అల్లు అర్జున్ అంటే ఏంటో చూస్తారు… లోకేష్ దెబ్బకు టార్గెట్ ఆ సినిమాలేనా?

ఇండియన్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళబోయే పాన్-ఇండియా ప్రాజెక్ట్ వచ్చేస్తోంది. అదే అల్లు అర్జున్ వర్సెస్ లోకేష్ కనగరాజ్!”

Post Published By: dialnews
Updated : 18 February 2026, 1:00 PM IST

 

ఇండియన్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళబోయే పాన్-ఇండియా ప్రాజెక్ట్ వచ్చేస్తోంది. అదే అల్లు అర్జున్ వర్సెస్ లోకేష్ కనగరాజ్!” సినిమా. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన AA23 అనౌన్స్‌మెంట్ వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇంస్టాలో ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ఇప్పటికేయీ ట్రేండింగ్ లో ఉందంటే, ఈ సినిమాను సినీజనాలు ఎంత సీరియస్ గా తీసుకోబోతున్నారో క్లియర్ గా అర్థమవుతోంది. ఈ సినిమా టెంటేటివ్ టైటిల్ AA23… ఇండస్ట్రీలో LK7 అని కూడా పిలుస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ సినిమా ఓ సూపర్‌హీరో ఫాంటసీ యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. ఇంకా కొన్ని రిపోర్ట్స్‌లో ‘ఇరుంబు కై మాయావి ’ కాన్సెప్ట్ నుంచి ఇన్‌స్పిరేషన్ ఉండొచ్చని కూడా టాక్.అనౌన్స్‌మెంట్  బీజీమ్ కి వచ్చిన రెస్పాన్స్ అయితే సెమ్మ మాస్ అనిపించుకోవడంతో ఐకాన్ స్టార్ అభిమానుల కాలర్ ట్యూన్స్ గా మారిపోయింది. హీరోయిన్‌గా శ్రద్ధా కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా, ఇది ఇప్పటికీ రిపోర్ట్స్ లెవెల్లోనే ఉంది.

ఐమాక్స్ పోర్షన్స్‌తో, 2027 రిలీజ్ టార్గెట్ అంటూ బజ్ క్రియేట్ అవుతున్న ఈ సినిమా, పాన్ ఇండియా రికార్డులే టార్గెట్ గా శరవేగంతో తెరకెక్కబోతోంది.ఈ సినిమా LCU స్టైల్ డార్క్ యాక్షనా, లేక ఫుల్ సూపర్‌హీరో ఫాంటసీనా? అనేది తదుపరి అనౌన్స్ మెంట్ తో తేలిపోనుంది. యాక్షన్ ప్లస్ మ్యూజిక్ నువ్వా నేనా అని పరిగెత్తబోతున్న ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడని, తన పాన్ ఇండియా సెన్సేషన్ మూవీ పుష్ప 2 రికార్డులను తానే మళ్ళీ దాటేయాలనే విజన్ తో ఉన్నాడని కనబడుతోంది.

Published : 
  • 18 February 2026, 1:00 PM IST