సూపర్ స్టార్ ఫ్యాన్స్ గొంతు చించుకుని అడిగినా ఎన్నడూ రాజమౌళి వచ్చి వారణాసి అప్ డేట్స్ ఇచ్చింది లేదు. కాని ఇప్పుడు రిలీజ్ కి ఏడాదిన్నరముందే ఇంటర్వూలు ఇచ్చేశాడు. సినిమాలో చాలా ముఖ్యమైన ఘట్టాలను రివీల్ చేశాడు. హీరో పాత్ర, తన పెర్ఫామెన్స్ అందుకోసం టీం చేసిన హోమ్ వర్క్ ని చెప్పేశాడు.. ఇవన్నీ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా మతిపోతోంది. ఇంతకి రాజమౌళికి ఏమైందనే ప్రశ్న వాళ్లలో కూడా పెరిగింది. కట్ చేస్తే ఈ మొత్తం సీన్ వెనక 900 కోట్ల కారణం ఉంది. ఔను 1300 కోట్ల బడ్జెట్ మూవీఅని ప్రియాంకచోప్రా చెప్పినా, కాదు ఇది అన్ లిమిటెడ్ బడ్జెట్ మూవీ అని లెక్క మార్చాడు రాజమౌళి. కట్ చేస్తే, ఇప్పుడు 900 కోట్ల ఓటీటీ డీల్ కోసం, సడన్ గా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు. కొన్ని ఇంటర్వూలతోనే సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు.. ఇది కొత్తగా వినిపిస్తున్న ప్రచారం. ఐతే 900 కోట్ల ఆఫర్ గతంలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిందన్నారు.. అది నచ్చకే అంతకు మించి రాజమౌళి ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడన్నారు. తీరా చూస్తే ఆ నెంబర్ ఇప్పుడు 450 కోట్లకు పడిపోవటంతో, జాగ్రత్త పడుతున్నాడా? అందుకే హాలీవుడ్ మీడియాని రంగంలోకి దింపాడా? ఇంకా ఏం చేయబోతున్నాడు?
: వారణాసి మూవీ టీం ఎందుకు సడన్ గా అమెరికన్ రిపోర్టరలని పిలిపించి, అసంధర్బంగా ఇంటర్వూలు చేసిందనే ప్రశ్నకు సమాధానం 900 కోట్ల ప్లానింగ్. నిజానికి వారణాసి మూవీ బడ్జెట్ 1300 కోట్లని ఎప్పుడో ప్రియాంక చోప్రా చెప్పింది. కాని నిర్మాత మాత్రం అన్ లిమిటెడ్ బడ్జట్ అంటూ వెంటనే స్టేట్ మెంట్ ఇచ్చాడు.దీనికి కారనం ఆ టైంలో నెట్ ఫ్లిక్స్ నుంచి వారణాసి టీంకి ఓటీటీ రైట్స్ రూపంలో 900 కోట్ల ఆఫర్ వచ్చిందట. కాని అంతకుమించి రేటు పెంచేందుకే, బడ్జెట్ అన్ లిమిటెడ్ అని నిర్మాత స్టేట్ మెంట్ ఇచ్చాడని , ఇప్పుడు అర్ధమౌతోంది. ఎందుకంటే అప్పుడిచ్చిన ఆఫర్ కాదనటం వల్ల్ అని కాదుకాని, నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఈ సినిమాకు 450 కోట్ల కుమించి ఆఫర్ ఇచ్చేలా లేదు.ఎందుకంటే అమేజాన్ నుంచి మిగతా ఓటీటీల వరకు ఆల్ మోస్ట్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ కూడా ఓటీటీలో లక్సల్లో సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. మలయాళం మూవీలు, కొన్ని కొరియన్ తో పాటు హాలీవు్డ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకే ఉన్నా, పెట్టుబడికి రాబడికి పొంతన ఉండట్లేదట. నెట్ ఫ్లిక్స్ కూడా మిగతా ఓటీటీల్లానే, పే పర్ వ్యూ ఆఫ్షన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలా ఉంది.
అంటే ఒక సినిమా మినిమమ్ ఎమౌంట్ కి కొని, ఆతర్వాత ఓటీటీలో ఎన్ని వ్యూస్ వస్తే, ఆ వ్యూస్ ప్రకారం ఎమౌంట్ ఇవ్వటం.. లేదా షేర్ చేసుకోవటం.. అందుకే 900 కోట్ల ఆఫర్ పక్కన పెట్టి, అందులో సగం అంటే 450 కోట్ల ఆఫర్ ని కొత్తగా నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేసిందట. ఇదే వారణాసి టీం మైండ్ బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. 900 కోట్ల ఆఫరే కాదన్న వాళ్లం, అందులో సగానికి ఎలా ఒప్పుకుంటామనేది రాజమౌళి టీం అభిప్రాయం.అందుకే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో చూపించాలంటే, ఆ రేంజ్ లో బజ్ క్రియేట్ చేయాలి.. వరల్డ్ వైడ్ గా 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్లు రాబట్టే స్టామినా ఉన్నమూవీకి, అన్ని భాషల ఓటీటీ రైట్స్ 450 కోట్లా.? ఇది రాజమౌలి అండ్ టీం ని తొలస్తున్న ప్రశ్న అనంటున్నారు. ఏదేమైనా, అమెరికన్ రిపోర్టర్లకు ఇంటర్వూ ఇచ్చిన రాజమౌళి, త్వరలో సీఎన్ ఎన్, ఫాక్స్ న్యూస్ కి ఇంటర్వూలు కూడా ప్లాన్ చేస్తున్నాడట.ఒక్క సారి జేమ్స్ కామెరున్ వచ్చి వారణాసి టీజర్ లాంచ్ చేస్తే, వరల్డ్ వైడ్ గా లెక్కలే మారిపోతాయి. అసలు ఈ సినిమా ప్రమోషన్ కే వందకోట్లు ఖర్చు పెడుతుంటే, 450 కోట్ల ఓటీటీ ఆఫర్ ఎంతవరకు కరెక్ట్... అవసరం అయితే ఓటీటీ రైట్స్ అమ్మకూడదనేంత స్ట్రాంగ్ నిర్ణయానికి రాజమౌళి వచ్చాడంట. అందుకే సందర్భం కాకున్నా, హాలీవుడ్ రిపోర్టర్లను పిలిచి ఇప్పుడు ఇంటర్వూలు ఇచ్చాడు. ఇంకా ప్రమోషన్ పెంచి, వారాణాసి సత్తాఏంటో చూపించేందుకే రిలీజ్ కి ఏడాదిన్నరముందు నుంచే ప్రమోషనల్ హైప్ పెంచేస్తున్నాడు.