నువ్వు ఒక మేయరా…?: ఏపీ హైకోర్ట్ ఫైర్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో... ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 20 November 2024, 5:00 PM IST

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో... ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుపై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. నగర మొదటి పౌరుడు మాట్లాడేది అలాగేనా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసభ్య పదజాలంతో దాడి చేస్తారా అంటూ హైకోర్టు ప్రశ్నలు సంధించింది. అసభ్య భాష వాడేవారు ఏ పార్టీవారైనా శిక్షించాల్సిందే అన్న హైకోర్టు... సేవ ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలి.. అసభ్యకర భాషతో కాదని హైకోర్టు సూచించింది. బాధ్యతగా మెలగాలని మేయర్ కు చెప్పాలని ఆయన న్యాయవాదికి సూచించింది. మనోహర్ నాయుడుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను కోర్ట్ ఆదేశించింది.

Published : 
  • 20 November 2024, 5:00 PM IST