పాన్ వరల్డ్ కింగ్…? 5000 కోట్లు దాటితేనే మొనగాడు..!

పాన్ ఇండియా ట్రెండ్ ని మనోళ్లు మొదలుపెట్టారు. పాన్ ఇండియా కింగులుగా, గ్లోబల్ స్టార్లు గా, మ్యాన్ ఆఫ్ మాసులు, ఐకాన్ స్టార్లు ఇలా మొత్తం పాన్ ఇండియాను తెలుగు హీరోలే కమ్మేశారు

Post Published By: dialnews
Updated : 3 February 2026, 7:11 PM IST

పాన్ ఇండియా ట్రెండ్ ని మనోళ్లు మొదలుపెట్టారు. పాన్ ఇండియా కింగులుగా, గ్లోబల్ స్టార్లు గా, మ్యాన్ ఆఫ్ మాసులు, ఐకాన్ స్టార్లు ఇలా మొత్తం పాన్ ఇండియాను తెలుగు హీరోలే కమ్మేశారు. కట్ చేస్తే పాన్ వరల్డ్ వీడుడెవరు? ఇండియా వేరు, మొత్తం వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవటం వేరు... అక్కడే మొదటి అడుగు ఎన్టీఆర్ వేస్తున్నాడు. డ్రాగన్ తో తను ముందు పాన్ వరల్డ్ మార్కెట్ మీద ఎటాక్ చేస్తుంటే, వెంటనే స్పిరిట్ తో గ్లోబల్ ఆడియన్స్ ముందుకొస్తున్నాడు రెబల్ స్టార్... తర్వాత సీన్ లోకి సూపర్ స్టార్ వస్తున్నాడు. వారణాసితో గ్లోబల్ సూపర్ స్టార్ అయ్యే ఆశ, ఆశయంతో సెట్లో సాహసాలు చేస్తున్నాడు. అంతా బానే ఉంది... కాని పాన్ వరల్డ్ మార్కెట్ లో వీరుడవ్వాలంటే ఏం చేయాలి? ఒక రెండు మూడు వేల కోట్ల వసూళ్లు రాబడితే సరిపోతుందా? డెఫినెట్ గా కాదు.. దానికో నెంబర్ ఉంది.. కనీసం 5 వేల కోట్ల వసూళ్లుకు రాజెవరో వాళ్లే, పాన్ వరల్డ్ స్టార్.. ఎందుకు ఆ నెంబర్ తోనే పాన్ వరల్డ్ కింగ్ ఫేట్ మారబోతోంది? ఆ సత్తా ముగ్గురికీ ఉన్నా, అందరినీ ఆ నెంబర్ ఎందుకు భయపెడుతోంది?

