రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందనల పెళ్లి తర్వాత వస్తున్న ఫస్ట్ క్రేజీ అప్డేట్ రణబాలి మూవీ నుంచే. ఫిబ్రవరి 26న వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త జంటకి 'రణబాలి' టీమ్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని మొదటి పాట 'ఎందయ్య సామి' పాటను విడుదల చేసిన రణబాలి టీమ్, గీత గోవిందం కెమిస్ట్రీని రిపీట్ చేసినట్టు అనిపించింది.
అజయ్-అతుల్ అందించిన ఈ మెలోడీ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది కేవలం తెలుగులోనే కాదు, ఐదు భాషల్లో విడుదలై పాన్ ఇండియా వైబ్‌ని క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ కథ 19వ శతాబ్దంలో 1854 - 1878 మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో సాగుతుంది.
విజయ్ ఇందులో 'రణబాలి' అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, రష్మిక 'జయమ్మ'గా అలరించబోతోంది. చరిత్రలో అణచివేయబడిన వాస్తవాలను, మన గడ్డపై జరిగిన గొప్ప పోరాటాన్ని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో మరో బిగ్ సర్ప్రైజ్ ఏమిటంటే... హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ. ఆయన ఇందులో 'సర్ థియోడర్ హెక్టార్' అనే పవర్‌ఫుల్ బ్రిటిష్ ఆఫీసర్‌గా నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 11, 2026న 'రణబాలి' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విజయ్ మరియు రష్మిక రియల్ లైఫ్ కపుల్ అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.