నేషనల్ క్రష్ మృణాల్ ఠాకూర్ కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా, బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఆమె తన ప్రయాణాన్ని టెలివిజన్ సీరియల్స్‌తో ప్రారంభించింది. 'కుంకుమ భాగ్య' సీరియల్ ద్వారా ఆమె దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. హృతిక్ రోషన్‌తో నటించిన 'సూపర్ 30' సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత షాహిద్ కపూర్‌తో 'జెర్సీ' రీమేక్‌లో కూడా నటించింది. మృణాల్ ఠాకూర్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకప్పుడు తను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, కానీ అతను తనను వదిలి వెళ్ళిపోయాడని తెలిపింది.
'సూపర్ 30' సినిమా సమయంలో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి వెళ్లడం, పెద్ద స్టార్లతో నటించడం చూసి ఆమె ప్రియుడు తట్టుకోలేకపోయాడట. నటన పట్ల ఆమెకు ఉన్న అంకితభావం, సినీ రంగంలో ఆమె ఎదుగుదల చూసి ఆ వ్యక్తి అభద్రతాభావానికి లోనై విడిపోయాడని మృణాల్ ముచ్చటించింది. ప్రస్తుతం మృణాల్ సౌత్ మరియు నార్త్ సినిమాల్లో బిజీ హీరోయిన్గా సినిమాలు చేస్తోంది.
దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించిన 'సీతారామం' సినిమా మృణాల్‌ను తెలుగు ప్రేక్షకులకు 'సీత'గా దగ్గర చేసింది. ఈ సినిమా ఆమె కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. నానితో నటించిన 'హాయ్ నాన్న' మరియు విజయ్ దేవరకొండతో నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాలతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది మృణాల్ ఠాకూర్. రెడ్ కార్పెట్ ఈవెంట్స్ మరియు సోషల్ మీడియాలో ఆమె స్టైలిష్ లుక్స్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది మృణాల్.