LK Advani : బీజేపీ నేత ఎల్ కే అద్వానీకి భారతరత్న..

మోడీ సర్కార్‌ (Modi Sarkar) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్‌ కే అద్వానీ(LK Advani)కి భారత రత్న ప్రకటించింది కేంద్ర సర్కార్‌.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 February 2024, 12:30 PM IST

మోడీ సర్కార్‌ (Modi Sarkar) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్‌ కే అద్వానీ(LK Advani)కి భారత రత్న ప్రకటించింది కేంద్ర సర్కార్‌. ఈ మేరకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్‌ మీడియా వేదికగా తన ట్విటర్ అకౌంట్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోడీ అద్వానీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా... గతంలో ఎల్ కే అద్వానీ ఉప ప్రధాని(Deputy Prime Minister) గా పని చేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఆయన పని చేశారు. ఇక గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎల్ కే అద్వానీకి భారత ప్రభుత్వం తాజాగా భారత రత్న (Bharat Ratnam) ప్రకటించారు.

 

 

Published : 
  • 3 February 2024, 12:30 PM IST