Top story: దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసిన హైకోర్టు..!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 19 September 2026, 10:59 AM IST

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.. . ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయింపుకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దానం నాగేందర్ స్వచ్ఛందంగా తన అసలు పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించే సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.పిటిషనర్ల వాదన ప్రకారం.. బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్‌లో చేరడం, అంతేకాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం పార్టీ ఫిరాయింపుగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అసలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లుగా భావించాల్సి ఉంటుందని వారు వాదించారు.

ఈ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఆగస్టు 22న వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు వెలువరించనున్నట్లు ప్రకటించినప్పటికీ, అనంతరం తీర్పును సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది.ఈ కేసు నేపథ్యానికి వస్తే.. దానం నాగేందర్‌తో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. 2025 జూలై 31న సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు పార్టీ ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం స్పీకర్ ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి పలువురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.

దానం నాగేందర్‌కు సంబంధించిన స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో.. ఆయన 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే అనర్హత వర్తింపజేయాలని పిటిషనర్ కోరారు. ఎమ్మెల్యేగా అందుకున్న వేతనం, ఇతర ప్రయోజనాలను కూడా తిరిగి రాబట్టాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.తాజా హైకోర్టు తీర్పుతో దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై కీలక పరిణామం చోటుచేసుకున్నట్లైంది. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టడంతో పాటు అనర్హతను ప్రకటించిన నేపథ్యంలో ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Published : 
  • 19 September 2026, 10:59 AM IST