Prabhas : దర్శకులకి ప్రభాస్ భారీ విరాళం

దర్శకుడు.. సినిమాకి కెప్టెన్.. 24 క్రాఫ్ట్స్ మీద తనదైన ముద్ర వేసే ఎవరెస్ట్ శిఖరం..ఎంతో మంది నటుల్ని అగ్ర హీరోలుగా, హీరోయిన్లుగా మార్చిన శిల్పి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 23 April 2024, 4:00 PM IST

 

 

దర్శకుడు.. సినిమాకి కెప్టెన్.. 24 క్రాఫ్ట్స్ మీద తనదైన ముద్ర వేసే ఎవరెస్ట్ శిఖరం..ఎంతో మంది నటుల్ని అగ్ర హీరోలుగా, హీరోయిన్లుగా మార్చిన శిల్పి. ప్రేక్షకులకి నచ్చేలా సినిమా తెరకెక్కించే శిరోమణి (Shiromani). అలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ (Prabhas) చేసిన సాయం ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

తెలుగు దర్శకుల సంక్షేమ సంఘానికి నిధుల్ని సమకూర్చుకునే లక్ష్యంగా డైరెక్టర్స్ అసోసియేషన్ కృషి చేస్తుంది. ఇప్పుడు ఆ సంఘానికి ప్రభాస్ 35 లక్షల రూపాయిల విరాళాన్ని ప్రకటించాడు. ఇటీవల జరిగిన డైరెక్టర్స్ డే కర్టన్ రైజ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ విషయాన్నీ వెల్లడి చేసాడు. ప్రస్తుతం వారిద్దరు కలిసి రాజా సాబ్ అనే మూవీని చేస్తున్నారు. ప్రభాస్ అంత పెద్ద మొత్తం విరాళం ఇవ్వడం పట్ల దర్శక సంఘ సభ్యులు ప్రభాస్ కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అదే విధంగా దర్శకుల సంఘానికి అంత పెద్ద మొత్తంలో విరాళం రావడం ఇదే ప్రప్రధమం.

డైరెక్టర్స్ డే ఫంక్షన్ ప్రతి సంవత్సరం లాగానే మే 5 న చాలా ఘనంగా జరగనుంది. ప్రభాస్ తో పాటు చిరంజీవి, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్ (Kalyan Ram) తదితరులు ఆ ఈవెంట్ కి హాజరు కానున్నారు. మరి వాళ్ళు కూడా ప్రభాస్ బాటలో డైరెక్టర్ అసోసియేషన్ కి విరాళాలు ప్రకటిస్తారేమో చూడాలి. ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీ కల్కి 2898 ఏడి మే 9 న విడుదల కాబోతుంది. ఇటీవల అమితాబ్ టీజర్ వచ్చి సినిమాపై అంచనాలని రెట్టింపు చేసింది. ఇప్పుడు ప్రభాస్ టీజర్ కోసం వరల్డ్ మొత్తం వెయిటింగ్.

Published : 
  • 23 April 2024, 4:00 PM IST