పాన్ ఇండియా లెవల్లో ఒకసారి బాహుబలి వస్తే కిలో మీటర్ల కొద్ది టిక్కెట్ల కోసం క్యూలైన్లు కనిపించటం ఒక చరిత్రం.. మళ్లీ ఆరేంజ్ హిస్టరీ రావాలంటే వారణాసి రావాల్సిందే.. అంతగా జనాలను థియేటర్ల వైపు పరుగులు తీయించేంత, క్యూరియాసిటీ ఈ సినిమాకే పెరుగుతోంది. కాకపోతే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మీద కూడా వారణాసి రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి... ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కూడా, వేల కోట్ల వసూల్లు రాబట్టే సినిమా అనుకుంటున్నారు. ఈ అంచనాలెలా ఉన్నా, ఒకే సారి ఈ మూడు తుఫాన్ లు వస్తే, బాక్సాఫీస్ పరిస్తితేంటి?.. అంటే ఒకదానికి ఒకటి పోటీగా కాకున్నా, ఒకటి తర్వాత ఒకటి నెల రోజుల గ్యాప్ లో వస్తే, బాక్సాఫీస్ తట్టుకుంటుందా? 2027 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒకటికి మించి మరొ సునామీకి డేట్లు ఫిక్స్ అయ్యాయి.. ఆల్ మోస్ట్ అన్నీ కన్పామ్.. అవేంటో చూసేయండి.
30రోజులు గ్యాప్ లో ఒకటి తర్వాత ఒకటి, సునామీ వస్తే తట్టుకుంటారా? ఇంచుమించు ఇలాంటి సునామీ ఇప్పడు ఇండియాన్ బాక్సాఫీస్ లో రాబోతోంది. ఒకసారి కాదు, రెండు సార్లు, కాదు ఏకంగా మూడు సార్లు.. ప్రతీ 30 రోజులకో అణుబాంబు పేలినట్టు, పాన్ ఇండియా మార్కెట్ ని పాన్ వరల్డ్ సినిమాలు షేక్ చేసే లా ఉన్నాయి.. వచ్చే ఏడాది డ్రాగన్ తో ఈ సినీ సునామీ మొదలు కాబోతోంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో మూడు పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా డ్రాగన్.
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. కాని మేకింగ్ కి టైం పట్టేలా ఉండటంతో, దసరా, దీపావళిని కాదని సంక్రాంతికి రిలీజ్ మార్చినట్టు తెలుస్తోంది.2027 జనవరి 10న డ్రాగన్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.నిజానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ తర్వాతే, పాన్ ఇండియా లెవల్లో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ లో ఒక షాక్ వేవ్ కనిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తోందంటే,థియేటర్స్ లో పూనకాలు కన్ఫామ్.. అందుకే దాంతో పోటి పడకుండా, ఆ రిలీజ్ డేట్ కి నెల ముందు, రెండు నెలల తర్వాత మరే సినిమా రిలీజ్ కాకుండా జాగ్రత్త పడతారు.
లేదంటే రాజమౌళి వారణాసి తో పోటీ పడటం అంటే, నిప్పుతో చెలగాటమే.. అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే, స్పిరిట్ కి వారణాసికి మధ్య కనీసం నెలరోజుల టైం ఉంటోంది. ఉగాది స్పెషల్ గా వారణాసి వస్తుంటే, అందుకు నెల ముందు మార్చ్ 5 కి స్పిరిట్ రాబోతోంది. సందీప్ రెడ్డి , రెబల్ స్టార్ ప్రభాస్ వైల్డ్ కాంబినేషన్ , వచ్చే ఏడాది మార్చ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది..ఐతే జనవరి 10న డ్రాగన్ రిలీజ్ అయితే, మార్చ్ 5న స్పిరిట్ రావటం కన్ఫామ్ అయ్యింది. దాదాపు 30 నుంచి 50 రోజుల గ్యాప్ ఈ రెండు సినిమా లమధ్య ఉంటే, నెలరోజుల గ్యాప్ లో వారణాసి వస్తోంది.. సో యావరేజ్ గా ప్రతీ 30 రోజులకో పాన్ వరల్డ్ మూవీ, పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేయబోతోంది. అంటే జనవరి నుంచి మే జూన్ వరకు పూర్తిగా వచ్చే ఏడాది మీద తెలుగు సినిమాల డామినేషనే కనిపించేలా ఉంది. మరీ ఈ వరుస సునామీలను ఇండియన్ బాక్సాఫీస్ తట్టుకుంటుందా? చూడాలి.