అమెరికా కూడా అల్లకల్లోలం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయారు. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్! '

Post Published By: dialnews
Updated : 11 March 2026, 4:40 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయారు. హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్! 'గబ్బర్ సింగ్' తో క్రియేట్ చేసిన మేజిక్ ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' తో రిపీట్ కాబోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డులు తిరగరాయడం పవన్ కళ్యాణ్‌కు అలవాటే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్స్ కోసం టికెట్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి.

కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే 5000+ టికెట్లు అమ్ముడయ్యాయి.
ఈ సినిమా మార్చి 18న గ్రాండ్‌గా నార్త్ అమెరికాలో ప్రీమియర్ కాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
ఈ సినిమాపై ఎందుకు ఇంత హైప్ ఎందుకంటే, 12 ఏళ్ల తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న సినిమా ఇది.

ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది' అనే రేంజ్‌లో హరీష్ శంకర్ మాస్ ఎలిమెంట్స్ ప్లాన్ చేశారు. వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చే సాంగ్స్ ఎప్పుడూ చార్ట్‌బస్టర్సే! పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, లుక్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ప్రీమియర్ షోల నాటికి ఈ నంబర్ ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. పవర్ స్టార్ క్రేజ్ ముందు ఏ రికార్డైనా దిగదుడుపే అని మరోసారి నిరూపితమైంది.

Published : 
  • 11 March 2026, 4:40 PM IST