ఆస్కార్ స్టేజ్ మీద.. వారణాసి బాంబు…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లోతెరకెక్కుతున్న మూవీ వారణాసి.

Post Published By: dialnews
Updated : 9 March 2026, 8:20 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, హాలీవుడ్ లో సెటిలైన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా కాంబినేషన్ లోతెరకెక్కుతున్న మూవీ వారణాసి. 2027 మార్చ్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ లో ఎమోషన్ పెరిగినట్టుంది. ప్రియాంక చోప్రా అయితే ఏకంగా హాలీవుడ్ లో వారణాసి ప్రమోషన్ ని చాలా ఎమోషన్ తో క్యారీ చేస్తోంది. ప్రజెంట్ తనకి ఆస్కార్ అవార్డుల వేదికను హోస్ట్ చేసే ఛాన్స్ చిక్కింది. మొత్తం ఆరుగురు ఆకాడమీ అవార్డుల సెరమనీని హోస్ట్ చేయబోతున్నారు. అలాంటి 6 గురు ప్రెజెంటర్స్ లో ప్రియాంక చోప్రా ఒకరు... ఐతే ఇక్కడ కామన్ కనెక్షన్ ఏంటంటే, తనే వారణాసి హీరోయిన్ కూడా... రీసెంట్ గా ది బ్లఫ్ మూవీ ప్రమోషన్ లో వారణాసి సినిమాను ప్రమోట్ చేసిన తను, ఆస్కార్ వేదిక మీద వారనాసి బాంబు పేల్చబోతోందా?

జస్ట్ ఇమాజిన్ ఆస్కార్ అవార్డులు ఇచ్చే వేదిక మీద వారణాసి మూవీ పోస్టర్ పడితే ఎలా ఉంటుంది?ఆల్రెడీ రాజమౌలి డైరెక్షన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ పోస్టర్ ఇలానే ఒకసారి ఆస్కార్ అవార్డుల సెరమని జరుగుతున్నప్పుడు, అక్కడ స్క్రీన్ మీద పడింది. నాటు నాటు పాటకి అక్కడి డాన్సింగ్ టీం చిందేసింది. ఇక కీరావాణి, చంద్రభోస్ లకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది.కట్ చేస్తే ఈ సారి ఆస్కార్ పోరులో రాజమౌళి సినిమా లేకున్నా, ఆ స్టేజ్ మీద ఈ మూవీ పోస్టర్ పడేలా ఉందా? ఇందులో హీరోయిన్ రోల్ వేస్తున్న ప్రియాంక చోప్రాకు ఈ సారి ఆస్కార్ స్టేజ్ మీద సందడి చేసే ఛాన్స్ చిక్కింది. ప్రతీ ఏడాది ఆస్కార్ అవార్డుల పండక్కి, కనీసం ఆరుగురు ప్రెజెంటర్లను సెలెక్ట్ చేయటం కామన్. వాళ్లే ఈ అవార్డుల ఈవెంట్ కి హోస్ట్ లా కనిపిస్తారు.

షోని నడిపిస్తారు.. ఆ ఆరుగురిలో ఒకరిగా కనిపించబోతోంది ప్రియాంక చోప్రా. ఇప్పుడు తన వల్లే స్టేజ్ మీద వారణాసి సందడి కనిపించేలా ఉంది. నిజానికి అకాడమీ జ్యూరీ మీద ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి గట్టి ఇన్ ఫ్లూయెన్స్ ఉంటుందంటారు. త్రిబుల్ ఆర్ టైం నుంచే ఓటీటీ అధినేతకి, రాజమౌళితో మంచి బిజినెస్ రిలేషన్ షిప్ మొదలైంది.అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్త సపోర్ట్ తో, వారణాసికి ఆస్కార్ వేదిక మీద ఫ్రీ అనిపించే ప్రమోషన్ దక్కేలా ఉంది. ఒకవైపు వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా స్టేజ్ మీదున్నప్పుడు, వారణాసి మీద ఏదో అంశం చర్చకు రావటం, అప్పుడు వారనాసి పోస్టర్ అక్కడ స్క్రీన్ మీద కనిపించటం జరగొచ్చని తెలుస్తోంది. ఇది కూడా ప్రమోషన్ లో భాగంగానే చేస్తున్నారని తెలుస్తోంది.

కాకపోతే ప్రియాంక చోప్రా ఆస్కార్ ఈవెంట్ ప్రజెంటర్ అవటం వారణాసి టీం కి అదనంగా కలిసొచ్చే అంశం.. ఏదో కావాలని వారణాసి పోస్టర్ వేయకుండా, తన నెక్ట్స్ మూవీ అని చెప్పి, అందులో తన పాత్ర మీద సెటైర్లు వేస్తూ, అలా రియలిస్టిక్ గా ప్రమోషన్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ ప్రాజెక్ట్ ది బ్లఫ్ ప్రమోషన్ లో భాగంగా, తనో ఎపిక్ మూవీ వారణాసిలో నటిస్తున్నట్టు ప్రచారం చేస్తోంది. అసలు సినిమాకంటే ఈ మూవీ ప్రమోషనే ఎక్కువ చేయటంతో, వారణాసి ప్రొడ్యూసర్స్ ప్రియాంకకి ఏమైనా అధనంగా పే చేస్తున్నారా అన్న అనుమానాలొస్తున్నాయి..నిజమేదైనా, ప్రియాంక వల్ల వారణాసి తలరాతే మారిపోయేలాఉంది.

Published : 
  • 9 March 2026, 8:20 PM IST