సౌత్ ఇండియన్ క్వీన్ సమంత రుత్ ప్రభు మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన హవా చూపించడానికి సిద్ధమయ్యింది. మొన్నటివరకు అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో కాస్త గ్యాప్ తీసుకున్న సామ్, ఇప్పుడు తన హోమ్ బ్యానర్‌లో 'మా ఇంటి బంగారం' సినిమాతో రాబోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్ మరియు ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను సమంత తన స్వంత బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' పై నిర్మిస్తున్నారు. సమంత ఈ సినిమాలో ఒక మధ్యతరగతి గృహిణిగా కనిపిస్తూనే, సీక్రెట్ ఏజెంట్ తరహా యాక్షన్ రోల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమ్మర్ కానుకగా మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ మూవీ విడుదల కాబోతోంది.'మా ఇంటి బంగారం' సినిమాకు రాజ్ నిడిమోరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా ఉన్నాడు. తాజాగా సమంత ఇన్ స్టాగ్రామ్‌లో నిర్వహించిన 'Ask Me Anything' సెషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ట్రోల్స్ మరియు నెగెటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ.. "ప్రశంసలు నన్ను పొంగిపోయేలా చేయవు, విమర్శలు నన్ను కుంగదీయలేవు. ఎవరైనా నా స్పేస్‌లోకి నెగెటివిటీని తీసుకొస్తే వెంటనే బ్లాక్ చేస్తాను" అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. తన ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ.. "ఆరోగ్యం బాగున్నప్పుడే మనకు వంద సమస్యలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే దృష్టంతా దానిపైనే ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రశాంతంగా ఉన్నాను" అని స్పష్టం చేసింది సమంత.