వారణాసికి వరాలు.. 1000 కోట్ల లేడీ లెగ్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో వారణాసిని తీస్తున్న రాజమౌలి, హీరోయిన్ విషయంలో నిజంగా పర్ఫెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడా?

Post Published By: dialnews
Updated : 4 March 2026, 5:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో వారణాసిని తీస్తున్న రాజమౌలి, హీరోయిన్ విషయంలో నిజంగా పర్ఫెక్ట్ నిర్ణయమే తీసుకున్నాడా? మొదట్లో తను హీరోకి అక్కలా ఉందన్నారు. అంతగా గుడ్ పేయిరింగ్ కాదన్నారు.. ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. కాని అసలు వారణాసికి వరల్డ్ ప్లాట్ ఫాంలో ఇప్పుడు ప్రియాంక చోప్రానే పెద్ద దిక్కైంది. తన వల్లే వారణాసికి వరల్డ్ మార్కెట్ లోరీచ్ పెరుగుతోంది. మహేశ్ బాబు ఇక్కడ సూపర్ స్టార్... అంతెందుకు సింగిల్ హిందీ మూవీ చేయకున్నా, తనెవరో నార్త్ ఇండియన్స్ కి తెలుసు. అంతగా నార్త్ లో కూడా తనకి గుర్తింపు ఉంది. అలా చూస్తే 1.4 బిలయన్ జనాల్లో కనీసం వందకోట్ల మందికైనా తెలిసిన ముఖం తనకిది.అలాంటి తనకి వరల్డ్ మార్కెట్ లో ప్రియాంక చోప్రా ప్లస్ అవుతోందా? అక్కడ అంతా తానేనా? ఫ్యాన్స్ కూడా కన్విన్స్ అయ్యేంతగా రాజమౌలి నిర్ణయం వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి?

వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా 2027 మార్చ్ లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా భారం థియేటర్స్ లో మాత్రం మహేవ్ బాబు మోస్తే, బయటేమో హీరోయిన్ ప్రియాంక చోప్రా మోయాల్సి వస్తోంది. ఎందుకంటే రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడైనా, బాహుబలి, త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా తనకి ఎంత పేరున్నా, హాలీవుడ్ కుదిపేసేంత పేరు, మార్కెట్ తనకి లేదు.మహేశ్ బాబుకి 140 కోట్ల పైనే ఉన్న భారతీయుల్లో చాలా మందికి తెలుసు... సూపర్ స్టార్ గా పాన్ ఇండియా మూవీ చేయకున్నా, తనకి భారతీయులందరిలో ఆల్ మోస్ట్ రీచ్ ఉంది. గుడ్ లుక్కింగ్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవన్నీ నిజాలే.. కాని వరల్డ్ ప్లాట్ ఫాంలో ఇండియన్ స్టార్స్ కి ఉన్న గుర్తింపు తక్కువ.. హాలీవుడ్ సినిమాల్లో నటించిన దీపికా అండో కోకే అప్పడప్పుడు అంత గుర్తింపు ఉండదు.

అలాంటిది హాలీవుడ్ మూవీలు చేయకుండా, వరల్డ్ మార్కెట్ మీద దాడి చేయకుండా, మన హీరోలే కాదు, బాలీవుడ్ స్టార్లకు కూడా వరల్డ్ మార్కెట్ ని ఇన్ ఫ్లూయెన్స్ చేసే సీన్ ఉండదు.. ఇది బ్రూటల్ రియాలిటీ... ఐతే ఇక్కడే ప్రియాంక చోప్రా మీదే భారం మొత్తం పడుతుంది. తను మహేశ్ బాబుకి అక్కలా ఉంటుందని ఎవరెన్ని మాటలన్నా, కుర్ర మహేశ్ లుక్ కి ప్రియాంక లాంటి ముదురు హీరోయిన్ ఎందుకని ఇంకెన్ని కామెంట్లు పేలినా...తననే వారణాసికి ఫీమేల్ లీడ్ గా తీసుకోవటం వెనక రాజమౌళి తెలివైన స్ట్రాటజీ ఉంది. ఇదేం బ్రహ్మ రహస్యం కాదు.. హాలీవుడ్ లో డజన్ల కొద్ది సినిమాలు, వెబ్ సీరీస్ లు చేసి వరల్డ్ ప్లాట్ ఫాంలో మంచి క్రేజ్, మార్కెట్ సొంతం చేసుకుంది ప్రియాంక చోప్రా. ఇక తన భర్త నిక్ జోన్స్ కూడా హాలీవుడ్ నటుడే, పాప్ సింగర్ గా తనకి భారీగానే గుర్తింపు ఉంది.

దీనికి తోడు ప్రియాంక చోప్రా లేటెస్ట్ ప్రాజెక్ట్ ది బ్లఫ్ వరల్డ్ వైడ్ గా దుమ్ముదులుపుతోంది. అందుకే వారణాసిని వరల్డ్ ప్లాట్ ఫాం మీదకు తీసుకెళ్లాలంటే, వరల్డ్ మార్కెట్ లో క్రేజ్ ఉన్న ప్రియాంకే సరైంది..తనని ఈ సినిమాకోసం తీసుకున్నప్పుడు చాల మందికి నచ్చకున్నా, మార్కెట్ స్ట్రాటజీ వల్లేతనని రాజమౌళి తీసుకున్నాడని తేలుస్తోంది.. ఇది సరైన నిర్ణయం అనటానికి తన కొత్త మూవీ ది బ్లాఫ్ కారణమౌైతోంది. మహేవ్ బాబు కూడా ఈ సినమా చూసి, ఇండియన్ సినిమా స్థాయిని వరల్డ్ లెవల్ కి తీసుకెళ్ళిన నటి అని ప్రియాంకని తెగ మెచ్చుకున్నాడు మహేశ్.

Published : 
  • 4 March 2026, 5:00 PM IST