విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి అనగానే ఫ్యాన్స్ లో ఓ తెలియని క్రేజ్. 8 ఏళ్ళ నుంచి వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియాలో హడావుడి జరుగుతూనే ఉంది. రేపు ఈ ఇద్దరూ ఉదయపూర్ లో వివాహం చేసుకోనున్న నేపధ్యంలో, పెళ్ళికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్ నుండి 25 కి.మీ దూరంలో ఉన్న ఐటీసీ మెమెంటోస్ లో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే పెళ్లి వేడుకలు కూడా ప్రారంభం అయ్యాయి. పూల్ వాలీబాల్ సహా అనేక కార్యక్రమాలను ప్లాన్ చేసింది ఈ జంట. దాదాపు వంద నుంచి 120 మంది ఈ పెళ్ళికి వెళ్ళే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. మరి వెళ్ళిన వాళ్లకు వడ్డించే ఫుడ్ ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. మూడు రోజులు జరిగే పెళ్లి వేడుకలో.. ఇంటర్నేషనల్ నుంచి లోకల్ వరకు ఫుడ్ ఐటమ్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ రోజు.. జపనీస్ ఫుడ్ ను సెర్వ్ చేసినట్టు టాక్. దీని కోసం ప్రత్యేకంగా జపాన్ నుంచి చెఫ్ లను పిలిపించారు.
మెనూ సీక్రెట్ గా ఉంచినా సరే.. మెనూలో ఎలా ఉంటుందో ఓ ఐడియా వచ్చింది. విందు భోజనాలు.. పెళ్లి రోజు మాత్రం దక్షిణ భారత సంస్కృతి ఉట్టిపడేలా ప్లాన్ చేసారు. అందుకే అరటి ఆకులపై భోజనం వడ్డిస్తున్నారు. అలాగే కొబ్బరి నీళ్ళు, అరటి పళ్ళు కూడా ఏర్పాటు చేసారు. అరటి ఆకులలో ఎటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి వాటిలో భోజనం చేయడం మంచిది. అలాగే కర్ణాటక, తెలంగాణాకు చెందిన ప్రముఖ వంటలు కొన్ని కూడా విందులో వడ్డించే ఛాన్స్ ఉంది.