1000 కోట్ల రాముడు.. 1400 కోట్ల రాముడు.. ఆయనే గ్రేట్?

000 నుంచి 2 వేలకోట్లతో తెరకెక్కుతున్న హిందీ రామాయణం ఈ ఏడాది నవంబర్ లో రాబోతోంది. కట్ చేస్తే, ఆరునెలల గ్యాప్ తర్వాత రాజమౌళి రామాయణం చూడబోతున్నాం.

Post Published By: dialnews
Updated : 25 February 2026, 4:25 PM IST

1000 నుంచి 2 వేలకోట్లతో తెరకెక్కుతున్న హిందీ రామాయణం ఈ ఏడాది నవంబర్ లో రాబోతోంది. కట్ చేస్తే, ఆరునెలల గ్యాప్ తర్వాత రాజమౌళి రామాయణం చూడబోతున్నాం. ఔను వారణాసి లో కూడా రామాయణం ఉంది. కాకపోతే హిందీ హీరో రణ్ బీర్ కపూర్ చేస్తున్న రామాయణం పూర్తిగా రాముడి కథ అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న వారణాసి లో రామాయణం ఒక ఘట్టం మాత్రమే.. కాని ఇప్పుడు ఈ ఇద్దరు రాముళ్ల మధ్యే పోటీ పోటెత్తేలా ఉంది. అలాని హిందీ రామాయణం, తెలుగు వారణాసి రెండూ ఒకేసారి రిలీజ్ కావట్లేదు.. కాని పోలీక మాత్రం తప్పేలా లేదు. కట్ చేస్తే ఒకరు వెయ్యికోట్ల రాముడు కావొచ్చు, ఇంకొకరు 1400 కోట్ల రాముడు కావొచ్చు... కాని సీన్లోకి 1200 కోట్ల కర్ణుడు వస్తున్నాడు. 10నిమిషాల్లోనే ఒక సినిమాను 1200 కోట్ల మూవీగా మార్చిన రెబల్ కర్ణుడు వారణాసి మీద దాడి చేసేందుకు రెడీ అవుతున్నట్టున్నాడు.. సో ఈ మూడు భారీ కటౌట్లు, అతి భారీ పాత్రలు, అంతకుమించి అంచనాలు, ఏది పాన్ ఇండియాను షేక్ చేసేలాఉంది? ఇంకేది పాన్ వరల్డ్ మార్కెట్ కి షాక్ ఇచ్చేలా ఉంది?

వారణాసి మూవీలో రుద్రుడిగా, శివుడిగా కనిపించబోతున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఇందులోనే 25 నిమిషాలు రాముడి అవతారంలో దర్శన మివ్వబోతున్నాడు. ఇది రాజమౌళి కన్పామ్ చేసేసిన అంశమే.. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వారనాసిలో పాతిక నిమిషాలు కనిపించే రాముడుతో, 3 గంటల హిందీ రామాయణాన్ని పోల్చటం..యానిమల్ గా ఫోకస్ అయిన రణ్ బీర్ కపూర్, రాముడిగా జనాల్లోకి దూసుకెళతాడా? సూపర్ స్టార్ మహేశ్ బాబు రాముడిగా వెండి తెరమీద విల్లు విరుస్తాడా? రెండూ కూడా ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ అవటానికి చాలా కారణాలున్నాయి... ఇది తెలుగు బ్యాచ్ తో పాటు హిందీ బ్యాచ్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుంటోంది.

