సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. ఆవిషయం తెలుగోల్ళకంటే అరవ తంబీలకే బాగా తెలుసు.. చాలా సార్లు కోలీవుడే గ్రేట్ అంటూ, తెలుగు సినిమా మీద బురద వేసే బ్యాచ్ కూడా చాలా సార్లు సోసల్ మీడియాలో దుకానం మూసేయాల్సి వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ భయం, ఆ కంగారు రాజమౌళి ఫాలోవర్స్ లో పెరిగిందా? ఆల్ ఆఫ్ సడన్ గా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతుకు హైపర్ గా మారారు..? వారణాసి మూవీ పోస్టర్ లో ఇక ఎస్ ఎస్ రాజమౌళి ముద్ర ఉండదనే చర్చ ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? వారణాసి విసయంలో ఎవరూ ఊహించని కొత్త వివాదం, దాంతో మొదలైన చర్చ వెనక ఎవరున్నారు? మొత్తంగా ఇదెక్కడికి వెళ్లి ఆగేలా ఉంది?
సూపర్ స్టార్ మహేవ్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు వారణాసి మూవీ టీం కి చుక్కలు చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది ఎస్ ఎస్ ఎమ్ బీ 26 మాత్రమే కాని, ఎస్ ఎస్ ఆర్ 13 కాదని అంటున్నారు. అంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు 26వ మూవీ అన్న హ్యాష్ ట్యాగే వైరల్ చేస్తున్నారు. ఎస్ ఎస్ ఆర్ 13 అంటే ఎస్ ఎస్ రాజమౌళి 13వ సినిమా అని అర్దం..అయితే వారణాసి పోస్టర్ లో ఇక నుంచి రాజమౌలి రాజ ముద్ర ఉండేలా లేదు.. ఇది కాకుండా ఇది రాజమౌళి సినిమా అని అర్ధమొచ్చే స్టేట్ మెంట్ కూడా ఉండకపోవచ్చు.. కారణం రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడైనా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇది మహేశ్ బాబు మూవీగానే కన్సిడర్ చేస్తున్నారు.. సెన్సేషనల్ కాంబినేషనే అయినా,కంప్లీట్ ఇది సూపర్ స్టార్ మూవీగా ప్రమోట్ చేయకపోతే ఊరుకునేలా లేరు.
ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఫైట్ జరుుగుతోంది. ఐతే బాహుబలి ప్రొడ్యూసర్ శోభూ యార్లగడ్డ సీన్ లోకి వచ్చి, సినిమా అనేది కలెక్టీవ్ ఎఫర్ట్స్ అన్నాడు. కాకపోతే ఎవరి ఎఫర్ట్స్ ఎంతున్నా, కళాత్మకత వరకొచ్చే సరికి ఎక్కువ శాతం క్రెడిట్ దర్శకుడికే దక్కాలన్నాడు. అసలు ఈ విషయం మీద చర్చ అనవసరం... ఇది రాజమౌళి సినిమా అని పోస్టర్ వదిలితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కాదనడు..అలాంటిది దర్శకుడు, హీరో మధ్య లేని విబేధాలు ఫ్యాన్స్ కి ఎందుకు అనవసరంగా అన్న అర్ధం వచ్చేలా తన ట్వీట్లున్నాయి.
ఐతే ఇదంతా మీడియాలో ఒక బ్యాచ్ కావాలని రెచ్చగొట్టే కార్యక్రమం చేసిందన్న విషయం మాత్రం తేల్చాడు. ఆల్రెడీ మహేశ్ బాబు సినిమా వస్తోందంటే, యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ ప్రచారం కోసం కాపుకుని కూర్చుంటుంది.అలాంటిది, ఇలా హీరో, దర్శకుడి మధ్య నిప్పు పెట్టడానికి ఛాన్స్ వస్తే ఊరుకుంటారా? ఐతే ఇక్కడనే తెలివిగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టి, 2027 లో రిలీజ్ అయ్యే సినిమా విషయంలో, ఇప్పటి నుంచే నిప్పురాజేసే నెగెటీవ్ ప్రచారాలు పెంచేస్తోందోొ బ్యాచ్.. ఈవిషయంలో ఫ్యాన్స్ కూడా అలర్ట్ గా ఉండాలంటున్నీ మీనింగ్ తో అలర్ట్ చేశాడు బాహుబలి నిర్మాత శోభు.