సూపర్ స్టార్ వన్ నేనొక్కడినే అన్నాడు.. నెం. 1 మూవీతో దూసుకెళ్ళాడు..టాలీవుడ్ లో అంతగా దూసుకెళ్లిన తను, పాన్ ఇండియా మార్కెట్ లో మాత్రం చాలా వెనకబడ్డాడు. ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకున్నా తనకి, నార్త్ ఇండియా వరకు ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి గుర్తింపు కూడా ఉంది. కాని నార్త్ లో మాత్రం మార్కెట్ క్రియేట్ అవ్వాలంటే, పాన్ ఇండియా హిట్ పడాలి.. అక్కడే పాన్ ఇండియా హీరోలందర్ని దాటి, నెంబర్ వన్ అనిపించుకునే పనిలో ఉన్నాడు. కాబట్టే వారణాసితో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఐతే ఇప్పుడో కొత్త డిబేట్ మొదలైంది. సూపర్ స్టార్ మహేవ్ బాబు పాన్ ఇండియా నెంబర్ వన్ కావాలన్నా, పాన్ వరల్డ్ మార్కెట్ లో దూసుకెళ్లిన మొదటి సూపర్ స్టార్ అవ్వాలన్నా, మరొకరు నెం.1 కావాలి.. ఆయన నెంబర్ వన్ అయితేనే, మహేశ్ బాబు నెం. 1 అవుతాడు.. ఎందుకు? అది రాజమౌళేనా? ఇప్పుడు సడన్ గా రాజమౌలి నెం.1 అన్న డిస్కర్షన్ ఎందుకు మొదలైంది?
సూపర్ స్టార్ నెంబర్ వన్ గేమ్ వెనక మాస్టర్ మైండ్ రాజమౌళి ఉండబోతున్నాడు. మహేశ్ బాబు ఆల్రెడీ నెంబర వన్ అని చాలా విషయాల్లో ప్రూవ్ చేసుకున్నాడు. కాకపోతే అది తెలుగు మార్కెట్ వరకే పరిమితం.. ఐతే పాన్ ఇండియా లెవల్లో తను కాస్త వెనక బడటానికి రీజన్, అలాంటి ప్రాజెక్ట్ చేయకపోవటం... కాని పాన్ ఇండియాని మించేలా ఏకంగా పాన్ వరల్ట్ మూవీ చేస్తున్నాడు మహేశ్. రాజమౌలి మేకింగ్ లో వారణాసి 60శాతం పూర్తైంది...ఇప్పుుడ రెండు భాగాలుగా మారిస్తే, మొదటి భాగం 80శాతం పూర్తైనట్టని అనుకోవాల్సిందే.. 2027 ఏప్రిల్ లో మొదటి భాగం వస్తే, వచ్చే ఏడాది దసరాకు రెండో భాగం రిలీజ్ అవ్వొచ్చు.. ఇలాంటి చర్చ జరుగుతున్న వేళ, రాజమౌలి ఇప్పుడు ఇండియా నెంబర్ 2 అంటున్నారు. తన నెంబర్ వన్ స్థానానికి రెక్కలొచ్చాయంటున్నారు. నెంబర్ వన్ స్థానంలో హిందీ దర్శకుడు ఆదిత్య ధర్ వచ్చి చేరాడనంటున్నారు.
దానికి రీజన్ ధురంధర్ రెండు భాగాలు.. 260 కోట్ల ఖర్చుతో రెండు భాగాలు ఏడు గంటల నిడివి.. ఇక వసూళ్లు చూస్తే మొదటి భాగం 1200 కోట్లు, రెండో భాగం విడుదలైన వారానికే వెయ్యికోట్లు.. ఇలాంటి రికార్డులు రాజమౌళికి కూడా సాధ్యం కాలేదు..అందుకే రాజమౌళినే వెనక్కి నెట్టి ధురందర్ దర్శకుడు ఆదిత్య ధర్ ని నెంబర్ 1 అంటున్నారా? ధురందర్ రెండు భాగాలు బ్లాక్ బస్టరైన ఊపులో అలాంటి కామెంట్స్ పెరగొచ్చు..కాని ఇప్పటికి రాజమౌలినే నెంబర్ వన్ అన్న మాటే నిజానికి దగ్గరగా ఉంది. అలా అయినప్పుడే, పాన్ వరల్డ్ మూవీ తో మహేశ్ బాబు కూడా ఇండియా నెంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కనెక్షన్ ఇప్పుడు వారణాసితోనే ఉందని తేలింది. అక్కడికే వస్తాం.. 260 కోట్ల తో రెండు భాగాలుగా ధురందర్ తీశాడు ఆదిత్య ధర్.. అచ్చంగా 250 కోట్లతో బాహుబలి రెండు బాగాలు తీసిన రాజమౌళి లాంటి ప్రయత్నమే ఇది.
ఇంకో విషయం చెప్పాలంటే బాహుబలి మొదటి భాగం 580 కోట్లే రాబట్టింది. దానికి డబుల్ ధురందర్ 1200 కోట్లు రాబట్టింది. ఇక బాహుబలి 2 మాత్రం 1850 కోట్లు రాబడితే, ధురందర్ 2 అయితే 2 వేల కోట్లు రాబట్టేలా ఉంది. అంటే పదేళ్ల క్రితం బాహుబలి రెండు భాగాలు క్రియేట్ చేసిన అన్ని రికార్డులని ధురందర్ బ్రేక్ చేసినట్టేనా? ఆమాత్రానికే రాజమౌళిని వెనక్కి నెట్టి ఆదిత్య ధర్ ముందుకెళతాడా? కానే కాదు.ఎందుకంటే స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు ఫెల్యూర్ తెలియని దర్శకుడు రాజమౌళి. అంతేకాదు, పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసింది తనే.. రెండు భాగాల ట్రెండ్ సెట్ చేసింది కూడా తనే.. ఇక పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే పనిలో ఉన్న రాజమౌళి ఓ పాత్ ఫైండర్ .. కేవలం రెండు పాన్ ఇండియా హిట్లు రాబట్టినంత మాత్రాన ధురందర్ డైరెక్టర్ నెంబర్ వన్ అనలేం. అంతేకాదు ధురందర్ హిందీలో హిట్ కాని, దేశవ్యాప్తంగా బాహుబలి దుమ్ముదులిపినట్టు, ధురందర్ పాన్ ఇండియా అంతటా దూసుకెళ్లట్లేదు.. ఇది కూడా గమనించాలి. ఇక రాజమౌలి సినిమా అంటే, యూనానిమల్ గా దేశం మొత్తం ఊగిపోతుంది. వారణాసి కూడా వస్తే పాన్ వరల్డ్ షేక్ అయితే, లెక్కే మారిపోతుంది. కాబట్టి రాజమౌలి సినిమా రికార్డుల్ని మాత్రమే ఆదిత్య ధర్ బ్రేక్ చేయొచ్చు.. కాని తన స్థానాన్ని రిప్లేస్ చేసేంత స్థాయికైతే ఎదిగాడనలేం.