పదేళ్ళకే కందిపోయింది.. అందుకే…!

నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ, పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా కొనసాగిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రకుల్,

Post Published By: dialnews
Updated : 25 April 2026, 8:50 PM IST

నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఈ బ్యూటీ, పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్డ్‌గా కొనసాగిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన రకుల్, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులు, మోడలింగ్ రంగంలోకి ఎలా వచ్చింది, అసలు నటిగా ఎలా మారింది అనే విషయాలను పంచుకున్నారు. రకుల్‌కు చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మిస్ ఇండియా ఈవెంట్లను ఆమె ఎంతో ఆసక్తిగా చూసేవారు. 1994లో ఐశ్వర్యా రాయ్ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నప్పుడు, రకుల్ ఆమెను చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యారు.

తను కూడా భవిష్యత్తులో అలానే ఉండాలని బలంగా నిర్ణయించుకున్నారు. అయితే, ఇంట్లో ఈ విషయం చెబితే.. "ముందు చదువు పూర్తి చేయి, 18 ఏళ్లు వచ్చాక నీ ఇష్టం" అని కండిషన్ పెట్టారు ఆమె తల్లిదండ్రులు. వారి మాట ప్రకారం, రకుల్ తన 18వ ఏట ఢిల్లీలో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే రకుల్‌కు ఒక కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పటికి ఆమెకు సౌత్ సినిమాలపై కనీస అవగాహన కూడా లేదు. తను ఆర్మీ కుటుంబం నుంచి రావడం వల్ల ప్రాంతీయ చిత్రాల గురించి పెద్దగా తెలియదని, అందుకే కేవలం హిందీ సినిమాలే చేస్తానని మొదట్లో చెప్పారట.

కానీ, ఆ తర్వాత నిర్మాతలు ఆమె తండ్రితో మాట్లాడారు. ఆమె జాతకం చూసి, ఖచ్చితంగా పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని నమ్మబలికారు. అప్పటి వరకు నెలకు కొంత జీతంతో బతికే తమ కుటుంబానికి, ఈ సినిమా ద్వారా లక్షల్లో పారితోషికం వస్తుందని తెలియగానే రకుల్‌లో ఆశ కలిగింది. ఆ డబ్బుతో ఒక కారు కొనుక్కోవచ్చని ఆమె భావించారు. అయితే, నటిగా మారినా చదువును మాత్రం మధ్యలో ఆపకూడదని నిర్ణయించుకుని, డిగ్రీ పూర్తయ్యాకే ముంబైకి పయనమయ్యారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. రకుల్ ఒక ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారిణి. తన 10వ ఏట నుంచే ఆమె గోల్ఫ్ ఆడటం మొదలుపెట్టారు.

జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లో కూడా పాల్గొన్నారు. కానీ, ఆమె కల మాత్రం మోడల్ లేదా నటి అవ్వాలనేది. ఎండలో నిలబడి గోల్ఫ్ ఆడటం వల్ల ఆమె శరీర రంగు మారడం మొదలైందట. కెమెరా ముందు అందంగా కనిపించాలంటే ఇది ఇబ్బందిగా మారుతుందని భావించి, ప్రొఫెషనల్ గోల్ఫ్‌కు స్వస్తి చెప్పారు. అయినప్పటికీ, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా సరదాగా గోల్ఫ్ ఆడుతూనే ఉంటారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ హిందీ చిత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమె నటించిన 'పతి పత్నీ ఔర్ వో 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక మధ్యతరగతి ఆర్మీ ఫ్యామిలీ నుంచి వచ్చి, తన కలలను నిజం చేసుకుంటూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రకుల్, సినిమాల్లోకి రావాలనుకునే నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకు ఎంతో ఇన్స్పిరేషన్.

Published : 
  • 25 April 2026, 8:50 PM IST