Top story: 5 మంత్రులు అవుట్ జనసేనకు మరో మంత్రి పదవి..త్వరలో AP క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ..!

చాన్నాలుగా ఎదురుచూస్తున్న ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తికాగానే రాష్ట్ర క్యాబినెట్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

Post Published By: dialnews
Updated : 16 September 2026, 3:30 PM IST

చాన్నాలుగా ఎదురుచూస్తున్న ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తికాగానే రాష్ట్ర క్యాబినెట్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న తరుణంలో స్థానిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని విస్తరణ ఉండబోతోంది. ఏపీ మంత్రివర్గంలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వివాదాల్లో చిక్కుకున్న ఒకరిద్దరు మంత్రులకు గుడ్ బై చెప్పబోతున్నారు. అలాగే పనితీరు ఆధారంగా కూడా మరో ఇద్దరిని తొలగించబోతున్నారు.

ఏపీ క్యాబినెట్లో జనసేనకు మరో మంత్రి పదవి దక్కబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జనసేనకు మరో మంత్రి పదవి ఇచ్చి, కాపుల ఓట్లు దూరం కాకుండా కూటమికి పడేటట్లుగా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 19న గవర్నర్ ని కలిసి లాంచినప్రాయంగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు.

కేంద్ర క్యాబినెట్ లో మార్పులు చేర్పులను అనుసరించి రాష్ట్ర క్యాబినెట్ లో కూడా మార్పులు చేయబోతున్నారు. చివరి నిమిషంలో ఏమైనా ఒకటి రెండు మార్పులు ఉండవచ్చు. అలాగే కొందరికి శాఖల మార్పులు కూడా ఉంటాయి. ఒకటి రెండు రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీకానున్నారు. ఈ సమావేశంలోక్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో
సీట్ల పంపకాలు, ప్రాంతాలవారీగా వ్యూహాలు ఖరారు చేసే అవకాశం ఉంది.

Published : 
  • 16 September 2026, 3:30 PM IST