బాహుబలి అంటూ ఒకటి వచ్చాకే, పాన్ ఇండియాని ఇలా కూడా షేక్ చేయొచ్చని తేలింది. వరల్డ్ ఆడియన్స్ కూడా ఒక్కసారిగా ఇటు చూసే పరిస్తితి కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు హాలీవుడ్ లోనే భూకంపం క్రియేట్ చేసేందుకు వారణాసి టీం రెడీ అయ్యిందా? ఏకంగా 70 వేల థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కి ఏర్పాట్లన్న వార్త మెల్లిగా, వైరలౌతోంది. ఇదేం కొత్త న్యూస్ కాదు.. గతంలోనే 55 వేల థియటర్స్ లోరిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా వారణాసి వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ లాక్కుంటోంది. హాలీవుడ్ సినిమాలు కూడా ఇంతవరకు 35 వేల థియేటర్స్ మించి రిలీజ్ కాలేదు. అలాంటిది ఒక ఇండియన్ సినిమా, అందులోనూతెలుగు సినిమా 55 వేల థియేటర్స్ లో రాబోతోందంటేనే, అదో సెన్సేషనల్ న్యూస్.. అలాంటిది, మరో 15 వే లథియేటర్స్ అంటే, బాహుబలి 1, బాహుబలి 2 రెండూ కలిపి రిలీజ్ అయిన థియేటర్స్ సంఖ్యని, ఇప్పడు 55 వే థియేటర్స్ కి కలిపేస్తున్నారు.. ఇంతకి హాలీవుడ్ కే సాధ్యం కాని దాన్ని వారణాసి టీం ఎలా సాధిస్తోంది... కేవలం 70 వేల థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తే హాలీవుడ్ షేక్ అవుతుందా? ఆరేంజ్ లో భూకంపం వస్తుందా?
డెబ్బై వేల థియేటర్స్ లో వారణాసి మూవీ రిలీజ్ అవుతోందా? మొన్నేమో 55 వే థియేటర్స్ అన్నారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మరో 15 వేల థియేటర్స్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇదే షాకింగ్ న్యూస్.. ఒక్క సారి ఊహించుకోండి.. 70 వేల థియేటర్స్ లో వారణాసి రిలీజ్ అంటే, ఓపెనింగ్స్ ఎన్నొస్తాయి... హాలీవుడ్ మూవీలు కూడా ఇప్పటి వరకు 35 వేల థియేటర్స్ మించి రిలీజ్ కాలేదు.అవతార్, సార్ వార్, డ్యూన్, అవేంజర్స్ లాంటివే 10 వేల థియేటర్స్ నుంచి 35 వేల థియటేర్స్ లోపే రిలీజ్ అయ్యాయి. అయినా 10 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల వరకు రాబట్టాయి.. అలా అయితే 55 వేల థియేటర్స్ కాదు ఏకంగా 70 వేల థియేటర్స్ లో వారణాసి వస్తే లక్ష కోట్ల రికార్డు క్రియేట్ అవుతుందా అంటే, కాదు.. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది.
ఏంటంటే, అమెరికాలో 40 వేల థియేటర్స్ ఉన్నాయి. చైనాలో 80 వేల థియేటర్స్ ఉన్నాయి. ఇక ఇండియాలో సుమారు 10 వేల వరకు థియేటర్స్ ఉన్నాయి.. వరల్డ్ వైడ్ గా లక్షా, అరవై వేల వరకు థియేటర్స్ ఉన్నట్టు లెక్కతెలుస్తోంది. ఐతే హాలీవుడ్ మూవీలు యూఎస్, యూరప్ లో డామినేట్ చేయటమే కాదు,హై టిక్కెట్ ప్రైజ్ వల్ల కలెక్సన్స్ లెక్కలు 10 వేల కోట్ల నుంచి 27 వేల కోట్ల మధ్య ఉంటాయి.అాదే ఇండియా, చైనా లో థియేటర్స్ ఎక్కువున్నా, టిక్కెట్ రేట్లు తక్కువ.. కాబట్టే హాలీవుడ్ సినిమాలకొచ్చినంతగా, వసూళ్లు ఇండియా, చైనీస్ మూవీస్ కి రావు.. దాన్నే బ్రేక్ చేసేందుకు అమెరికాలో కనీసంలో కనీసం 22వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా డ్రీమ్ వర్కస్, డిస్నీప్ డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్, ప్రమోషన్ లో నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ తీసుకుంటున్నాడు రాజమౌళి.
సో ఈలెక్కన ఒక్క సారి ఊహించుకోండి.. 55 నుంచి 70 వేల థియేటర్స్ లో సీట్లు, టిక్కెట్ ప్రైజులు, ఒక్క షోకి వసూళ్ల.. వన్ డే ఓపెనింగ్స్ ఎంతొస్తాయి.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. 70 వేల థియేటర్స్ లో యావరేజ్ గా 200 సీట్లే అని అనుకుంటే, కోటిన్నర వరకు సీట్లుంటాయి... ఒక్కటిక్కెట్ యావరేజ్ గా 400 రూపాయలేసుకున్నా.. ఒక్క షోకి 600 కోట్లు.. అదే నాలుగు షోలకి 2400 కట్లు.. అంటే వారణాసి ఓపెనింగ్సే 2 వే లకోట్లు దాటే ఛాన్స్ ఉంది. టాక్ బాగుండి వరల్డ్ వైడ్ గా జనాలు ఈ సినిమా ను చూస్తే, 15 రోజుల్లోనే అవతార్, అవెంజర్స్, స్టార్ వార్, డ్యూన్ సినిమాల రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ఉంది.. నిజంగా పాన్ ఇండియా సినీ సునామీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. వారణాసి మీద ఎంత నమ్మకం లేకపోతే, 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయటమే ఎక్కువ అనుకుంటే,ఆ నెంబర్ ని 70 వేల కు పెంచాడు రాజమౌళి... అందుకే వారణాసి టీం ఏం చేస్తోందన్న ప్రశ్న ఇండస్ట్రీని కంగారు పెడుతూనే, క్యూరియస్ గా మారేలా చేస్తోంది.