బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సంచలన కథలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి సినిమా కోసం పని చేస్తున్న ఈ సీనియర్ రైటర్, రాజ్యసభ ఎంపీ.. తన పూర్వీకుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మాది చాలా సంపన్న కుటుంబం.. తనకు తెలిసి ఏ తప్పూ చేయలేదన్నారు.
తమ పూర్వీకులు అనేక దారుణాలకు పాల్పడ్డారు.. నోటితో చెప్పలేనన్ని భయంకర ఘోరాలు చేశారని, అవి తలుచుకుంటే సిగ్గుతో కుంగిపోతున్నా అన్నారు. నావి కూడా అవే జీన్స్, వారి ఆస్తులే నేను అనుభవిస్తున్నా కాబట్టి, ఆ పాపాల్లో నేను కూడా భాగస్వామినేనని.. మా పూర్వీకుల తరఫున క్షమాపణలు చెబుతున్నా అంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనం అయ్యాయి.