త్రివిక్రమ్ కోసం ఎవరు బెస్ట్…?

"త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే డైలాగ్స్. కానీ ఇప్పుడు గురూజీ తన రూట్ మార్చి, రాజమౌళి రేంజ్ లో ఒక గ్లోబల్ మైథలాజికల్ ఎపిక్ ప్లాన్ చేస్తున్నాడు.

Post Published By: dialnews
Updated : 23 February 2026, 2:36 PM IST

"త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే మనకి గుర్తొచ్చేది ఫ్యామిలీ ఎమోషన్స్, అదిరిపోయే డైలాగ్స్. కానీ ఇప్పుడు గురూజీ తన రూట్ మార్చి, రాజమౌళి రేంజ్ లో ఒక గ్లోబల్ మైథలాజికల్ ఎపిక్ ప్లాన్ చేస్తున్నాడు. అదే 'గాడ్ ఆఫ్ వార్'. ఈ సినిమా పౌరాణిక గాథ కుమారస్వామి కథ ఆధారంగా తెరకెక్కుతోంది. దీని బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అని సమాచారం. ఈ ప్రాజెక్ట్ మొదట అల్లు అర్జున్ తో అనౌన్స్ చేశారు. కానీ 'పుష్ప 2' తర్వాత బన్నీ అట్లీ డైరెక్షన్ లో బిజీ అవ్వడంతో, ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిందని వార్తలూ వచ్చాయి. నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరును హింట్ ఇచ్చాడు.

తారక్ కూడా కుమారస్వామికి సంబంధించిన ఒక బుక్ చదువుతూ కనిపించడంతో 'గాడ్ ఆఫ్ వార్' కి ఆయనే హీరో అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అయితే, రీసెంట్ గా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ వద్దకే వెళ్ళిందని, ఫిబ్రవరి 2027 నుండి షూటింగ్ మొదలవుతుందని కొత్త టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఒక పజిల్ లా మారింది. శివ పార్వతుల తనయుడు, దేవతల సేనాధిపతి అయిన కార్తికేయుడు తన తండ్రి శివుడిని కలిసే ప్రయాణం మరియు అసుర సంహారం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. త్రివిక్రమ్ తన కెరీర్ లోనే మొదటిసారిగా భారీ స్థాయిలో VFX మరియు CGI ని వాడుతున్నారు. రాజమౌళి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమా ఉండబోతోంది.

కుమారస్వామిని 'God of War' అని పిలుస్తారు, అందుకే ఈ సినిమాకు ఆ పవర్ ఫుల్ టైటిల్ ని సెట్ చేశారు. కేవలం త్రివిక్రమ్ మాత్రమే కాదు, డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా కుమారస్వామి కథతో 'గౌరీ తనయ' అనే సినిమా అనౌన్స్ చేశాడు. అటు తమిళంలో హీరో జీవా కూడా మురుగన్ కథతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఒకే దేవుడి కథతో ముగ్గురు దర్శకులు రావడం త్రివిక్రమ్ కి ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. అందుకే ఆయన స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. "త్రివిక్రమ్ మేకింగ్ లో ఒక మైథలాజికల్ వండర్ ని చూడటం ఫ్యాన్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తారా లేక బన్నీనా అన్నది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది."

Published : 
  • 23 February 2026, 2:36 PM IST