టాలీవుడ్ లో రాముడంటే రామారావే... కృష్ణుడంటే రామారావే.. ఆఖరికి కర్ణుడు, కంసుడు, రావణుడన్నా రామారావే.. అంతదా దేవుళ్ల పాత్రల పేర్లు చెబితే ఆ నట శిఖరం అందరికి గుర్తొస్తుంది. ఐతే ఇక మీదట రాముడంటే సూపర్ స్టార్ మహేశ్ బాబే గుర్తొస్తాడా? శివుడంటే కూడా తన పేరే ఎవరికైనా గుర్తురావాలా? ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత దేవుళ్ళని రిప్లేస్ చేసే , చేయబోయే స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబునేనా? త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ రాముడి అవతారంలో కాసేపు కనిపిస్తేనే, థియేటర్స్ షేక్ అయ్యాయి. అలాంటిది అదే రాజమౌలి డైరెక్షన్ లో రాముడిగా మహేశ్ బాబు కనిపిస్తే.. అది కూడా 35 నిమిషాలు తను విళ్లు పట్టుకుంటే... 4 వేల కోట్ల హిందీ రామాయణం కూడా షేక్ అవ్వాల్సిందే.. అందుకే ఇప్పుడు రాముడు, శివుడు పేర్లు చెబితే మహేశ్ బాబు, సుబ్రహ్మణ్య స్వామి పేరు చెబితే ఎన్టీఆర్ గుర్తుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. సూపర్ దేవుళ్ల లుక్స్ మీద లీక్స్ తో లెక్కలు మారిపోతున్నాయి.
రాముడు, కృష్ణుడు, ఇలా దేవుళ్లే కాదు, కర్ణుడు, రావణుడు ఇలాంటి పేర్లు వినిపించినప్పుడు కూడా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఎన్టీఆరే గుర్తొస్తాడు.. అలా తెలుగు జనాల్లో ముద్రపడిపోయింది. దేవుడంటే తన పేరే గుర్తొస్తుంది.. నారదుడన్నా, దేవదాసన్నా ఏఎన్నారే గుర్తొస్తుంది... ఇప్పుడు రాముడి ప్లేస్ ని సూపర్ రాముడు రిప్లేస్ చేస్తాడా?సూపర్ స్టార్ మహేశ్ బాబు వారనాసి లోరాముడిగా కనిపించబోతున్నాడు. శివుడి పాత్ర కూడా వేస్తున్నాడు. రుద్రుడిగా మాడ్రన్ లుక్ లో షాక్ ఇవ్వబోతున్నాడు. కేవలం రాముడు, శివుడి పాత్రలేసినంత మాత్రాన ఏకంగా రామారావునే రిప్లేస్ చేసేంత సీన్ మహేశ్ కి ఉంటుందా? అసలు అలా పోల్చమే తప్పు.. జెనరేషన్స్ మారాయి.. కాబట్టి వాటికి అనుకునంగా, కత్తిలాంటి కథ, అందుకు తగ్గ పాత్ర పడేలా కాని, రాముడంటే రామారావే కాదు, ఈ తరం హీరోలు కూడా గుర్తుకు వచ్చే ఛాన్స్ఉంది
అందుకు మంచి ఉదాహరణ త్రిబుల్ ఆర్ అందులో కొన్ని షాట్లు, సీన్లు కూడా కాదు, కేవలం కొన్ని షాట్లలో రాముడి అవతారం లో కనిపించాడు రామ్ చరణ్. అంతే నార్త్ ఇండియాలో పూనకాలు వచ్చేశాయి. అది రాజమౌలి మేకింగ్ కి ఉన్న సత్తా.. అందుకే అదే దర్శకుడి మేకింగ్ లో మహేశ్ బాబు కొన్ని సెకన్లు కాదు, నిమిషాలు కాదు, ఆల్ మోస్ట్ అరగంట పైనే రాముడిగా కనిపించబోతున్నాడంటే, పరిస్తితేంటి?ఇక సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడైనా, తరాలు మారాయి.. పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోలు దూసుకెళుతున్నారు. కాబట్టి వారణాసిలో రాముడిగా మహేవ్ అదరగొడితే, ఇక రాముడంటే మహేశే గుర్తొచ్చే చాన్సెస్ ఎక్కువ. శివుడిగా కూడా కనిపించబోతున్నాడు కాబట్టి, శంకరుడి పేరు చెప్పగానే మహేశ్ గుర్తుకువచ్చేంతగా ట్రెండ్ సెట్ అయినా అవ్వొచ్చు.ఇలానే లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్పగానే ఎన్టీఆర్ గుర్తొచ్చేలా త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ జరుగుతోంది. జాంబవంతుడి పాత్ర వేస్తూ బన్నీ కూడా బిజీ అయినట్టు తెలుస్తోంది. సడన్ గా డివోషనల్ రూట్లోకి పాన్ ఇండియా స్టార్ల జర్నీ మారింది. మరి హిందీ రామాయణాన్ని వారణాసి మించితే, రాముడంటే మహేశ్ తప్ప రణ్ బీర్ అండ్ కో గుర్తుకు రాని పరిస్తితి కూడా రావొచ్చు... రాజమౌలి మేకింగ్ లో ఏదైనా జరగొచ్చు.