Top Story: 13ఏళ్ల జనసేన ప్రస్థానం…ది రైజ్ అండ్ రూల్…!

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు...ఇది పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలో చెప్పిన డైలాగ్‌. దీన్ని రీల్ లైప్‌లోనే కాదు...రియల్‌ లైఫ్‌లోనూ పాటిస్తున్నారు. రాజకీయ పార్టీని స్థాపించడమే కాదు...దాన్ని 13 ఏళ్ల పాటు నడిపించడం

Post Published By: dialnews
Updated : 14 March 2026, 8:00 PM IST

ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు...ఇది పవన్‌ కల్యాణ్‌ తన సినిమాలో చెప్పిన డైలాగ్‌. దీన్ని రీల్ లైప్‌లోనే కాదు...రియల్‌ లైఫ్‌లోనూ పాటిస్తున్నారు. రాజకీయ పార్టీని స్థాపించడమే కాదు...దాన్ని 13 ఏళ్ల పాటు నడిపించడం అంత ఈజీ కాదు. కానీ పవర్ స్టార్‌ మాత్రం చేసి చూపిస్తున్నారు. తానేంటో...తన రాజకీయ పార్టీ లక్ష్యాలు ఏంటో చేతల్లో చూపిస్తారు. అప్పడు తగ్గాడు కాబట్టి 2024 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. జనసేన 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై
పవన్‌ కల్యాణ్‌...ఈ పేరు చెబితేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్‌ పవన్‌కు మాత్రమే సొంతం. సినిమాల్లో నటిస్తూనే జనసేన పార్టీని స్థాపించారు.

13 రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రజారాజ్యం పరిస్థితే ఎదురవుతుందన్నారు. ఎన్నాళ్లు నడుపుతాడో చూద్దామంటూ కామెంట్లు చేశారు. ప్రత్యర్థుల నుంచి ఎన్నో అవమానాలు పడ్డారు. కష్టం వచ్చిందని ఏనాడు కుంగిపోలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు చోట్ల ఓడిపోయినా...జనసేన పార్టీ ఒక్క అసెంబ్లీ సీటుకు పరిమితమైనా వెన్నుచూపలేదు. సమయం కోసం వేచి చూశారు. ప్రత్యర్థుల అవహేళనలనే ప్రశంసలుగా స్వీకరించాడు. విమర్శలను సద్విమర్శలుగా తీసుకున్నాడు. పదేళ్లపాటు కనీసం చట్టసభలో అడుగుపెట్టలేకపోయారు. వైఫల్యాలకు వెరవకుండా ఎదురొడ్డి నిలబడ్డారు. వెన్నుచూపకుండా ప్రజాక్షేత్రంలోనే తలపడ్డాడు. విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు.

ఆవిర్భావం నుంచి పాలన వరకు జనసేన ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా...ఏపీ హక్కుల కోసం ప్రశ్నించే గొంతుక అంటూ...2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో NDA కూటమికి మద్దతు పలికారు. టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో పవన్ విభేదించారు. ప్రత్యేకహోదా విషయంలోనూ గట్టిగా గళం వినిపించిన పవన్‌, బీజేపీతోపాటు, టీడీపీపైనా విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కాకుండా వామపక్షాలు, BSPతో కలిసి పోటీచేశారు. 2019 ఎన్నికల్లో జనసేన కేవలం రాజోలు స్థానంలో మాత్రమే గెలిచింది. పవన్‌కల్యాణ్‌ స్వయంగా పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో ఓటమిపాలయ్యారు. గెలిచిన ఒక్క MLA కూడా వైఎస్సార్సీపీ పంచన చేరారు. పార్టీ తరఫున పోటీచేసిన కొందరు నాయకులూ జనసేనను వీడివెళ్లారు. కష్టకాలంలోనూ పవన్‌ మొండి పట్టుదలతో పార్టీని ముందుకు నడిపారు.

2024 అసెంబ్లీ ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు సమయంలో...సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయం జనసేన రూపురేఖలను మార్చేసింది. రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించడమే కాదు...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ప్రకటించి కట్టుబడ్డారు. ప్యాకేజీస్టార్‌ అని, చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. సీఎం స్థాయిలో ఉన్న జగన్‌, పవన్‌ వ్యక్తిగత జీవితంపైనా విమర్శలతో అక్కసు వెళ్లగక్కారు. జగన్‌ను అథఃపాతాళానికి తొక్కితీరతానని సవాల్‌ విసరడమే కాకుండా నిజం చేసి చూపారు పవన్.టీడీపీతో జట్టు కట్టి ఎన్నికల్లో కలబడ్డాడు. 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేశారు. వందశాతం స్ట్రైక్‌ రేటు సాధించాడు. భారత రాజకీయ చరిత్రలో పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచిన ఏకైక రాజకీయ పార్టీగా జనసేన రికార్డు సృష్టించింది. 21 సీట్లలో గెలవడమే కాదు...కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్ల పోరాట ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలో భాగస్వామి అయ్యారు. నాడు వెక్కిరించిన నోళ్లే...ఈ ఫలితాల తర్వాత పొగడ్తలు కురిపించారు. జనసేన అవిర్భావం దినోత్సవం సందర్బంగా ప్రత్యేక వీడియోల్‌ను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవంటూ పోస్ట్‌ పెట్టింది.

Published : 
  • 14 March 2026, 8:00 PM IST