డ్రాగన్ మూవీలో ఎందుకు నటించట్లేదో టొవినో థామస్ చెప్పాడు. అది గౌరవ ప్రదంగానే ఉంది.. కాని 15 కోట్ల రెమ్యునరేషన్ విషయంలో మరో మళయాల నటుడు చేస్తున్న పని, టాలీవుడ్ పరువు తీస్తోందా? డ్రాగన్ విషయంలో తను కూడా కొంతవరకు టంగ్ స్లిప్ అయ్యాడా? రీసెంట్ గా ఒక హీరోయిన్ మన తెలుగు సినిమాల మీద వేసిన సెటైర్, కరెక్ట్ గా డ్రాగన్ మీద జరుగుతున్న యాంటీ ఫ్యాన్స్ దాడికి ప్లస్ అవుతోందా? ఇవి డౌట్లు కాదు... తెలుగు సినిమా ఫేట్ ని డౌట్ లో పడేలా చేస్తున్న కొన్ని దండయాత్రలు... కావాలని చేస్తున్నారా? కొవ్వెక్కి కామెంట్లు పెంచారా? డిటేల్స్ కి పోతే మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. వారణాసికి మాత్రం ఇలాంటి అడ్డంకులేవి కనిపించట్లేదు. అసలు డ్రాగన్ మొదలైనప్పటి నుంచి వెన్నుపోటులే కాదు, ఇలాంటి కామెంట్లతో బందిపోటుల దాడి కూడా ఎక్కవే అయ్యింది? ఎందుకు? అసలు మల్లూవుడ్ తో ఎందుకు టాలీవుడ్ సింక్ అవ్వట్లేదు... ? ఇది కొందరి బలుపా? లేదంటే రియాలిటీనా ఇలా ఉందా? అన్న క్వశ్చన్ మార్క్ వెనకున్న చేదు నిజమేంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ లో నటించట్లేదన్నాడు మలయాల స్టార్ టొవినో థామస్. అదేం తప్పుకాదు.. ముందుగా డేట్లిచ్చినా... కథలో మార్పులు, షూటింగ్ షెడ్యూల్స్ లెంథీగా ఉండటంతో, టొవినో థామస్ ముందే కమిటైన సినిమాలు, వాటిని నమ్ముకున్న దర్శక నిర్మాతలు కష్టాల్లో పడేలా ఉన్నారు.. అందుకే డ్రాగన్ లో నటించలేకపోతున్నా అన్నాడు..ఇందులో ఎక్కడా తప్పులేదు..కాని మలయాళం సినిమా మేకింగ్ కల్చర్ వేరుగా ఉంటుంది.. ఒకే షెడ్యూల్ లో అక్కడ షూటింగ్ పూర్తవుతుంది.. ఇక్కడ చాలా షెడ్యూల్స్ అంటే, ఓరకంగా ఏళ్లకేళ్లు ఒకే సినిమా తీస్తారు. ఈలోపు అక్కడ మేం మూడు నాలుగు ముగించేస్తాం అన్నాడు.. అక్కడే చాలా మంది ఫైర్ అవుతున్నారు. షార్ట్ పిల్మ్ కి, వెబ్ సీరీస్ కి, సినిమాకి ఎలాంటి తేడా ఉందో... కంటెంట్ డ్రివెన్ మూవీకి, లార్జర్ దేన్ లైఫ్ అనిపించే భారీస్కేల్ మూవీల మేకింగ్ కి అంతే తేడా ఉంటుంది.
అది తెలిసి కూడా ఈ కామెంట్ చేయటం ఒకరకంగా అటాకే... కాకపోతే తను కాస్త డీసెంట్ గా అటాక్ చేశాడు.. కాని మరో మళయాల స్టార్ ఫాహద్ ఫాజిల్ మాత్రం మాస్ ఎటాక్ చేస్తున్నాడనంటున్నారు. గతంతో పుష్ప లోనటించిన తను, అసలు అందులో ఎందుకు నటించానో అన్నాడనే వార్తవైరలైంది. తర్వాత ఆమూవీలోనటించినంత మాత్రాన తన ఇమేజ్ లో ఎలాంటి మార్పు రాలేదనే అన్నట్టు తను చెప్పినట్టు, మరో కవరింగ్ వార్త వినిపించింది.కట్ చేస్తే ఇప్పుడు తమిల్,మలయాల మూవీల్లో మెరిసిన కయాదు లోహా ఇలాంటి కామెంటే చేసింది. అదేంటంటే తను తెలుగులో ఏ ప్రయోగం చేసినా కలిసి రావట్లేదన్న ప్రశ్నకు, అసలు ఫెల్యూర్ గురించి ఆలోచించేతీరికెక్కడిది... తమిల్ మూవీలతో ఫుల్ బిజీ అనేసింది. ఓరకంగా అసలు టాలీవుడ్ అంటే లెక్కేలేదన్నట్టు మాట్లాడేసింది..
ఫాహద్ ఫాజిల్ ని రీసెంట్ గా ఒక మూవీలో పాత్రకోసం అడిగితే 15 కోట్లు డిమాండ్ చేశాడన్న వార్త షాకిస్తోంది.. మలయాళం లో 5 కోట్లకు మించి తీసుకోని తను, తెలుగు సినిమా నథింగ్ అంటూనే, రెమ్యునరేషన్ 15 కోట్లు డిమాండ్ చేశాడట.. అది కూడా డ్రాగన్ మూవీ కోసం అడిగితేనే అంటున్నారు. 670 కోట్ల బడ్జెట్ మూవీకి 15 కోట్లు లెక్కకాదు.. కాని 5 రోజుల షెడ్యూల్ కి 15 కోట్లంటే, రోజుకి 3 కోట్లు.. ఇది టూమచ్.. ఏదేమైనా పాన్ ఇండియా లెవల్లో తెలుగు సినిమా దుమ్ముదులుపుతుంటే, తమిల్,మలయాళ స్టార్స్ మాత్రం మన మూవీల మీద పడి ఏడుస్తున్నారనే కామెంట్లు పెరిగాయి.
అసలు మాయల స్టార్స్ లేకపోతే తెలుగు దర్శక నిర్మాతలకు తెలుగు సినిమా తీయటం కష్టమా? ఏదో మలయాల మార్కెట్ కోసమే తప్ప, వాల్లు లేకపోతే ఏదో జరగదన్నట్టు ఇక్కడి ఫిల్మ్ మేకర్స్ ప్రవర్తిస్తున్నారా? కారణమేదైనా, వారణాసిలో ఫ్రుత్విరాజ్ నటిస్తున్నాడు. ఆల్రెడీ సలార్ లో నటించాడు. మరి ఆ మలయాళ స్టార్ కి ఎందుకు మిగతా మలయాళీలు చెప్పిన కారణాలు, ఇబ్బందులు వర్తించవు.. ఇదే ఆలోచనల్లో పడేస్తోంది.