సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లో దూసుకెళ్లిన ప్రియాంక చోప్రా ఈ కాంబినేషన్ లో రాజమౌలి తీస్తున్న గ్లోబల్ మూవీ వారణాసి. కనీసం 2 వేల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. 55 వేల థియేటర్స్ లోరిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి, లెక్కేస్తే పది వేల కోట్ల వసూళ్లు వస్తాయనే అంచనా ఉంది... ఐనా ఎందుకో రాజమౌళి లో కంగారు కనిపిస్తోందా? ఎందుకు రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేసి కూడా, దాన్ని ఎనౌన్స్ చేయట్లేదు.. రీసెంట్ గా రిలీజ్ డేట్ కూడా డౌట్ ఫుల గానే కాశీలో హోర్డింగ్స్ పెట్టాకే గ్యాప్ ఇచ్చి, తర్వాత అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశాడు..? ఇదంతా తన మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమా? లేదంటే అతి జాగ్రత్తే మరి, అతి సీక్రసీకి కారణమౌతోందా? గ్లోబల్ గా ఒక సినిమా రెండు భాగాలుగా రాబోతోందంటే అదో పెద్ద న్యూస్.. నేషనల్ మీడియాలో కూడా కావాల్సినంత కవరేజ్ ఇచ్చే చాన్స్ఉంది.. అయినా గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ పేర్లు బయటికొచ్చాక కూడా , రాజమౌళి ఎందుకు వారణాసి రెండు భాగాలన్న మాటని కన్పామ్ చేయటమో? ఖండించటమో చేయట్లేదు?
వారణాసి మూవీ సైలెంట్ గా మొదలైంది. కాని సడన్ గా పోస్టర్ వదలటం, గ్లింప్స్ ఈవెంట్ ప్లాన్ చేయటం, ఆలోపే రెండు పాటల్ని తూటాల పేల్చటం జరిగింది.. ఇలా ఎప్పుడూ రాజమౌలి తన సినిమాల ప్రమోషన్ ని అర్ధం పర్దం లేకుండా ప్లాన్ చేయలేదు... ఇదే స్ట్రేంజ్ థింగ్ అనుకుంటే, గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ గా ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతోందన్న ప్రచారం ఊపందుకుంది.ఈ ప్రచారాన్ని ఖండీంచలేదు, అలాని ఇది రెండు భాగాలుగా వచ్చే మూవీ అని కూడా అఫీషియల్ గా తేల్చట్లేదు రాజమౌళి. ఇదే ఎందుకనే విషయం ఎవరికీ అర్ధం కావట్లేదు. నిజంగా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే, డెఫినెట్ గా ఎనౌన్స్ చేయాలి.. ఫ్యాన్స్ మాత్రమే కాదు, నేషనల్ మీడియా కూడా భారీగా ఈ న్యూస్ ని కవర్ చేస్తుంది. అంతగా రాజమౌలి, మహేశ్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ కి ఆ క్రేజ్ ఉంది..
అయితే ఇది రాజమౌళి తన తొలి పాన్ వరల్డ్ మూవీగా తీయటం వల్ల, డిస్ట్రి బ్యూటర్లు, హాలీవుడ్ పీర్ ఏజెన్సీల మీద డిపెండ్ అయ్యాడా అన్న డౌట్లు పెరిగాయి. ఎందుకంటే, ఇండియా లెవల్లో అంటే, రాజమౌలి తన ఇన్ ఫ్లూయెన్స్ వాడి, మార్కెట్ ని కంట్రోల్ చేయొచ్చు.. కాని వరల్డ్ మార్కెట్ ని కంట్రోల్ చేసేది హాలీవుడ్ ఏజెన్సీలే.. వాళ్లని కాదని, ఏ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా దుమ్ముదులిపేలా దూసుకెళ్లటం సాధ్యం కాని పని..అందుకే వాళ్ల కండీషన్స్ వల్లే, వారణాసి మూవీ లాంచ్ ని సీక్రెట్ గా స్టార్ట్ చేసి, తర్వాత వరల్డ్ మీడియా రాకముందే, గ్లింప్స్ లాంచ్ చేశాడు. ఇదే కాస్త అప్ నార్మల్ గా ఉంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా తాలూకు అప్ డేట్స్ ఇచ్చినా నేషనల్ లెవల్లో వార్తగా మారుతంది. అంత రీచ్ ఉంది తన సినిమాకు. అయినా హాలీవుడ్ ఏజెన్సీల కండీషన్స్, వాళ్ల గైడ్ లైన్స్ రాజమౌలిని కన్ ఫ్యూజ్ చేస్తున్నాయా అన్న డౌట్లు పెరిగాయి.
లేకపోతే, మొన్నటికి మొన్న వారణాసి మూవీ 2027 ఏప్రిల్ విడదల అని కాశీలో హోర్డింగ్స్ వచ్చాయి.. వాటి మీద నోరెత్తని రాజమౌళి, తర్వాత రెండు రోజులకి తీరిగ్గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు. ఇప్పుడు వారణాసి మూవీ బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ లానే రాబోతోందన్ని ప్రచారం పెరిగింది. అంటే రెండు భాగాలుగా వారణాసి గ్లోబ్ ట్రాటర్, వారణాసి టైం ట్రాటర్ గా ప్రచారం జరుగుతున్నా, అవునని చెప్పటమో, కాదని తేల్చటమో చేయట్లేదు రాజమౌళి.. ఈ సైలెన్స్, ఆవెంటనే సడన్ గా ఎనౌన్స్ మెంట్లు, ఇవే రాజమౌళి మార్కెటింగ్ స్ట్రాటజీలో కన్ ఫ్యూజన్ పెరిగిందా? అన్న డౌట్లకు కారణమౌతోంది.