Manifesto of National Congress Party released
దేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎవరికివారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇక జాతీయ పార్టీలు సైతం ప్రత్యర్థులపై తమ వ్యూహాలతో ఎన్నికల సమరం శంఖం పురిస్తుంది. తాజాగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోను జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఏఐసీసీ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో విడుదలైంది.
ఇక ఈ ఎన్నికల మేనిఫెస్టోను న్యాయ్‌పత్ర-2024 పేరుతో కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 48 పేజీలతో.. 5 న్యాయ పథకాలతో.. 25 హామీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో
విడుదల చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టో :
దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తో హాస్పిటల్ ఏర్పాటు.
యూనివర్సిటీలో వివక్షకు గురవుతున్న విద్యార్థులకు న్యాయం చేసేందుకు రోహిత్ వేముల ఆక్ట్ అమలు చేస్తాం. వెనకబడిన పేద మహిళలకు ఏడాదికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం.. బ్యాంకు అకౌంట్‌లో వెస్తాము. ప్రభుత్వ ఉద్యోగాలలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తాం. దేశవ్యాప్తంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు, కస్తూర్బా గాంధీ పాఠశాల పాఠశాలల సంఖ్య పెంచుతాం.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జుణ ఖర్గే..
రాహుల్ గాంధీ...