2 వేల కోట్లకు ఒక భాగం చొప్పున హిందీ రామాయణం 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రాబోతోందంటున్నారు. కాకపోతే ఇవన్నీ ఫేక్ లెక్కలు 900 కోట్ల నుంచి 1000 కోట్లకు మించి బడ్జెట్ ఉండకపోవచ్చే వాదనా వినిపిస్తోంది. ఇక వారణాసి బడ్జెట్ విషయానికి వస్తే, 1359 కోట్లు అంటే ప్రమోషన్ తో కలిపి మొత్తంగా రౌండ్ ఫిగర్ వేసుకుంటే 1400 కోట్ల సినిమాగా రాబోతోంది.ఇక్కడ బడ్జెట్ సమస్య కాదు, తీస్తున్న దర్శకులు, నటిస్తున్న నటులు.. ఔను నితిష్ తీవారి తీసిన దంగల్ ఇండియా నెంబర్ వన్ మూవీగా ఇప్పటికీ 2000 కోట్ల వసూళ్లతో అదే స్థానం అలానే ఉంది. 1850 కోట్ల వసూళ్లతో రెండోస్థానంలో రాజమౌళి మూవీ బాహుబలి ఉంది. ఇద్దరు దర్శకులు గట్టి దర్శకులే. టాప్ డైరెక్టర్లే... వీల్ల మేకింగ్ లో వస్తున్న సినిమాలవటం, అది కూడా పాన్ వరల్డ్ లెవల్లో వస్తుండటంతో, దేనికి ఏది తక్కువ అనుకోలేం.

దీనికి తోడు రామాయణం అంటేనే హిందువుల్లో రోమాలు నిక్కబొడిచే ఎమోషన్... అలాంటిది అదే రెండు భాగాలుగా పాన్ వరల్డ్ లెవల్లో రాబోతోందంటే, రణ్ బీర్ కపూర్ పంటపండినట్టే.. అలానే వారణాసి ఎంత ఫాంటసీ మూవీ అయినా, రాజమౌళి మేకింగ్ లో 25 నిమిషాలు రామ రావణ యుద్దంటే, థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. కాబట్టి ఇక్కడ కథ, మేకింగ్ మీద ఎలాంటి డౌట్లు లేవు.. రెండు సినిమాలు కూడా అంచనాలు మించేస్తున్నాయి.ఐతే ఇక్కడ సమస్య రాముడిగా ఎవరు మెప్పిస్తారు... యానిమల్ రణ్ బీర్ కపూర్ ని రాముడిగా జనం అభిమానిస్తారా? మహేశ్ బాబుకే విల్లు విరిచే అద్రుష్టం దక్కిందంటారా?

ఈ ప్రశ్నకు ఏ హీరోజవాబుగా మారినా వాళ్ల దశ తిరిగినట్టే.. త్రిబుల్ ఆర్ లో కేవలం విల్లు పట్టే ఒక్క ఫోజ్ తో రామ్ చరణ్ ని నార్త్ ఇండియా ఫిదా అయ్యింది... కాబట్టి 25 నిమిషాల రాముడికి, 3 గంటల రాముడికి మధ్య పోటీ చిన్న విషయం కాదు.. కాకపోతేఈఏడాది నవంబర్ లో హిందీ రామాయణం, వచ్చే ఏడాది మార్చ్ లేదంటే ఏప్రిల్ లో వారనాసి రాబోతున్నాయి.. రెండీంటి మధ్య 6 నెల్ల గ్యాప్ ఉన్నా, ఈ ఇద్దరు రాముల్ల మధ్య పోలిక మాత్రం ఉండి తీరుతుంది.. ఐతే వారనాసికి కల్కీ సీక్వెల్ పోటీ ఇచ్చేలా ఉంది. కర్ణ 3102 మూవీ వారణాసి రిలీజ్ కి ముందు లేదంటే తర్వాత వారం గ్యాప్ లోనే వచ్చే అవకాశాలున్నాయి... దానికి థియేటర్స్ ఇష్యూనే కారణం అంటున్నారు. అదేం లాజిక్కో కాని ఈ ఇద్దరు రాముల్ల మధ్య పోలిక పోటీ పెరిగే టైంలో, కర్ణుడిగా బాహుబలి ఎంట్రీ ఉంటుందనే మాట ఇంట్రస్టింగ్ గా ఉండేలా ఉంది.

Published : 
  • 25 February 2026, 4:25 PM IST