క్లారిటీ వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో విలన్స్ గా వింటేజ్ బ్యాచ్ దిగుతోంది. అందులో హీరో గోపీచంద్ కూడా ఉన్నాడు.. ఎప్పుడో వర్షం మూవీలో ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆల్ మోస్ట్ ఆ సినిమా వచ్చి 21 ఏళ్లవుతోంది..

మళ్లీఅదే తరహా విలనిజం స్పిరిట్ లోచూపించబోతున్నాడా? ఎందుకంటే సందీప్ రెడ్డి సినిమా అంటేనే, మరుగున పడిన సాలిడ్ ఆర్టిస్టులను బయటికి తీసుకొస్తాడనే పేరుంది. యానిమల్ లో అలానే జమానా హిందీ ఆర్టిస్టులందరినీ తీసుకుని, హీరో బంధువుల పాత్రలు వేయించాడు. విలనిజానికి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. అంతెందుకు బాబీ డియోల్ ఫేట్ నే మార్చేశాడు..అందుకే స్పిరిట్ లో గోపీచంద్ విలన్ గా కనిపిస్తాడన్న ప్రాచరం మొదలవ్వగానే, అందరికి వర్షం మూవీ టైంపీరియడ్ గుర్తొస్తోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్ అప్పట్లో సెన్సేషనైంది. ప్రభాస్ ని యంగ్ రెబల్ స్టార్ గా మార్చింది. ఇప్పుడు తను రెబల్ స్టార్ గా మారాడు. పాన్ ఇండియా కింగ్ గా మార్కెట్ ని ఏలుతున్నాడు.. సో ఇప్పుడు తనతో గోపీచంద్ కలిసి నటిస్తే, గోపీచంద్ కే మరింత ప్లస్ అవుతుంది..

కాకపోతే విలన్ గా తను చేయటం అంటే, ప్రభాస్ మూవీకి నిజంగానే ఫ్రెష్ నెస్ వచ్చే ఛాన్స్ఉంది. సందీప్ రెడ్డి మేకింగ్ కాబట్టి, డెఫినెట్ గా పాత్ర బలంగానే ఉండే ఛాన్స్ఉంది. ఐతే, ఇందులో గోపీచంద్ వేసేది నిజంగా విలన్ రోలేనా? లేదంటే విలన్ సపోర్టర్ గా కనిపిస్తాడా? అలా కాకుండా హీరోకే సపోర్ట్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాడా అన్నది తేలలేదు.కాని గోపీచంద్ మాత్రం స్పిరిట్ లో కనిపించబోతున్నాడంటే, ఒక్కసారిగా తెలుగు మార్కెట్ లో ఊపొచ్చింది… ఇది పాన్ వరల్డ్ మూవీ… అయినా తెలుగు మార్కెట్ బలమైంది కాబట్టే, ఇక్కడి జనాన్ని సంత్రుప్తి పరిచే, పాన్ వరల్డ్ వేటలో వేగం పెంచాలి.. అందుకే తెలుగు ఫ్యాన్స్ ని ముందు త్రుప్తి పరిచేందుకే గోపీచంద్ ని స్పిరిట్ లో ప్రభాస్ కోసం ప్రత్యేకంగా రంగంలోకి దింపుతున్నాడు సందీప్.