బొండా సిద్ధార్థ్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా..? వంగవీటి రాధాను దెబ్బతీసిన లోకల్ ఈక్వేషన్స్..!

విజయవాడ నగర రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి మేయర్ పీఠంపై టాలీవుడ్ రేంజ్ సస్పెన్స్ నడుస్తోంది.

Post Published By: dialnews
Updated : 4 September 2026, 2:23 PM IST

విజయవాడ నగర రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడి మేయర్ పీఠంపై టాలీవుడ్ రేంజ్ సస్పెన్స్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం మేయర్ సీటుకు డైరెక్ట్ ఎలక్షన్ ప్లాన్ చేస్తుండటంతో, లీడర్ల మధ్య లోపాయికారీ ఫైట్ పీక్స్‌కు చేరింది. ప్రస్తుతానికైతే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు బొండా సిద్ధార్థ్ పేరు టాప్‌లో వినిపిస్తోంది. అదే సమయంలో మరో పాపులర్ లీడర్ వంగవీటి రాధాకృష్ణ గ్రాఫ్ మాత్రం కొన్ని లోకల్ ఈక్వేషన్స్ వల్ల ఒక్కసారిగా డౌన్ అయినట్లు కనిపిస్తోంది.

రాజకీయాల్లో ‘టైమింగ్ అండ్ లాయల్టీ’ చాలా ముఖ్యం. గత ఐదేళ్ల వైసీపీ రూలింగ్‌లో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. చాలా మంది లీడర్లు సైలెంట్ అయిపోయినా, బొండా ఫ్యామిలీ మాత్రం పచ్చ జెండాను గట్టిగా పట్టుకుని నిలబడింది. కేసులు, ఇబ్బందులు వచ్చినా ఎదురొడ్డి నిలిచారు. ఇప్పుడు అదే ‘విధేయత’ కార్డు బొండా సిద్ధార్థ్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. "కష్టకాలంలో పార్టీతోనే ఉన్నాం.. గ్రౌండ్ లెవెల్‌లో కేడర్‌ను కాపాడుకున్నాం" అనే పాయింట్ చంద్రబాబు నాయుడి వద్ద సిద్ధార్థ్‌కు గట్టి మైలేజ్ ఇచ్చింది. పైగా విద్యావంతుడైన యువకుడికి ఛాన్స్ ఇస్తే బెజవాడ కార్పొరేషన్‌కు కొత్త గ్లామర్ వస్తుందని పార్టీలోని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది.

ఇక వంగవీటి రాధాకృష్ణ విషయానికి వస్తే, ఆయనకు మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కొన్ని కీలక అంశాలు మేయర్ రేసులో ఆయనకు బ్రేకులు వేస్తున్నాయి. రాధాకృష్ణ నిరంతరం విజయవాడ లోకల్ పాలిటిక్స్‌లో గానీ, పార్టీ కార్యక్రమాల్లో గానీ చురుగ్గా ఉండరనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఎన్నికలప్పుడు స్టార్ క్యాంపెయినర్‌గా నాలుగు నియోజకవర్గాల్లో మెరిసి, ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయిపోవడం కేడర్‌కు పెద్దగా నచ్చడం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా, టీడీపీ అధినాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి ప్రత్యర్థి నేతలతో రాధాకు ఉన్న పర్సనల్ దోస్తీలు ఈ టైంలో ఆయనకు గట్టి డ్యామేజ్ చేశాయి. కష్టకాలంలో పార్టీ కోసం దెబ్బలు తిన్న తమ్ముళ్లు ఈ స్నేహ సమీకరణాలను అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఈ రెండు భిన్నమైన గ్రౌండ్ రిపోర్ట్స్‌ను పరిశీలిస్తే.. పార్టీ కోసం నిలబడిన బొండా సిద్ధార్థ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Published : 
  • 4 September 2026, 2:23 PM IST