రాజకీయాల్లో మనం ఏదో అనుకుంటే... ఇంకేదో అవుతుంది. చివరికి మనకే చిరిగి చాట అవుద్ది. వైసీపీ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఏడాది ఆరంభంలో వైసిపికి మూడు మంచి అంశాలు అడ్వాంటేజ్ అయ్యాయి. ఆ మూడు అం శాలపై కనీసం రెండు నెలల పాటు ఆ పార్టీ క్యాడర్ కి నాయకులకి పని దొరికేది. కానీ అంబటి రాంబాబు నోటి దూల, బూతు రాజకీయం వల్ల ఆ మూడు అంశాలు తో వచ్చిన మైలేజ్ మొత్తం పోయింది. తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కళేబరాల అవశేషాలు లేవని, అనిమల్ ఫ్యాట్ లేదని సిబిఐ తన చార్జిషీట్లో పేర్కొంది. ఆ విషయాన్ని వైసీపీ నేతలు చాలా వేగంగా అందిపుచ్చుకొని జనంలోకి తీసుకెళ్లగలిగారు.
వైసిపి సోషల్ మీడియా కూడా చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ ,లోకేష్ లను టార్గెట్ చేస్తూ ఆరోజు వాళ్లు ముగ్గురు మాట్లాడింది అసత్యమని ఆ ఒక్క పాయింట్ పైనే ప్రచారం బాగా చేయగలిగింది . టిడిపి జనసేన తమ రాజకీయం కోసం తిరుమలను వాడుకున్నారని జనాన్ని నమ్మించగలిగింది. అదే సమయంలో విశాఖ లో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములన్ని, మళ్లీ ఆ యూనివర్సిటీకే కట్టబెట్టడం.... లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ.... శ్రీ భరత్ కి ఏపీ సర్కార్ 1000 కోట్ల విలువైన భూములను దోచిపెట్టడాన్ని వైసీపీ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. దీనిపై టిడిపి గట్టిగా కౌంటర్ కూడా ఇవ్వలేకపోయింది.
అదే సమయంలో జనసేన రైల్వే కోడూర్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అశ్లీల వ్యవహారాలు, అక్రమ సంబంధాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేలు ఎంతగా బరితెగించి వ్యవహరిస్తున్నారో... అసెంబ్లీ హాల్ నుంచి ఏకంగా బూతు వ్యవహారాలు ఎలా నడుపుతున్నారు అరవ శ్రీధర్ వ్యవహారం బయటపెట్టింది. దీనివల్ల జనసేనతో పాటు కూటమి పార్టీలైన.. టిడిపి బిజెపి పరువు కూడా పోయింది.తిరుమల లడ్డూ నెయ్యి లో జంతు కొవ్వు లేదని తేలిపోవడం, విశాఖలో ప్రభుత్వ భూములను గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడానికి నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ తెగబడడం, పెళ్లయిన మహిళతో అరవ శ్రీధర్ నగ్న వీడియోలు ఈ మూడు వ్యవహారాలు కూటమిని భ్రష్టు పట్టించాయి. వీటిని జనంలోకి వైసిపి నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా బాగా తీసుకెళ్ల గలిగారు.
సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మొత్తం సీన్ ని మార్చేశాయి.సరిగ్గా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్న టిడిపి మొత్తం ఈ వ్యవహారాన్ని టేక్ ఓవర్ చేసింది. అంబటి ఇంటి పై దాడి ఆ తర్వాత పరిణామాలు అన్ని చంద్రబాబు కి సానుభూతిని తెచ్చిపెట్టాయి. పెద్దాయనని అంత మాట అనడం అందరినీ బాధ పెట్టింది. ఈ వ్యవహారంలో అంబటి దే తప్పని జనం అంతా అభిప్రాయపడ్డారు. అంబటి ఇంటి పై దాడి జరిగిన,.... ఆయన్ని అరెస్టు చేసిన... వైసీపీకి సానుభూతి రాలేదు. పైగా ఈ మూడు అంశాలు పక్కదారి పట్టిపోయాయి.
మొత్తం అంబటి బూతులు చుట్టే వ్యవహారం తిరిగింది. లడ్డు, గీతం యూనివర్సిటీ భూములు, అరవ శ్రీధర్ అరాచకాలు మూడు వివాదాస్పద అంశాలు తెరవెనకి వెళ్లిపోయాయి. ఇప్పుడు ఇదే విషయంపై వైసీపీ జుట్టు పీక్కుంటోంది. అంబటి రాంబాబు పార్టీకి చేసిందేమీ లేకపోయినా.... నోటి దూలతో మొత్తం వైసీపీకి వచ్చిన మైలేజీని నాశనం చేశాడని అధిష్టానం నుంచి కిందిస్థాయి లీడర్ వరకు తిట్టుకుంటున్నారు.ఈ మూడు అంశాల్లో ఇరుక్కొని గిలగల కొట్టుకుంటున్న టిడిపి అంబటి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంది. చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఈ వ్యవహారంలో సానుభూతి సంపాదించడమే కాక ఆ మూడు వివాదాస్పద అంశాలను జనం మర్చిపోయినట్టు చేయగలిగింది టిడిపి.