వాళ్లని కోసి కారం పెట్టాలి.. REBELపిలుపు…?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ కల్కీ2 షూటింగ్ తో బిజీ అవుతున్నాడు. తను సెట్ లో లేని టైంలో ఫౌజీ సెట్ లో ప్రమాధం జరిగింది. స్పిరిట్ లో గాయ పడ్డ సింహంగా తన పాత్ర కనిపించబోతోంది. ఇలాంటి టైంలో ధురందర్ 2 ని ప్రభాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగ కలిసి చూశాడు.

Post Published By: dialnews
Updated : 11 April 2026, 6:24 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ కల్కీ2 షూటింగ్ తో బిజీ అవుతున్నాడు. తను సెట్ లో లేని టైంలో ఫౌజీ సెట్ లో ప్రమాధం జరిగింది. స్పిరిట్ లో గాయ పడ్డ సింహంగా తన పాత్ర కనిపించబోతోంది. ఇలాంటి టైంలో ధురందర్ 2 ని ప్రభాస్ తో పాటు సందీప్ రెడ్డి వంగ కలిసి చూశాడు. అంతే వెంటనే బాలీవుడ్ లో ఒక వర్గానికి ఒంటిమీద తేల్లూ జెర్రిలు పాకినట్టైనట్టుంది. పూనకాలు తెచ్చుకుని మరీ, రెబల్ స్టార్ మీద విరుచుకుపడుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా స్పిరిట్ ని టార్గెట్ చేశారు. సందీప్ రెడ్డి ని యానిమల్ అంటున్నారు. అంతటికీ కారణం, దిక్కుమాలిన హిందీ బ్యాచ్ అనే అర్ధం వచ్చేలా సందీప్ రెడ్డి వంగ ట్వీట్ చేయటం... ప్రభాస్ తోకలిసి ధురందర్ 2 చూసి, ఆమూవీని పొగడటం... అందుకే పనికట్టుకుని స్పిరిట్ మీద బురద జల్లుతున్నారు.. సందీప్ మీద కోపాన్ని రెబల్ స్టార్ మీద చూపిస్తున్నట్టున్నా... ఇంతకి వాళ్ళేం చేయగలరు? ఏం చేస్తున్నారు? కౌంటర్ ఎలా ఉండబోతోంది?

సందీప్ రెడ్డి వంగ నోరు విప్పితే, బాలీవుడ్ బ్యాచ్ పరువుని కూడా విప్పేసినట్టే.. ఆరేంజ్ లో తన ఒక్కో మాట, హిందీ బ్యాచ్ కి తూటాలా తగులుతుంది. కాలుతుంది.. అలాంటిది సందీప్ రెడ్డినే సీన్లోకి వచ్చి ఒక్కొక్కరికి కోసం కారంపెట్టాలంటే ఎలా ఉంటుంది.. అందుకోసం ఎకరం మిర్చీ తోటే కావలంటే.. ఇదే ఇప్పుడు నార్త్ ఇండియాని షేక్ చేస్తోంది.రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తున్న సందీప్, ఆల్రెడీ ఆ మూవీ ఆగిందనే కామెంట్లకు ప్రభాస్ తో కలిసొచ్చి చెక్ పెట్టాడు. కల్కీ2, ఫౌజీ కోసం స్పిరిట్ ని ఆపలేదని, దేని షెడ్యూల్ దాని ప్రకారం వెళుతున్నాయని స్పిరిట్ టీం ఆల్రెడీ తేల్చింది.. ఇప్పడు ధురందర్ 2 మూవీని రెబల్ స్టార్ ప్రభాస్ తో కలిసి థియేటర్స్ లో చూసి అలా స్పిరిట్ ప్రోగ్రెస్ మీద ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

అంతవరకు అయితే ఇది న్యూస్ అయ్యేది కాదు.. బాలీవుడ్ లో చాలామందికి మిరప ఘాటు తగిలేది కాదు. ఐతే సందీప్ రెడ్డి వంగ సడన్ గా ధురందర్ 2 ని చూసి ఆ మూవీటీం ని మెచ్చుకోవటమే కాదు. దర్శకుడిని ఆకాశానికెత్తాడు.. ఆతర్వాతే అసలు కథ మొదలైంది. బాలీవుడ్ లో లిబరల్స్ అనిపించుకున్న బ్యాచ్ ధురందర్ 2 ని ప్రోపగండా అని అదని, ఇదని డ్యామేజ్ చేయాలనుకున్నారన్నాడు.వాళ్ల చెడు ద్రుష్టి తగలకుండా ఉండాలంటే ఒక్క మిరప చెట్టుకాదు, ఏకంగా మిరప తోటలో మిర్చీలన్నీ కలిపి దిష్టి తీస్తే తప్ప ఆ దిష్టిపోదనే మీనింగ్ వచ్చేలా, దిష్టితీయాలన్నాడు. నిజంగా ఏది ఎక్కడ వాడితే మండుతుందో, బాగా తెలిసిన రెబల్ స్టార్, ఒకవైపు స్పిరిట్ మీద రూమర్లు క్రియేట్ చేసే వాల్లకి గడ్డి పెట్టాడు. ధురందర్ 2 మీద ప్రోపగాండా మూవీ అని కామెంట్లు చేసే బ్యాచ్ కి, నోట్లో మిర్చీ పెట్టాడు.

అసలు ధురందర్ మూవీ తనది కాదు.. తన స్నేహితుడి మూవీ కూడా కాదు. దీనికే ఈ రేంజ్ లో సందీప్ రెడ్డి వంగ రియాక్ట్ అయితే, తన సొంత స్పిరిట్ మూవీ విషయంలో ఎవరైనా ఏమాత్రం అటు ఇటుగా రియాక్ట్ అయితే ఊరుకుంటాడా? కోసి కారం పెట్టడం కన్ఫామ్.. అర్జున్ రెడ్డిని మించేలా యానిమల్ ని తీసినవాడు...అంతకు పదింతలు స్పరిట్ లో వయోలెన్స్ ఉంటుందంటే, అదో బాలీవుడ్ ని కుదిపేసే ఛాన్స్ఉంది... మొత్తానికి ధురందర్ 2 పుణ్యామాని, నార్త్ లో స్పిరిట్ వైబ్స్ రీసౌండ్ చేయటం మొదలైంది.

Published : 
  • 11 April 2026, 6:24 PM IST