Top story:పాకిస్తాన్‌లో భారత ధురంధర్‌లు… పహల్గాం హ్యాండ్లర్, కల్నల్ హతం…!

బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో బలూచిస్తాన్‌ దద్దరిల్లుతున్న వేళ పాకిస్తాన్ నేత నఖ్వీ చేసిన ఆరోపణలే ఇవి. తమ దేశంలోని పరిస్థితులకు భారతే కారణమనీ

Post Published By: dialnews
Updated : 3 February 2026, 1:20 PM IST

బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులతో బలూచిస్తాన్‌ దద్దరిల్లుతున్న వేళ పాకిస్తాన్ నేత నఖ్వీ చేసిన ఆరోపణలే ఇవి. తమ దేశంలోని పరిస్థితులకు భారతే కారణమనీ. ముఖ్యంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించాడు. ఇక్కడే భారత్ సీన్‌లోకి వచ్చింది. పాక్ చేసిన నిరాధార ఆరోపణలను ఖండించిన భారత్.. ఎప్పటిలాగే తమ అంతర్గత వైఫల్యాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ రచించిన సాధారణ వ్యూహమే అని చెప్పింది. ఇలాంటి దాడులు జరిగిన ప్రతిసారీ పనికిమాలిన వాదనలు చేసే బదులు.. బలూచిస్తాన్ ప్రాంత ప్రజల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి సారించాలని గడ్డి పెట్టింది. తెరవెనుక బలూచిస్తాన్ పరిస్థితులను అడ్డుపెట్టుకుని భారత్‌ను టార్గెట్ చేస్తున్నారు కానీ, పాకిస్తాన్ అసలు కడుపు మంట అది కాదు. తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్‌ గురించే ఇస్లామాబాద్ ఆందోళన అంతా.

పాకిస్తాన్‌లో గత కొన్నేళ్లుగా భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల ఎలిమినేషన్ జరుగుతోది. గుర్తు తెలియని అజ్ఞాత వ్యక్తులు పక్కాగా ప్లాన్ చేసి ఉగ్రవాదులకు పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్లు దించుతున్నారు. అదికూడా భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులనే వెంటాడుతున్నారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత డెడ్‌బాడీ, బుల్లెట్ షెల్స్ తప్ప క్రైమ్ సీన్‌లో ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు.గతంలోవాళ్లందరినీ అజ్ఞాత వ్యక్తులుగా పేర్కొనేవారు. ఇప్పుడు మాత్రం ధురంధర్లుగా పిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఆపరేషనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పహల్గాం ఉగ్రవాద దాడి ప్లాన్‌కు కారణమని భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పక్కాగా ప్లాన్ చేసి హతమార్చారు. ఇమ్రాన్ దయాల్‌ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడు. జనవరి 28వ తేదీన డేరా ఇస్మాయిల్ ఖాన్‌ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన కాల్పుల్లో ఇమ్రాన్ దయాల్‌ చనిపోయాడు.కానీ, స్పాట్‌లో బుల్లెట్ షెల్స్ డెడ్‌బాడీ తప్ప ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇక్కడే పాకిస్తాన్‌‌కు ఇది భారత ధురంధర్ల పనికావచ్చనే అనుమానం వచ్చింది.

మరోవైపు.. ఈ దాడి ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని ప్రకటించారు. కానీ, దాడి కారణంగా ఇమ్రాన్‌ వాహనం పూర్తిగా దెబ్బతిన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కడం లేదు. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత సన్నిహితుడు కావడం, గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ఇమ్రాన్ ముఖ్య కారకుడిగా ఉండటంతో అతడి ఎలిమినేషన్ వెనుక భారత్ హస్తం ఉండొచ్చని ఇస్లామాబాద్‌ నమ్ముతోంది.

ఇక్కడ భారత్‌ను బ్లేమ్ చేయడానికి వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతం ఆధారాలు సేకరించే పనిలోనే ఉన్నారు. కానీ, ఆ దిశగా వారు ఎటువంటి విజయం సాధించలేరు. ఎందుకంటే, ఇదే తరహా లో ఇప్పటివరకూ చాలా హత్యలు జరిగాయి. వాటిలో ఒక్కదానికీ భారత్ కారణం అని చెప్పే ఆధారం దొరకలేదు. దొరకదు కూడా. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌లో ఉన్నది భారత్‌ దురంధర్‌లు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. భారత్‌కు చెందిన సీక్రెట్‌ ఏజెంట్లే వారిని పక్కాగా ఎలిమినేట్ చేస్తున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.నిజానికి.. తమ దేశంలో జరుగుతున్న టార్గెట్ కిల్లింగ్స్ విషయంలో పాక్ నాయకులకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలీని పరిస్థితులున్నాయి.

ప్రపంచంలోనే టాప్ నిఘా సంస్థల్లో ఒకటిగా చెప్పుకునే ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI కూడా వీటిని ముందే పసిగట్టలేకపోతోంది. టెర్రరిస్టు హతమైన తర్వాత కూడా ఆధారాలు సేకరించలేకపోతోంది. ఇలాంటి హత్యలు అండర్ కవర్ ఏజెంట్లు తప్ప మరెవరూ చేయలేరన్న సంగతి ISIకు తెలుసు. కానీ, వారిని గుర్తించడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉంది. ఏకంగా సైన్యంలోని టాప్ లెఫ్టినెంట్ కల్నల్‌నే ఈ రేంజ్‌లో ఎలిమినేట్ చేయడం చూసిన తర్వాత ఆర్మీలోని ఇతర అధికారుల్లోనూ భయం మొదలైంది. ముఖ్యంగా భారత్‌లో ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్న వాళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ మొత్తం వ్యవహా రంలో భారత్‌ను ఏం చేయలేక పాకిస్తాన్ లీడర్లు బలూచిస్తాన్‌లో దాడుల వెనుక భారత్ హస్తముందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలతో ఒరిగేదేమీ ఉండదు. ధురంధర్‌ల దూకుడును అడ్డుకోనూ లేరు.

 

Published : 
  • 3 February 2026, 1:20 PM IST