ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన భద్రత గల దేశం.. ఇజ్రాయెల్. గాలిలో ఈగ కూడా వాలకుండా చూసే గూఢచారి సంస్థ.. మొస్సాద్. కానీ అలాంటి కోటలోనే ఇరాన్ చిచ్చు పెట్టిందని మీకు తెలుసా..? ఇజ్రాయెల్ గుండెల్లోకి చొరబడి, సైనికులను తమ ఏజెంట్లుగా మార్చుకుని.. అణు రహస్యాలను టెహ్రాన్ కు తరలించిన ఇరాన్ సాహస గాథ ఇది. అమెరికా అండ ఉన్నా, ఇజ్రాయెల్ గడ్డపై ఇరాన్ ఎలా పాగా వేసింది? దశాబ్దాల పగను ఇరాన్ ఎలా తీర్చుకుంటోంది..? ఇది కేవలం గూఢచర్యం కాదు.. అగ్రరాజ్యం గర్వాన్ని అణిచివేసిన ఇరాన్ మైండ్ గేమ్.2024 అక్టోబర్, 2025 జనవరి మధ్య ఇజ్రాయెల్ ను ఒక వార్త వణికించింది. ఇజ్రాయెల్ పౌరులే ఇరాన్ కోసం పనిచేస్తూ పట్టుబడ్డారు. టెలిగ్రామ్ వంటి యాప్స్ ద్వారా ఇరాన్ గూఢచారి సంస్థ ఇజ్రాయెల్ లోని యువతను, మాజీ సైనికులను ఆకర్షించింది. 'హైఫా సెల్' అని పిలిచే ఒక ఏడుగురు సభ్యుల బృందం ఏకంగా 600 గూఢచారి మిషన్లను పూర్తి చేసింది. అసలు ఈ మిషన్ ఏంటి..? ఇజ్రాయెల్ లోని కీలకమైన నేవాటిమ్ ఎయిర్ బేస్, ఐరన్ డోమ్ లొకేషన్ల ఫోటోలను తీసి ఇరాన్ కు పంపడం. కేవలం కొన్ని డాలర్ల కోసం కాదు.. ఇజ్రాయెల్ వ్యవస్థపై ఉన్న అసంతృప్తిని ఇరాన్ వాడుకుంది.
ఇజ్రాయెల్ గతంలో ఇరాన్ అణు పత్రాలను దొంగిలించింది. కానీ 2025 జూన్ లో ఇరాన్ ఒక 'రివర్స్ స్లాప్' ఇచ్చింది. ఇజ్రాయెల్ లోని సీక్రెట్ ల్యాబ్స్ మరియు అణు కేంద్రాలకు సంబంధించిన వేలకొద్దీ పత్రాలను తమ ఏజెంట్లు సేకరించారని ఇరాన్ ఇంటెలిజెన్స్ ప్రకటించింది. ఎలా సాధ్యం..? ఇది కేవలం హ్యాకింగ్ కాదు.. ఇజ్రాయెల్ అణు శాస్త్రవేత్తల దగ్గరికే ఇరాన్ ఏజెంట్లు వెళ్ళగలిగారు. ఇజ్రాయెల్ తన కోటను ఎంత పటిష్టంగా నిర్మించుకున్నా.. ఇరాన్ ఏజెంట్లు అందులో ఒక చిన్న రంధ్రం చేసి రహస్యాలను లాగేశారు.అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా..? ఇజ్రాయెల్ ఆర్మీలోని సైనికులే ఇరాన్ కు కోవర్టులుగా మారడం. ఈ నెలలో నలుగురు యాక్టివ్ ఇజ్రాయెల్ సైనికులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ సైనిక వ్యూహాలను వీరు ఇరాన్ కు లీక్ చేశారని ఆరోపణ. రజ్ కోహెన్ వంటి రిజర్విస్ట్ సైనికులు ఐరన్ డోమ్ మిస్సైల్స్ ఎలా పనిచేస్తాయో, ఎక్కడ ఉంటాయో పూర్తి డేటాను ఇరాన్ కు అమ్మేశారు. అంటే, ఇజ్రాయెల్ రక్షణ కవచంపై దాడి చేయడానికి కావాల్సిన రిమోట్ కంట్రోల్ ను ఇరాన్ సంపాదించింది.
