వాటర్ బాటిల్ తో పవన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా పరిధిలోని కొన్ని సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకు వెళ్ళారు. కంకిపాడు-రొయ్యూరు వయా గొడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులకు సభలోనే పవన్ ఆదేశాలు ఇచ్చారు.

Post Published By: Vencateshg
Updated : 14 October 2024, 1:12 PM IST

కృష్ణా జిల్లా పరిధిలోని కొన్ని సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకు వెళ్ళారు. కంకిపాడు-రొయ్యూరు వయా గొడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులకు సభలోనే పవన్ ఆదేశాలు ఇచ్చారు. నిదురుమొండి నుంచీ బ్రహ్మయ్యగారి మూలం, నాగాయలంక వరకూ గ్రామాల ప్రజలు వరద బారిన పడ్డారని కలెక్టర్ తెలిపిన ప్రకారం రోడ్లు వేయాలని పంచాయతిరాజ్ అధికారులకు సభలోనే పవన్ ఆదేశించారు.

గుడివాడ లో సరైన త్రాగు నీరు లేదంటూ సాంపిల్ వాటర్ బాటిల్ ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీసుకు వెళ్ళారు. దీనిపై వెంటనే స్పందించిన పవన్ త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక ఇదే సభలో పవన్ కళ్యాణ్ ను సినిమాల గురించి ఆడగగా పవన్ స్పందించలేదు.

Published : 
  • 14 October 2024, 1:12 PM IST