Top story:కొడుకు, కూతురు దగ్గరకు సీఎం విజయ్… సీఎం విజయ్ లండన్ పర్యటన వెనుక అసలు రహస్యం..? కుటుంబంతో రాజీ ప్రయత్నాలు..?

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న దళపతి సి. జోసెఫ్ విజయ్ వచ్చే నెలలో ఒక కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Post Published By: dialnews
Updated : 20 May 2026, 3:01 PM IST

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్న దళపతి సి. జోసెఫ్ విజయ్ వచ్చే నెలలో ఒక కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే, ఈ పర్యటన ఏలాంటి అధికారిక ప్రభుత్వ పనుల కోసం కాదని, పూర్తిగా ఆయన వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలకు సంబంధించినదని తెలుస్తోంది. దాదాపు ఒక వారం నుండి పది రోజుల పాటు విజయ్ లండన్ లో పర్యటించనున్నట్లు సమాచారం.రాజకీయ వర్గాల్లో మరియు అటు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి విజయ్ తన కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా భేటీ కానున్నారు. గత కొంతకాలంగా విజయ్ కుటుంబంలో కొన్ని వ్యక్తిగత విభేదాలు లేదా దూరం పెరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లోకి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కుటుంబ సభ్యులు కొందరు లండన్‌లోనే స్థిరపడి నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న విజయ్, వచ్చే నెలలో లండన్ వెళ్లి వారందరినీ స్వయంగా కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం "కుటుంబంలో రాజీ కుదుర్చుకోవడం" అని చెన్నై రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో వచ్చిన మనస్పర్థలను పక్కన పెట్టి, కుటుంబం అంతా మళ్లీ ఒక్కటి కావాలనే పట్టుదలతో విజయ్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని విజయవంతంగా పాలిస్తున్న విజయ్.. అటు కుటుంబ పరంగా కూడా అందరినీ కలుపుకుని వెళ్లాలని, ఎక్కడా ఎలాంటి చిన్న వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారట.ఈ లండన్ వేదికగా జరగబోయే భేటీతో కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలకు ఎండ్ కార్డ్ పడబోతోందని టాక్. తల్లిదండ్రులతో గత వివాదాల పరిష్కారం దిశగా కూడా అడుగులు పడుతున్నాయి.

గతంలో తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ పెట్టిన రాజకీయ పార్టీ విషయంలోనూ, ఆ తర్వాత జరిగిన కొన్ని ఆస్తి/వ్యక్తిగత వివాదాల విషయంలోనూ వచ్చిన దూరాన్ని పూర్తిగా చెరిపేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నారు. భార్య సంగీత, పిల్లల మద్దతు కోసం లండన్ వెళ్తున్నాడని టాక్. గత కొన్ని కీలక ఈవెంట్లలో విజయ్ భార్య సంగీత కనిపించకపోవడంతో రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే విజయ్ రాజకీయాల్లోకి రావడం వెనుక మరియు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వెనుక కుటుంబం అంతా ఏకతాటిపైకి రావడం ఎంతో అవసరం.లండన్ వేదికగా భార్య, పిల్లలతో గడిపి, వారి పూర్తి మద్దతును బహిరంగంగా ప్రకటించే అవకాశం కూడా ఉందని కొందరు చర్చించుకుంటున్నారు. విజయ్ లండన్ పర్యటన కేవలం వ్యక్తిగతమైనదే అయినప్పటికీ, తమిళనాడు రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే, రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి తీసుకుంటున్న మొదటి సుదీర్ఘ విదేశీ విరామం ఇదే. లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత విజయ్ సరికొత్త ఉత్సాహంతో, అటు కుటుంబ మద్దతుతో మరింత పవర్‌ఫుల్‌గా పాలన సాగిస్తారని ఆయన అభిమానులు, టీవీకే శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 20 May 2026, 3:01 PM IST