Top story:అజిత్ దోవల్ ఆపరేషన్.. మొసాద్ ను రంగంలో దింపేందుకు ప్లాన్..?
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ. పాకిస్తాన్ విషయంలో ముందు నుంచి కఠినంగా ఉంటున్న మోడీ సర్కార్ ఇప్పుడు కచ్చితంగా దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పదేపదే ఉగ్రవాదులను దేశంలోకి పంపిస్తున్న పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు కేంద్ర సర్కార్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది.
సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను పదుల సంఖ్యలో భారత్ కు పంపిస్తున్న పాకిస్తాన్.. ఇప్పటికే అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలతో ఉక్కరి బిక్కిరి అవుతుంది. 27 మంది భారత పౌరుల ప్రాణాలు తీసిన పాకిస్తాన్ విషయంలో మోడీ సర్కార్ ఇప్పుడు.. ఓ వ్యూహం ప్రకారం దాడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురిపెట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మన సరిహద్దుల్లో వందల మంది ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించిన భారత నిఘా వర్గాలు.. వారిని అంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. కేంద్ర రక్షణశాఖ తో కలిసి.. పనిచేస్తున్న దోవల్.. ఈ విషయంలో ఇజ్రాయిల్ సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. వంటి సంస్థలు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిఘా పెట్టాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ నిఘా సంస్థ మోసాద్ ను సరిహద్దుల్లో రంగంలోకి దించేందుకు అజిత్ దోవల్ సిద్ధమయ్యారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దల అనుమతితో.. మోసాద్ నుంచి మొత్తం 25 మంది అధికారులను భారత్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. వారి సహకారంతో సరిహద్దుల్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు.. వారికి స్థానికంగా సహకరించే వారెవరు.. వారికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఉగ్రవాదుల ప్రధానంగా భారత్ లోకి వచ్చే మార్గాలు ఏంటి.. వాళ్లు ఏ కాలంలో ఎక్కువగా భారత్ లో అడుగు పెడుతున్నారు.. అడుగుపెట్టిన తర్వాత వాళ్లను రిసీవ్ చేసుకునేది ఎవరు.. స్థానికంగా వారికి ఎవరైనా ఆయుధాలు సమకూరుస్తున్నారా.. వంటివి ఇప్పుడు తెలుసుకుని పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇవ్వాలని అజిత్ దోవల్ ఓ ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ముఖ్యంగా కాశ్మీర్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది అనేది భారత్ అనుమానం. అందుకే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు నిఘావర్గాలు. అదేవిధంగా వాళ్లకు టెక్నాలజీ సపోర్ట్ ఎక్కడి నుంచి లభిస్తుంది అనే దానిపై కూడా భారత్ సమాచారం సేకరించినందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. కాశ్మీర్లో ఉన్న స్థానికుల నుంచి పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు లభించడంతోనే ఈ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. అందుకే స్థానికులు పైనే ఎక్కువగా గురిపెట్టి.. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ ప్రణాళికలు రచిస్తోంది.









