Top story:పవన్ కు మాట వినని ఐఏఎస్ లు..? వైసీపీ ఎఫెక్ట్ తో ఇబ్బందులు..?

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మాట అధికారులు వింటారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాలపై సాధారణ ప్రజల్లో ఉండే ఒపినియన్ ఇది.

Post Published By: dialnews
Updated : 1 March 2026, 12:04 PM IST

అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల మాట అధికారులు వింటారు. ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాలపై సాధారణ ప్రజల్లో ఉండే ఒపినియన్ ఇది. కానీ ఏపీలో సీన్ రివర్స్ లో కనపడుతోంది. ఏపీ సచివాలయంలో డిఫరెంట్ సీన్ లు మంత్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలకు ఐఏఎస్ లు తలనొప్పిగా మారిపోయారు. అసలు ఏంటీ అనేది ఈ కథనంలో చూద్దాం. 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన నాటి నుంచి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారిపోయారనే విమర్శలు వచ్చేవి.

శ్రీలక్ష్మి లాంటి ప్రతిభ ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా అప్పట్లో రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించి, జైలు జీవితం కూడా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఆనాటి నుంచి కూడా రాజకీయ పార్టీలకు అనుకూలం, వ్యతిరేకం అనే ముద్రలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపై పడిన మాట వాస్తవం. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ సర్కార్ ను కూడా కొందరు ఐఏఎస్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే చర్చలు ఏపీ సచివాలయంలో వినపడుతున్నాయి.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రూల్స్ బ్రేక్ చేసి.. వెంకట్రామిరెడ్డి వంటి ఉద్యోగులతో పాటుగా, సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా, సునీల్ నాయక్ వంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రూల్స్ బ్రేక్ చేసారనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఇలాంటి అధికారుల ప్రభావం ఏపీలో సచివాలయంలో కనపడుతోంది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అసలు సచివాలయంలో ఏం జరుగుతుందో కూడా.. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా తెలియటం లేదని టాక్.

వైసీపీ అభిమానులనే గుర్తింపు ఉన్న కొందరు ఐఏఎస్ అధికారులు.. కుట్ర చేస్తున్నారనే మాట వినపడుతోంది. వైసీపీకి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు ఉంటున్నాయనే మాట వినపడుతోంది. ఎస్సీ, ఎస్టీ అధికారులు, ఉద్యోగుల ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌ల తీరుపై హైకోర్టులో కోర్టు ధిక్కారం కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో ఈ అంశంలో కులాల కుంపటి కోసం కొందరు ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు వైసీపీ అభిమాన అధికారులు.. సిఎం చంద్రబాబును పక్కదారి పట్టిస్తున్నారనే మాటలు వినపడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా దీని గురించి చర్చ ఎక్కువైంది.

మూడు రోజుల నుంచి, కొందరు వైసీపీ అభిమాన ఐఏఎస్ అధికారులు రహస్యంగా సమావేశాలు కూడా నిర్వహించారనే చర్చలు కూడా ఊపందుకున్నాయి. దివ్యాంగుల ప్రమోషన్‌లో రిజర్వేషన్ రద్దు చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిఎం చంద్రబాబును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో ఓ సిఎంఓ అధికారి, జిఏడి అధికారులు కూడా కొందరు ఐఏఎస్ అధికారులతో కలిసి పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసినా కూడా కొందరు పట్టించుకోవడం లేదనే మాట కూడా వినపడటం గమనార్హం.

కూటమి ప్రభుత్వ అనుకూల ఐఏఎస్ లు కూడా సైలెంట్ కావడం వెనుక కారణం ఏంటీ అనేది అర్ధం కాని పరిస్థితి. ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రమోషన్‌ ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాల్సిందే అని, న్యాయస్థానం సూచించిన మార్గదర్శకాలు పాటించాలని ఎప్పటి నుంచో ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులు, అధికారులు పోరాటాలు కూడా చేస్తున్నారు. హైకోర్టులో కోర్టు ధిక్కారణ కేసు ఉన్న విషయం సదరు ఐఏఎస్ అధికారులకు కూడా క్లారిటీ ఉంది. 20 శాతం ఉద్యోగులు, అధికారుల కోసం నిబంధనలను పక్కన పెడుతుంటే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహారాలు జరుగుతుంటే.. మిగిలిన 80 శాతం మంది ఉద్యోగులు ఏం చేస్తున్నారనే ప్రశ్న వినపడుతుంది. వైసీపీ హయాంలో నాటి సిఎంకు క్లోజ్ గా ఉన్నవారే.. ఇప్పుడు సిఎం ను తప్పుదోవ పట్టిస్తున్నారనే మాట వినపడుతోంది. పంచాయితీ రాజ్, అటవీ శాఖల్లో ఉన్న కీలక అధికారుల శైలి కూడా ఇలాగే ఉందంటూ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Published : 
  • 1 March 2026, 12:04 PM IST