సూపర్ స్టార్ వారాణాసితో గ్లోబల్ సూపర్ స్టార్ అవటం ఖాయం... రాజమౌళి మేకింగ్ లో ఇండియా తరపున ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఏమాత్రం వర్కవుట్ అయినా గ్లోబల్ గా సూపర్ స్టార్ ఫేటే మారిపోతుంది.ఆల్రెడీ హాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ హీరో కాబట్టి, తనకి గ్లోబల్ గా ఏమాత్రం గుర్తింపు దక్కినా, తన లుక్స్ కూడా కలిసొస్తాయి కాబట్టి, రీచ్ కూడా పెరిగిపోతుంది. ఐతే ఇలాంటి టైంలో తను నెక్ట్స్ ఎవరితో సినిమా తీస్తాడంటే, సుకుమార్ తో జేమ్స్ బాండ్ లాంట్ సినిమా అన్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చేలా ఉన్నాడు మహేశ్ బాబు. తనకి గ్లోబల్ గా గుర్తింపు పెరిగే అవకాశం ఉన్నటైంలో, నమ్ముకోవాల్సింది పెద్ద దర్శకులని కాదు.. పెద్ద కథలను అని నిర్ణయం తీసుకున్నాడా? రాజమౌళి లాంటి దర్శకుడితో వారణాసి లాంటి మూవీ తీశాక, ఒక అనామకుడికి మహేశ్ బాబు ఆఫర్ ఇచ్చాడా? సుకుమార్ లాంటి దర్శకుడితోనే ఆ కొత్త డైరెక్టర్ పోటీ పడేలా ఉన్నాడని తెలుస్తోంది. అసలు మహేశ్ బాబు తన నెక్ట్స్ మూవీ విషయంలో ఒక కొత్త దర్శకుడిని, ఏకంగా సుకుమార్ కే పోటీగా మార్చేస్తున్నాడా? ఇంతకి ఎవరతను? మహేశ్ నిర్ణయం వెనకున్న రీజనేంటి?
వారణాసి 1300 కోట్ల నుంచి 1500 కోట్లపైనే పెట్టుబడితో తెరకెక్కుతున్నమూవీ. నిర్మాతైతే ఏకంగా అన్ లిమిటెడ్ బడ్జెట్ అని కూడా అన్నాడు. నెట్ ఫ్లిక్స్ సంస్త అయితే ఆమధ్య వారణాసి ఓటీటీ రైట్స్ కి 900 కోట్లు, ఇప్పుడు 1000 కోట్ల డీల్ కి సరే అన్నదని ప్రచారం జరుగుతోంది. ఫిల్మ్ టీం ఈ వార్తని ఖండించలేదు. అలాని సపోర్ట్ కూడా చేయలేదు.ఇక్కడ మ్యాటర్ అదికాదు.. తన సినిమాకు ఓటీటీ రైట్సే 1000 కోట్లొస్తే, ఇక థియేట్రికల్ గా ఎన్ని వేల కోట్లొస్తాయి... కనీసం 5 వేల కోట్లు కలిసొస్తే, 10 వేల కోట్లు వారణాసికి రావొచ్చనే అంచనాలున్నాయి. వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అన్న మాటే ఎగ్జైటింగ్ గా ఉంది... అందులో సగం థియేటర్స్ లో బాగా ఆడినా, 5 వేల నుంచి 10 వేల కోట్లు పెద్ద విషయమే కాదు.
ఇంత చరిత్ర వారణాసి మూవీతో మహేశ్ బాబుకి క్రియేట్ కాబోతోంది. అంటే గ్లోబల్ సూపర్ స్టార్ గా మారబోతున్నాడు. అలాంటప్పుడు జస్ట్ ఇమాజిన్, తను ఒక అనామకుడికి నెక్ట్స్ మూవీ ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుంది? సుకుమార్ మేకింగ్ లో మహేశ్ బాబు జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ముక్కు ముఖం తెలియని, ఒక కొత్త వాడికి అనుభవం లేనివాడికి దర్శకత్వ అవకాశమా?ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగాక, అక్కడి నుంచి దూకడం, కొత్త దర్శకుడికి ఆఫర్ ఇవ్వటం ఒకటే.. ఇది సర్వసాధారణంగా ఎవరికైనా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. కాని ఇదేదో నిజమయ్యేలా కనిపిస్తోంది. సుకుమార్ తో స్పై కాన్సెప్ట్ తో మహేశ్ మూవీ నిజంగానే చర్చల్లో ఉంది. ఆల్రెడీ రెండు సార్లు ఈ ఇద్దరు కలిశారు.. కాని ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చెప్పిన కథకి, మహేవ్ ఫిదా అయినట్టు తెలుస్తోంది.
అంతమాత్రానికే ఆఫర్ ఇస్తాడా అంటే, మహేశ్ బాబు మైండ్ సెట్ నిజంగా షాక్ ఇచ్చేలానే కనిపిస్తోంది. వారణాసి లాంటి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పడ్డాక, తను ఎవరితో సినిమాచేసినా రాజమౌలి మేకింగ్ స్టాండర్డ్స్ తో పోలిక తప్పదు... అందుకే పెద్ద దర్శకుడి కట్టే, పెద్ద కథనే నమ్ముకోవాలని ఫిక్స్అయినట్టున్నాడు మహేశ్. అందుకే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ అండ్ కో కి భిన్నంగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు.ఎలాగూ సుకుమార్, సందీప్ రెడ్డి వంగ తో కాంబినేషన్ తర్వాత ఉండే ఛాన్స్ఉంది. ఈలోపు అంటే, వారణాసి అయిపోయిన వెంటనే, ప్రశాంత్ నీల్ దగ్గరి అసిస్టెంట్ డైరెక్టర్ కే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
లోకల్ స్టోరీ ఇంటర్నేషనల్ డామినేషన్ ఇదే తన లక్షంగా కనిపిస్తోంది. మార్కెట్ మీద ఇంపాక్ట్ పెంచటం కోసమే మహేశ్ బాబు ఫార్ములా మారుస్తున్నట్టున్నాడు. రాజమౌలి మేకింగ్ లో ఒక్క సారి సినిమా చేసి, గ్లోబల్ గా గుర్తింపు వచ్చాక, మళ్లీ పాత ఫార్ములా మూవీలు కష్టం.. సూపర్ స్టార్ ఏకంగా ఒక మూవీతో ప్రపంచాన్నే చూశాక, మరో హిట్ కాదు, మరోలెవల్ గుర్తింపు కావాలని కోరుకోవటం కామనే... అందుకే దర్శకుడి విషయంలో తన అనుభవమేంటి, ఎంత పెద్ద దర్శకుడు కంటే, తనని మించే కథ దొరికితే, కొత్త వాల్లకైనా ఆఫర్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాడు మహేశ్. అందులో భాగంగానే వారాణాసి తర్వాత ఒక అనామక దర్శకుడితో సూపర్ స్టార్ మూవీ పడేలా ఉంది... ఆ ప్రచారం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.