రీసెంట్ గా జరిగిన కొన్ని మిస్సైల్ అటాక్స్ ఇరాన్ పక్కా ప్లానింగ్ తో చేసింది. హైఫా, టెల్ అవీవ్, డిమోనా వంటి నగరాల్లో పడిన మిస్సైల్స్ ను ఇలాగే పక్కాగా ప్రయోగించడంలో ఇరాన్.. ఏజెంట్ లు కీలక పాత్ర పోషించారు. 2025లో ఇజ్రాయెల్ లోని ఇరాన్ గూఢచారి ప్రయత్నాలు 400% పెరిగాయి. గతంలో కేవలం క్రిమినల్స్ ని వాడుకునే ఇరాన్, ఇప్పుడు సామాన్య ఇజ్రాయెల్ విద్యార్థులు, గృహిణులు, వ్యాపారవేత్తలను రిక్రూట్ చేసుకుంటోంది. టెలిగ్రామ్ ద్వారా 'హ్యాండ్లర్స్' పరిచయమై, చిన్న చిన్న పనులకు వేల డాలర్లు చెల్లించి వారిని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు.అమెరికా.. ఇజ్రాయిల్ కు ఆయుధాలు ఇస్తుంటే, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ ఇంటి లోపలికే చొరబడి చిచ్చు పెడుతోంది. 2025 జూన్ లో ఇరాన్ ఒక సంచలన డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో ఇజ్రాయెల్ కి సంబంధించిన అత్యంత రహస్య అణు పత్రాలు, వీడియోలు, ఫోటోలను తాము సేకరించామని క్లెయిమ్ చేసింది. ఇజ్రాయెల్ లోపల నుండే ఈ ఆపరేషన్ జరిగిందని, అమెరికా, యూరోప్ దేశాలతో ఇజ్రాయెల్ కు ఉన్న రహస్య ఒప్పందాల కాపీలు కూడా ఇరాన్ చేతికి చిక్కాయని సమాచారం. ఇజ్రాయెల్ కోటను బద్ధలు కొట్టి, ఏకంగా అణు రహస్యాలనే టెహ్రాన్ కు చేరవేసిన ఈ 'బిగ్ రాబరీ' ఇజ్రాయెల్ కు కోలుకోలేని దెబ్బ.
2024 అక్టోబర్ లో ఇజ్రాయెల్ లో పట్టుబడ్డ ఒక ఏడుగురు సభ్యుల బృందం ఏకంగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మరియు ఒక నగర మేయర్ ను చంపడానికి ప్లాన్ చేసినట్లు బయటపడింది. వీరికి దాదాపు 53,000 డాలర్లు క్రిప్టోకరెన్సీ రూపంలో అందాయి. అమెరికా పహారా కాస్తున్నా, ఇజ్రాయెల్ గడ్డపై నేరుగా దాడులకు తెగబడే స్థాయికి ఇరాన్ వెళ్ళింది. ఇరాన్ కు చెందిన 'సైబర్ ఫత్తా', 'సైబర్ ఎవెంజర్స్' వంటి హ్యాకింగ్ గ్రూపులు ఇజ్రాయెల్ విద్యుత్ వ్యవస్థలు, ఐరన్ డోమ్ రాడార్ డేటాను సేకరించాయని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.టెక్నాలజీలో తామే మేటి అనుకునే ఇజ్రాయెల్ కు, ఇరాన్ హ్యాకర్లు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇది గాలిలో జరిగే యుద్ధం కాదు, కేవలం కొన్ని 'కోడింగ్' లైన్లతో ఇజ్రాయెల్ ని అంధకారంలోకి నెట్టే ప్లాన్ ఇది. ఇప్పుడు చెప్పండి.. మొస్సాద్ కంటే ఇరాన్ ఇంటెలిజెన్స్ తక్కువదా..? ఇస్లామాబాద్ లో చర్చల పేరుతో పిలిచి ఇరాన్ నాయకులను చంపాలని చూసిన అమెరికాకు.. ఇజ్రాయెల్ లోపలే ఇరాన్ వేసిన ఈ ఎత్తుగడలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ లోపల జరుగుతున్న ఈ రహస్య యుద్ధం అమెరికా ఆధిపత్యానికి ముగింపు లుకుతుందా..? ఇరాన్ తన పగను ఇలాగే కొనసాగిస్తుందా..? అనేది చూడాలి.