పాన్ ఇండియా స్టార్స్ అంటే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఇది టాలీవుడ్ నుంచి.. కోలీవుడ్ లో రజినీ ఎప్పటినుంచో పాన్ ఇండియా స్టారే .. కాని పాన్ ఇండియా హిట్లు లేవు.. కమళ్ మంచి నటుడే కాని గొప్ప మాస్ స్టార్ అనిపించుకోలేదు.. కన్నడ నుంచి యష్ ఒక్కడే పాన్ ఇండియా లెవల్లో రాఖీ భాయ్ గా దూసుకెళ్లాడు. బాలీవుడ్ లో ఖాన్లు, కపూర్లు ఉన్నా, యానిమల్ , పటాన్, జావన్, ధురందర్ హిట్టైనా అవి హిందీ కే పరిమితం... కాబట్టి బాలీవుడ్ లో ఇంకా పాన్ ఇండియా హీరో ఖాతనే తెరవలేదు..అలా చూస్తే ఇప్పుడు తెలుగు స్టార్లదే పాన్ ఇండియా ఇమేజ్... కాని పాన్ ఇండియా విషయంలో, తమిళ,మళయాళ, హిందీ హీరోలు ఇంకా దేశాన్ని ఊపేందుకు కసిగా ప్రయత్నిస్తుంటే, మనోళ్లు పాన్ వరల్డ్ బాటలో బిజీ అయ్యారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ పాన్ వరల్డ్ సినిమాగానే వస్తోంది. స్పిరిట్ ని కూడా పాన్ వరల్డ్ మూవీగానే రిలీజ్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ లానే పాన్ వరల్డ్ ట్రెండ్ ని మొదలు పెట్టాడు రాజమౌళి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో తను తీస్తున్న వారణాసి పాన్ వరల్డ్ మూవీగానే మొదలైంది. 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతోంది. కాని దీనికంటే ముందు జనవరి 10 కి డ్రాగన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మార్చ్ 5 కి రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ రాబోతోంది. ఏప్రిల్ 7న వారణాసి రావటం కన్పామ్ అయ్యింది.మూడు కూడా వరుసగా వచ్చే ఏడాది పాన్ వరల్డ్ మార్కెట్ మీద దాడి చేస్తున్నాయి.అయితే పాన్ ఇండియా ట్రెండ్ బాహుబలిలో మొదలైంది. కాబట్టి పాన్ ఇండియా స్టార్ గా ముందు రెబల్ స్టార్ ఫోకస్ అయ్యాడు. 5 పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ అయ్యాడు. 1850 కోట్ల నుంచి 1200 కోట్ల మధ్య తన సినిమాల వసూల్లు ట్రెండ్ సెట్ చేశాయి... తర్వాతే బన్నీ, ఎన్టీఆర్, చరణ్ , యష్ ఇలా పాన్ ఇండియా లెవల్లో దూసుకెళ్ళారు.

కాని ఇప్పుడు పాన్ వరల్డ్ ట్రెండ్ వచ్చే ఏడాది నుంచి మొదలు కాబోతోంది. అక్కడ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేయాలంటే, కేవలం, వెయ్యో రెండు వేల కోట్లో రాబడితే సరిపోదు.. ఇక్కడ 1000 కోట్లు రాబడితేనే, పాన్ ఇండియా షేక్ అయినట్టు... వరల్డ్ మార్కెట్ లో కనీసం 5 వేలకోట్లు రాబడితే తప్ప, వరల్డ్ మార్కెట్ మన హీరోలని పాన్ వరల్డ్ స్టార్స్ గా గుర్తించే ఛాన్స్ఉండదు.ఐతే వారణాసి మూవీ 10 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందనే అంచనాతో వస్తోంది.. స్పిరిట్ మూవీ కనీసం 3 వేల కోట్ల నుంచి 6 వేలకోట్లు రాబట్టే సత్త ఉన్న సినిమాఅనే అంటున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ ని తీస్తోంది ప్రశాంత్ నీల్ కాబట్టి, ఏమాత్రం వర్కవుట్ అయినా 2 వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల వసూళ్లకు ఛాన్స్ఉంది. సో ఈ మూడు సినిమాలకు, ఆ ముగ్గురు హీరోలకు పాన్ వరల్డ్ కింగ్స్ అనిపించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి.. కాని ముందు డ్రాగన్ వస్తోంది, తర్వాత స్పిరిట్ వస్తోంది, ఆ తర్వాతే వారణాసి రాబోతోంది. కాబట్టి ఎన్టీఆర్ కే పాన్ వరల్డ్ కింగ్ అనిపించుకునే ఛాన్స్ ముందుగా వస్తోంది.. మరి ఈ అంచనాలే నిజమౌతాయా? ఎన్టీఆర్ కే ఆ కిరీటం దక్కుతుందా? తేలాలంటే కనీసం ఏడాది తర్వాతే తేలుతుంది..అప్పుడే ఎవరికా కిరీటం దక్కుతుందో తేలుతుంది.

Published : 
  • 3 February 2026, 7:11 PM IST