శివాజీ ఈసారి చాలా సైలెంట్.. సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని వెనుక ఉన్న అసలు కథ ఇదే..!

ఈ మధ్యకాలంలో శివాజీ సినిమాలకంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన ఆ మధ్య అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

Post Published By: dialnews
Updated : 9 February 2026, 3:07 PM IST

ఈ మధ్యకాలంలో శివాజీ సినిమాలకంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన ఆ మధ్య అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ గురించి చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఆయన నిర్మాతగా మారి చేసిన తాజా చిత్రం 'సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని'. వినడానికి టైటిల్ కాస్త విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంది కదూ..! 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో ఉన్న పాటనే టైటిల్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడు శివాజీ. ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ వేదికగా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా.. శివాజీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో శివాజీ ప్రవర్తన అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో దండోరా ఈవెంట్‌లో అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ గురించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి.

ఆ ట్రోలింగ్, విమర్శల ప్రభావం గట్టిగానే పడినట్లుంది.. అందుకే ఈసారి మాత్రం శివాజీ చాలా ఆచితూచి వ్యవహరించారు. మైక్ పట్టుకున్నప్పుడు ఎక్కడా నోరు జారకుండా, పాత వివాదాలకు తావివ్వకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ కేవలం సినిమా కంటెంట్ మీదే ఫోకస్ పెట్టడం విశేషం.
ఇక సినిమా కథ విషయానికి వస్తే... ఇదొక ఆసక్తికరమైన క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ఇందులో హీరో ఒక పంచాయతీ సెక్రటరీ. పైకి ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపిస్తూ తన కుటుంబంతో కలిసి సాదాసీదా జీవితం గడుపుతున్నట్లు ఉంటాడు. కానీ ఆ ముసుగు వెనుక ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తూ ఉంటాడు. అసలు ఆ పంచాయతీ సెక్రటరీ వెనకాల ఉండి నడిపిస్తున్న ఆ 'క్రైమ్' ఏంటి? తన కుటుంబానికి తెలియకుండా అతడు ఏం చేస్తున్నాడు? అనే మిస్టరీని ఛేదించడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

'సాంప్రదాయని సుప్పిని సుద్ధపూసని' అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా కథలో కీలకం కావచ్చు. బయట సమాజానికి సుద్ధపూసలా కనిపిస్తూ, లోపల మరోలా ప్రవర్తించే మనుషుల నైజాన్ని ఇది సెటైరికల్ గా ప్రతిబింబిస్తుంది. శివాజీ ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటారు, ఈసారి నిర్మాతగా కూడా అలాంటి కొత్త ప్రయత్నమే చేశారని అర్థమవుతోంది. పంచాయతీ సెక్రటరీ పాత్రలో హీరో వేషధారణ, అమాయకత్వం ప్రేక్షకులను నవ్విస్తూనే, కథలోని ట్విస్టులు థ్రిల్ చేస్తాయని సమాచారం. మొత్తానికి పాత వివాదాలకు దూరంగా ఉంటూ, పూర్తిగా కంటెంట్ మీదే నమ్మకం పెట్టుకుని శివాజీ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు, సస్పెన్స్ థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి ఆదరణ పెరుగుతున్న ఈ సమయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 12న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Published : 
  • 9 February 2026, 3:07 PM IST