సోషల్ మీడియాను ఊపేస్తున్న బాండింగ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్లు ఉండవచ్చు. రోజుకో కొత్త రికార్డు నమోదు కావచ్చు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో "టాప్ 2 హీరోలు ఎవరు?" లేదా "బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు?" అనే చర్చ మొదలైతే మాత్రం

Post Published By: dialnews
Updated : 12 August 2026, 12:46 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పాన్ ఇండియా స్టార్లు ఉండవచ్చు. రోజుకో కొత్త రికార్డు నమోదు కావచ్చు. కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో "టాప్ 2 హీరోలు ఎవరు?" లేదా "బిగ్గెస్ట్ స్టార్స్ ఎవరు?" అనే చర్చ మొదలైతే మాత్రం.. ముందుగా గుర్తుకువచ్చే పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.ఈ ఇద్దరు అగ్ర హీరోల సినిమా మార్కెట్, బాక్సాఫీస్ రికార్డులు, ఓపెనింగ్స్, సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరి బాక్సాఫీస్ స్టామినా దేనికదే సాటి. కొన్నేళ్ల వెనక్కి వెళ్తే సోషల్ మీడియా అంతా వీరిద్దరి అభిమానుల హవానే నడిచేది.
ఆన్‌లైన్‌లో ఫ్యాన్ వార్స్ ఎంత గట్టిగా నడిచినా, అభిమానుల మధ్య ఎంత పోటీ ఉన్నా.. ఒక విషయం మాత్రం నిజం! పవన్, మహేష్ ఫ్యాన్స్ ఏనాడూ బద్ధ శత్రువులు కారు.

లోలోపల ఒకరిపై ఒకరికి ఎంతో గౌరవం, అభిమానం ఉంటాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఒకే వేదికపై కనిపిస్తే లేదా ఒకరి గురించి ఒకరు పాజిటివ్‌గా మాట్లాడితే వచ్చే ఆనందమే వేరు! ఆ క్షణాలు ఇటు ఘట్టమనేని అభిమానులకు, అటు మెగా అభిమానులకు వర్ణించలేని అనుభూతిని ఇస్తాయి. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం సోషల్ మీడియా వేదికగా జరిగింది. ప్రస్తుతం మహేష్ బాబు ఇచ్చిన ఒకే ఒక్క రిప్లై నెట్టింట హల్‌చల్ చేస్తోంది, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది! ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన బర్త్‌డే విషెస్‌కు మహేష్ బాబు స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
మహేష్ బాబు ఇచ్చే రిప్లైల కోసం అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అయితే, పవన్ కళ్యాణ్‌కు మహేష్ బాబు ఇచ్చిన రిప్లై మాత్రం చాలా స్పెషల్‌గా నిలిచింది. మహేష్ తన ట్వీట్‌లో "మోర్ పవర్ టు యు" అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను 'పవర్ స్టార్' అని పిలుస్తారు. దానికి తగ్గట్టుగానే "మోర్ పవర్ టూ యు" అని మహేష్ బాబు విష్ చేయడం ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా, రాజకీయ నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు "మీకు మరింత పవర్ దక్కాలి" అని అనడం గమనించదగ్గ విషయం.పవన్ కళ్యాణ్ - మహేష్ బాబుల మధ్య ఉన్న ఈ సోదరభావం కేవలం ఒక పోస్ట్‌కే పరిమితం కాదు. ఇద్దరు అగ్ర కథానాయకులు ఒకరికొకరు ఇచ్చుకునే ఈ గౌరవం, మిగతా హీరోల అభిమానులకు కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. ఇండస్ట్రీలో పోటీ ఎంత ఉన్నా, మైత్రి అంతకంటే గొప్పదని మరోసారి నిరూపితమైంది.మహేష్ బాబు "మోర్ పవర్ టు యు" అని పవన్ కళ్యాణ్‌కు చెప్పిన ఈ లైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలవడం విశేషం.

Published : 
  • 12 August 2026, 12:46 PM IST